ఆరెస్సెస్ కార్యాలయంపై అర్థ శతాబ్దం పాటు త్రివర్ణ పతాక ఎగరకపోవడానికి కారణమేంటి?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానకార్యాలయంలో 52ఏళ్ళపాటు జాతీయ జెండా ఎగరనే లేదు. జాతికీ, జాతీయ పతాకానికీ ఆరెస్సెస్ వ్యతిరేకమని దాన్నిబట్టే అర్థమవుతోంది అన్న విమర్శలు చేసేవారు ఎందరో. నిజమే. 1950 నుంచి 2002 వరకూ నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంపై ఏనాడూ త్రివర్ణ పతాకం ఎగురలేదు. జాతీయవాదానికి ప్రతీక అని చెప్పుకునే సంఘ్ కార్యాలయంలో మువ్వన్నెలు రెపరెపలాడకపోవడానికి కారణమేంటి? కమ్యూనికృష్టులు, కాంగిరేచుకుక్కల దుష్ప్రచారం వెనుక అసలు నిజమేంటి?

(National Flag Hoisted by Mohan Bhagawat at Nagpur RSS HQ on 15-08-2020)

దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విస్తృతి పెరగసాగింది. స్వాతంత్ర్య దినం, గణతంత్ర దినం వంటి జాతీయ పర్వదినాలను ఆరెస్సెస్ ఘనంగా నిర్వహించేది. జెండా పండుగలు చేసేది. జన సామాన్యం ఆ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో పాల్గొనే వారు, వారు సహజంగానే సంఘం వైపు ఆకర్షితులయ్యేవారు. నాటి పాలక ప్రభుత్వానికి అది సుతరామూ నచ్చలేదు. అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం ఆరెస్సెస్ ను తమ చాప కిందకు పారుతున్న నీరుగా భావించేది. సంఘం బలపడడాన్ని ఎలాగైనా ఆపాలని చూసేది. ఆ క్రమంలోనే, నెహ్రూ సర్కారు తెలివిగా భారత రాజ్యాంగానికి ఒక అధ్యాయాన్ని జోడించింది. అదే ‘నేషనల్ ఫ్లాగ్ కోడ్’. అంటే జాతీయ పతాకం వినియోగానికి నియమనిబంధనలు.

భారత రాజ్యాంగంతో పాటు 1950లో నేషనల్ ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం త్రివర్ణ పతాకావిష్కరణపై ఆంక్షలు విధించారు. మువ్వన్నెల జెండాని ప్రభుత్వ కార్యాలయాలపైన మాత్రమే, అది కూడా కొందరు వ్యక్తులు మాత్రమే ఆవిష్కరించవచ్చు. అంతే తప్ప సామాన్య ప్రజానీకం జాతీయ జెండాను సొంతంగా ఎగురవేయకూడదు. అలా చేయడం చట్టరీత్యా నేరం. వారికి కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది.

అలా, చట్టం ప్రకారం ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు స్థలాల్లో జాతీయ జెండాను ఎగరవేయడం నేరంగా మారింది. సంఘ్ శాఖలు ప్రభుత్వ భవనాలు కాక వ్యక్తిగత ప్రదేశాలు కాబట్టి అక్కడ పతాకావిష్కరణ, చట్ట ప్రకారం నేరం. ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ, సంఘం తమ శాఖల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం నిలిపివేసింది.

నిజానికి ఈ చట్టానికి, నెహ్రూ అనవసరపు భయాందోళనలు తప్ప, సరైన సమర్థన లేదు. స్వాతంత్ర్య సమరం సమయంలో సామాన్య భారతీయులు తమ చేతిలో మువ్వన్నెల పతాకాన్ని పట్టుకుని ఊరంతా తిరిగేవారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశపు సగటు పౌరుడి చేతి నుంచి తన దేశపు జెండాను పట్టుకునే అధికారం ఊడబెరికేశారు. లక్షలాది ప్రజల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర్యం లాగానే, జెండా కూడా, నెహ్రూ గాంధీ కుటుంబపు సొత్తుగా మారిపోయింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ అమెరికాలో చదువుకునేటప్పుడు అక్కడ ప్రతీ ప్రైవేటు సంస్థ, ప్రతీ దుకాణం అమెరికా జాతీయ పతాకాన్ని వాడడం చూశారు. అమెరికన్ల లాగానే భారతీయులు కూడా తమ ఇళ్ళలో, కార్యాలయాల్లో తమ జాతీయ జెండాను ఎగరవేయాలని భావించారు. కాంగ్రెస్ ఎంపీ అయిన నవీన్ జిందాల్, తన ‘జిందాల్ విజయనగర్ స్టీల్స్’ కర్మాగారంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రైవేటు భవంతిపై జెండా ఎగరేయడం అనే ఘోరమైన నేరం చేసినందుకు ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయనపై ఎఫ్ ఐ ఆర్ నమోదయింది. దాంతో ఆయన సుదీర్ఘ కాలం న్యాయపోరాటం చేసారు. ఎట్టకేలకు 2002లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. భారత జాతీయ పతాకాన్ని ప్రతీ భారతీయ పౌరుడూ ఎగురవేయవచ్చు, ఏ ప్రైవేటు భవనంపైన అయినా ఎగురవేయవచ్చు. జాతీయ జెండా గౌరవానికి భంగం వాటిల్లకుండా, ఫ్లాగ్ కోడ్ పరిమితులకు లోబడి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించవచ్చు అంటూ తీర్పు వచ్చింది.

ఆనాటి నుంచీ ఆరెస్సెస్ ప్రతీ శాఖలోనూ ప్రతీ ప్రధాన సందర్భంలోనూ జాతీయ పతాకం ఆవిష్కృతం అవుతూనే ఉంది.  

విచిత్రం ఏంటంటే…. సంఘ్ తమ శాఖల్లో జాతీయ జెండాను యాభై ఏళ్ళ పాటు ఎగరవేయలేదు అని తప్పులెన్నే కాంగీలు, కమ్మీలు… జాతీయ గీతం ఆలపించేటప్పుడు తమ కుర్చీల్లో నుంచి కనీసం లేవరు. సినిమాహాళ్ళలో జాతీయగీతం పెట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు అది ప్రజల హక్కును హరించివేయడం అన్న స్థాయిలో అడ్డగోలు వాదనలు చేసిన ఇదే జనాలు, జెండా సాకుగా ఆరెస్సెస్ ను తప్పు పడుతూనే ఉన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళయిన సందర్భంగా సోషల్ మీడియాలో డీపీగా జెండాను పెట్టుకోమనడాన్నీ తప్పు పట్టారు. అదే జనాలు కాషాయ సంస్థల సోషల్ మీడియా డీపీలు మార్చలేదనీ తప్పుపట్టారు. కాంగీలు సరే, ఎర్ర కళ్ళజోళ్ళ వాళ్ళు ఎప్పుడైనా ఈ దేశపు జెండాను గౌరవించారా? కనీసం గుర్తించారా?

4 Comments (+add yours?)

  1. kastephale
    Aug 10, 2022 @ 19:47:41

    తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినుర వేమ

    Reply

  2. ఫణీన్ద్ర పురాణపణ్డ
    Aug 23, 2022 @ 18:50:13

    అవును మాస్టారూ.

    Reply

Leave a comment