జాజితీగకు సోగచిర్నవ్వు కోసం

వెన్నెలతో బాట వేసాను
తారకల దీపాల్ని అమర్చాను
పూలని దారి పొడుగునా పోసాను
నా గుండె గదికి రావడం
ఇక నీదే ఆలస్యం

జలపాతాల సంగీతాన్నీ
హరివిల్లు రంగుల చిత్రాలనీ
సవ్వడి లేని గాలి పాటనీ
తీసుకొచ్చాను
వాటిలో జీవం నింపగలిగినది
నువ్వు మాత్రమే

పూర్ణిమా సాయం చంద్రాగమనమూ
అమృతం కురిసిన రాత్రులూ
వార్షకాభ్రుకాలూ గ్రీష్మతాపమూ
శిశిర నిశీధులూ
నీ తోడు లేనపుడు
అసంపూర్తి కావ్యాలు

గుడి కోనేటి ఒడ్డున
మర్రి చెట్టు నీడలో
ఆడుకున్న వేసవి మధ్యాహ్నాలూ

గోదావరిలో పడుతున్న చినుకుల్ని
తన్మయంగా చూస్తూ
తడిసిపోయిన సాయంత్రాలూ

అరవిచ్చిన నందివర్ధనాలు
పూర్తిగా విరిసేంతవరకూ
ఆతురతతో యెదురుచూసిన ధనుర్మాసాలూ

అన్నీ

నీ కోసమా పొగడ నీడలో
యెదురుచూసిన నిరీక్షణ కంటె
చిన్నవే

ముద్దబంతి పూల కోసం
చెల్లాయిల కొట్లాటా
దేవుడి దగ్గర అమ్మ పాటా
కలిపి గుచ్చిన దండలా
అందంగా కవ్విస్తూ నువ్వు

శంకరుడి సౌందర్యలహరీ
కాళిదాసు కుమారసంభవమూ
చూపిన పార్వతి తప్ప
నీ అందాన్ని వర్ణించడానికీ సరిపోల్చడానికీ
మాటల్లేవ్

నీ సోగ చిర్నవ్వు విరిసే
వొక్క క్షణాన్ని
నాకియ్యి

నీ దర్శన భాగ్యాన్ని
నా యింటి కిటికీనల్లుకున్న
జాజితీగకియ్యి

(ఆంధ్రప్రభ)

28 Comments (+add yours?)

  1. kastephale
    Jul 09, 2012 @ 10:09:09

    ఎవరికోసమో అర్ధంకాలా 🙂

    Reply

  2. the tree
    Jul 09, 2012 @ 17:34:12

    oka poola dandala entha chakkaga kalupukuntuvellaaro, mee bhavalanu,
    ekkada chinna break kooda lekunda, nice one , keep writing.

    Reply

  3. srinath
    Jul 09, 2012 @ 19:08:39

    గోదావరిలో పడుతున్న చినుకుల్ని
    తన్మయంగా చూస్తూ
    తడిసిపోయిన సాయంత్రాలూ

    ee part chala bavundi

    Reply

  4. శ్రీ (జలతారు వెన్నెల)
    Jul 10, 2012 @ 06:41:37

    ఫణీంద్ర గారు, నాకు చాలా నచ్చిందండి.I should say I read it so many times… and I loved all the lines but felt that these lines are special”ముద్దబంతి పూల కోసం
    చెల్లాయిల కొట్లాటా
    దేవుడి దగ్గర అమ్మ పాటా
    కలిపి గుచ్చిన దండలా
    అందంగా కవ్విస్తూ నువ్వు”….
    This is a very sweet poem……
    ఎవరి సోగ చిర్నవ్వు మీద ఈ కవిత రాసారో కాని…
    ఇది మాత్రం ఊహ అయితే, మీ ఊహ కూడా ఇంత అందం గా ఉంటుందా?

    Reply

  5. శ్రీ (జలతారు వెన్నెల)
    Jul 10, 2012 @ 06:47:37

    మాదకత అంటే?

    Reply

  6. rpratapa
    Jul 10, 2012 @ 12:04:12

    Marananiki kamma kotti, jajulatho jata kaduthunnav.. you are politicising it! Journalist Dreamithe anthenemo mari.. 🙂

    Reply

  7. Sri (jalathaaru vennela)
    Jul 10, 2012 @ 16:56:43

    I left a comment and did not see that published. Hopefully it was deleted by mistake..
    If that is not the case, I understood the message passed. Thanks….

    Reply

  8. merajfathima
    Jul 10, 2012 @ 16:58:20

    sir kavitha chaalaa baagundi, goppa bhaavukatha undi mee kavitwamlo. manchi padaalatho koorchina kavithaa maala.

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Jul 11, 2012 @ 11:59:31

      మెరాజ్ ఫాతిమా గారూ… బహుశా 2000 సం.లో అనుకుంటా, ఆంధ్రప్రభ వాళ్ళు ప్రేమలేఖల పోటీ పెట్టారు. దానికోసం అల్లరిచిల్లరగా రాసినదే ఈ కపిత్వం. అంతే తప్ప ఇందులో పెద్ద భావుకత్వమేమీ లేదండీ. ఏదేమైనా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

      Reply

  9. ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jul 11, 2012 @ 12:02:20

    మిత్రులందరికీ….
    మొన్న ఈ టపా పెట్టిన తర్వాత వేరే పనిలో పడిపోయా. ఇవాళ్టి వరకూ అంతరజాలంలోకి రానే లేదు. అందువల్లే మీ స్పందనలకు వెంటనే ప్రతిస్పందించలేకపోయా. ధన్యవాదాలు.

    Reply

  10. veenaalahari
    Jul 11, 2012 @ 21:14:21

    ప్రకృతిని,ఋతువులను, గడచిపోయిన తిరిగి చూడలేని మధుర స్మృతులను కలిపి చాలా అందమైన ప్రేమలేఖ వ్రాసారు.ఊహ మాత్రమే అన్నారు నిజంగా రాసినా కాదనగల వారెవ్వరూ ఇంత అందమైన భావాలను.

    Reply

  11. రసజ్ఞ
    Jul 12, 2012 @ 02:39:51

    అసలు ఇంత మంచి టపా నేనెలా మిస్ అయ్యానో అర్థం కాలేదు 😦 భావ వ్యక్తీకరణ చాలా బాగుందండీ! నీ కోసమా అన్న పదం దగ్గర ఆగాను. నీ కోసమా? ఇక్కడ ఇలా రాకూడదే అని మళ్ళీ చదవగా “నీ కోసం ఆ” అని తరువాత వెలిగింది. మీ కవిత అద్భుతం. భూతల స్వర్గంలో విహరిస్తున్నట్టు ఉంది.

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Jul 12, 2012 @ 11:39:04

      రసజ్ఞ గారూ…
      నా సందిగ్ధత తరువాతి పంక్తికి సంబంధించి. యెదురు చూసిన నిరీక్షణ… పునరుక్తి కదా. దాన్ని మారుద్దామా అనుకున్నాను కానీ ఓ పదేళ్ళ క్రితం రాసినప్పటి నా అజ్ఞానాన్ని ఇప్పుడు మార్చడం అవసరమా అనిపించి వదిలేశా. ధన్యవాదాలు.

      Reply

  12. పద్మవల్లి
    Jul 12, 2012 @ 06:42:20

    బావుందండీ ఫణీంద్ర గారూ. కొన్ని కొన్ని లైన్లు బాగా నచ్చాయి.
    @@ నా గుండె గదికి రావడం ఇక నీదే ఆలస్యం
    చిత్రాసింగ్ గజల్ “తుమకో హమ్ దిల్ మే బసాలేంగే , తుమ్ ఆవో తో సహీ ” గుర్తొచ్చింది.

    @@ నీ తోడు లేనపుడు అసంపూర్తి కావ్యాలు
    వావ్ ..

    Reply

  13. పద్మవల్లి
    Jul 12, 2012 @ 18:10:59

    ఫణీంద్ర గారూ, ఇది చదివి నాకు అది గుర్తొచ్చింది అన్నాను కానీ, మీకు అది ప్రేరణ అనలేదు . 🙂
    వినాలనుకుంటే ఆ పాట, సెర్చ్ చెయ్యండి ఈజీగానే దొరుకుతుంది.

    Reply

Leave a reply to rpratapa Cancel reply