About

జ్ఞానం లేదా అజ్ఞానం కంటె మిడిమిడి జ్ఞానం ప్రమాదకరమట. కానీ నేనేం చేయను? నాకున్నదే అది. పండిత పుత్రుడినని నేను ప్రత్యేకం నిరూపించుకోనక్కర లేదు.

నా శక్తేంటో నాకు తెలుసు కాబట్టి (లేదా… తెలీదు కాబట్టి) రాయడం కంటె చదవడం మీదనే ఆసక్తి ఎక్కువ. అవధులు లేని స్వేచ్చనిచ్చే మైదానం అంటే గౌరవమున్నా… అవధులను చెరిపేయగల శక్తి ఉన్నా సహనం చూపే చెలియలికట్ట అంటే గౌరవం అభిమానం ప్రేమా…!

గిరికా, రాజేశ్వరీ, గీతాదేవీ, స్వప్నరాగలీనా… వీళ్ళని ఎప్పటికీ మరిచిపోలేకపోడం బలమా? బలహీనతా?

10 Comments (+add yours?)

 1. chinni
  Jun 10, 2012 @ 15:57:26

  గిరికా, రాజేశ్వరీ, గీతాదేవీ, స్వప్నరాగలీనా… వీళ్ళని ఎప్పటికీ మరిచిపోలేకపోడం బలమా? బలహీనతా?
  very nice:) same here

  Reply

 2. నిషిగంధ
  Jun 10, 2012 @ 21:33:44

  గిరికా, రాజేశ్వరీ, గీతాదేవీ, స్వప్నరాగలీనా… వీళ్ళని ఎప్పటికీ మరిచిపోలేకపోడం — ఒక్క స్వప్నరాగలీన విషయంలో తప్ప మిగతా అందరి గురించీ మీతో ఏకీభవిస్తాను..
  స్వప్నరాగలీన నన్ను చాలా నిరాశ పరిచింది.. ఏ ప్రత్యేకతా లేని ఒక దేవతా స్త్రీ.. అంతే!
  🙂

  Reply

  • Phaneendra
   Jun 11, 2012 @ 11:59:13

   మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను, 🙂 ఎప్పుడో స్వప్నరాగలీన గురించి రాస్తాను.

   Reply

 3. నిషిగంధ
  Jun 11, 2012 @ 17:46:55

  తప్పక రాయండి, ప్లీజ్.. ఒక్క పేరులో తప్ప ఇంకేమాత్రం నచ్చలేదా కారెక్టర్ నాకు 🙂

  Reply

  • Phaneendra
   Jun 11, 2012 @ 18:20:44

   నిషి గారూ…. ఐతే నేను మీకు నిరాశే మిగులుస్తానేమో. ఆమెలోని దేవతా స్త్రీమూర్తిమత్వమంటే నాకు చిన్నప్పుడు అలవిమాలిన వ్యామోహం ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో తెలీదు కానీ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తానని మాత్రం చెప్పగలను.

   Reply

 4. నిషిగంధ
  Jun 11, 2012 @ 19:26:31

  అయ్యో, నిరాశ పడేది ఏమీ ఉండదండీ.. ఆమెని ఆరాధించిన వాళ్ళు తనలో చూసిందేమిటో తెలుసుకోవాలనే నా ఆసక్తి కూడా.. సో, నో బారియర్స్, ప్లీజ్ 🙂

  Reply

 5. Madhu Pemmaraju
  Jun 18, 2012 @ 21:48:10

  మిడిమిడి జ్ఞానం అని తెలియడం అన్నింటి కంటే పెద్ద జ్ఞానం, అందరు అలా ఒప్పుకంటే ప్రపంచం మరోలా ఉండేది 🙂

  pardon my ignorance-ఈ పై లైన్ నన్ను దోలిచేస్తోంది అర్థం చెప్పగలరు 🙂

  Reply

 6. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jun 21, 2012 @ 12:20:55

  జ్ఞాని వినయశీలిగా ఉంటాడు, వాడు చెప్పే మాటలని విని కొద్దో గొప్పో నేర్చుకోవచ్చు. అజ్ఞాని అహంభావంతో ఉన్నా, అసలు విషయానికి వచ్చేసరికి తనకు తెలీని దానికి పోకపోతేనే ఉత్తమమని జాగ్రత్తగా నోర్మూసుకుని ఉంటాడు. అలా పై ఇద్దరి వల్లా పెద్దగా ఏ ప్రమాదమూ ఉండదు. తెలిసీ తెలీని (నాలాంటి) వాడు నోటికి వచ్చినది వాగేస్తాడు. అంతా తనకే తెలుసునన్న పటాటోపం, అమాయకంగా నమ్మేసే వాళ్ళకు ప్రమాదకరం. అందుకనే ఈ సూచన అన్నమాట. నా తప్పేం లేదని చెప్పుకోడానికి, ఇదంతా మీకు తెలీదనుకోలేనని తెలిసినా ఇంత చేటభారతం రాశాను చూశారా… (పండిత పుత్ర లక్షణమైన) శుంఠత్వం అదే కదా మరి. 🙂

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: