జాత్యహంకారి దొరికాడు… కుమ్మేద్దాం పదండి

వెయ్యి మంచిపనులు చేసి ఉండవచ్చు గాక… ఒక్క హత్య చేస్తే చాలు… అంతా పోయినట్టే..!
తరుణ్‌ విజయ్‌ జాత్యహంకారి అంటూ జరుగుతున్న రచ్చలో కనబడిన ఓ వ్యాఖ్య అది.

నిజానికి ఈ వ్యవహారంలో ఒక సామెత వాడవచ్చునా లేదా అని ఆలోచిస్తున్నాను. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయింది’ అన్న సామెత అది. పోలికలో తేడా గురించి కాదు, ఆ సామెతను వాడితే అది అపసవ్యమైన ఇంటర్‌ప్రిటేషన్స్‌కు దారి తీస్తుందన్నది భయం. సరే, ఇప్పుడు ఆ మొదటి వ్యాఖ్యను తీసుకోవచ్చు.

తరుణ్‌ విజయ్ జాత్యహంకారి, మనువాది, ఆరెస్సెస్‌ ఫాసిస్టు, బ్లా బ్లా బ్లా… అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసేస్తున్న వారిలో అందరూ మాటల శూరులే అని అర్ధమవుతోంది కానీ చేతల వీరులు ఎవరైనా ఉన్నారా అంటే అనుమానమే.

తరుణ్‌ విజయ్ వ్యాఖ్యలు సరైనవి అని సమర్ధించబోవడం లేదు. ఆ మాట అతనే ఒప్పుకున్నాడు, క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు సందర్భం ఏంటి, అతనేం మాట్లాడాడు, ఎందుకలా మాట్లాడాడు అన్నది ఒకసారి ఆలోచించాలి కదా. ఆ మాటలు స్లిప్ ఆఫ్‌ టంగా, లేక అతనికి మాలాఫైడ్ ఇంటెన్షన్‌ ఉందా, అసలు అతని ట్రాక్‌ రికార్డ్ ఏంటి… అన్నవి చూడాలి కదా.

భారతదేశంలోని ఆఫ్రికా ఖండవాసులు అందరిపైనా దాడులు జరుగుతున్నాయి… అవన్నీ జాత్యహంకార దాడులే… అన్న పాయింట్‌ మీద అల్‌జజీరా ఛానెల్ చర్చాగోష్టి నిర్వహించింది. ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌, కొందరు ఆఫ్రికన్‌ విద్యార్థులతో పాటు బీజేపీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ (ఇండియా ఆఫ్రికా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ ఛైర్మన్) పాల్గొన్నాడు. ఆఫ్రికన్లపై జరిగే అన్ని దాడులనూ రేసిస్టు దాడులుగా పరిగణించడం సరికాదని ఆయన చెప్పాడు. భారతీయులు దేవుడిగా కొలిచే కృష్ణుడి పేరుకు అర్ధమే నల్లనయ్య అయినప్పుడు రంగు ఆధారంగా వ్యక్తులను అంచనా వేయడం సరికాదన్నాడు. ఐతే… భారతదేశం మొత్తం రేసిస్టుల మయం అన్న సాధారణీకరించేసిన ఇతర ప్యానెలిస్టులతో మాట్లాడే సందర్భంలో నోరు జారాడు. భారతీయులు జాత్యహంకారులైతే దక్షిణాది రాష్ట్రాలతో ఎలా కలిసుంటారని వ్యాఖ్యానించాడు. అక్కడే తరుణ్‌ విజయ్‌ అడుసులో కాలేశాడు. తర్వాత ట్విట్టర్‌ ద్వారా తను సరిగ్గా మాట్లాడలేదని ఒప్పుకున్నారు. తన భావానికీ పదప్రయోగానికీ పొంతన లేకుండా పోయిందంటూ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇంకేం, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతిపక్షాల వారందరూ తరుణ్‌ను ఏకిపారేశారు. సోషల్‌ మీడియా ట్రాలింగూ పెరిగిపోయింది.

ఇంతకీ దక్షిణాది అంటే తరుణ్‌విజయ్‌కి నిజంగా చిన్నచూపేనా? అతని వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కొన్ని ఘటనలు చూద్దాం…

— తమిళనాడు హైకోర్టులో తమిళాన్ని వాడుకభాష చేయాలంటూ ఉద్యమించాడు.

— తమిళం, తిరుక్కురళ్‌ లేకుండా భారతదేశమే లేదని వ్యాఖ్యానించాడు.
TV 2

— తిరువళ్ళువర్‌ జీవిత చరిత్రను విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ చేశాడు.

— తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో తిరువళ్ళువర్‌ విగ్రహం కట్టించాడు.

TV 1

— అగ్ర, నిమ్న వర్ణాల సమన్వయం కోసం కృషి చేశాడు, ఆ క్రమంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు.

— దళితులకు ఆలయ ప్రవేశం చేయిస్తూ సోకాల్డ్ అగ్రవర్ణస్తుల చేత రాళ్ళదెబ్బలు తిన్నాడు.

— కర్ణాటక కోలార్‌ జిల్లా కగ్గనహళ్ళి గ్రామంలో సాంఘిక బహిష్కరణ ఎదుర్కొన్న ఎస్సీ మహిళ రాధమ్మకు అండగా నిలబడ్డాడు. మూడురోజులు ఆ గ్రామంలో ఉండి ఆమె చేతి వంట తిన్నాడు. ఆమె బాధను పార్లమెంటులో వినిపించాడు.

ఉత్తరాఖండ్‌కు చెందిన తరుణ్‌ విజయ్‌కి తమిళ భాష గురించో, కన్నడ ఎస్సీ మహిళ గురించో కష్టపడాల్సిన పనేంటి? తరుణ్‌ విజయ్‌ను మీడియాలో, సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్న వారిలో ఎవరైనా అతని ఆచరణలో వెయ్యోవంతైనా ఆచరించగలరా? కానీ మనకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందిగా. వాడేసుకుంటే పోలా. పైగా తప్పు చేశాడు, చేశానని ఒప్పుకున్నాడు, అడ్డంగా దొరికిపోయాడు. అలాంటి జాత్యహంకారిని కుమ్మేద్దాం పదండి.

26 Comments (+add yours?)

  1. Lalitha TS
    Apr 09, 2017 @ 06:09:21

    పెదవి దాటితే పృధ్వి దాటుతుంది.
    కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము

    – పై సామెతలు మాత్రం ముందన్న తరుణ్‌విజయ్‌కీ, తర్వాత అంటున్న వాళ్లందరికీ వర్తిస్తాయి.

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Apr 09, 2017 @ 18:11:31

      లలితగారూ… మీరు చెప్పిన మాటలు అక్షరసత్యాలు.
      ఒక badly framed sentenceతో అసలు చర్చ అంతా దారి తప్పిపోవడం బాధాకరం.
      ఆ డిస్కషన్ చూస్తే అల్ జజీరా ఆ కార్యక్రమాన్ని ఎటు డ్రైవ్ చేస్తోందో అర్ధమైపోతుంది, దాన్ని గాలికి వదిలేశారు.
      లాలూ, ములాయం లాంటి మహామహులు ఎంతోమంది పార్లమెంటులోనే చేసిన పలు అభ్యంతరకర వ్యాఖ్యలు, తాము వాటికే కట్టుబడి ఉంటూ ఇసుమంతైనా బెసగకుండా ఉండే ధీమా…. గుర్తొచ్చినప్పుడు తరుణ్ విజయ్ నిజంగా దోషే అనిపిస్తుంది.

      Reply

  2. bonagiri
    Apr 09, 2017 @ 08:23:32

    అతని గురించి మీరు చెప్పిన విషయాలు చాలమందికి తెలియదు. అయినా అతను అంతగా నోరు జారడం క్షమించరానిదే. దక్షిణది వారితో కలిసి ఉండి అతనేమైనా మనకు ఉపకారం (एहसान) చేస్తున్నాడా?

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Apr 09, 2017 @ 18:19:32

      అతని గురించిన విషయాలు నాకు కూడా తెలియవండి. తరుణ్ విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడూ అంటూ వార్తలు చూశాక…. ఈ వ్యక్తి గురించి గతంలో కొంచెం మర్యాదగా చదివినట్టు గుర్తొచ్చి అటూ ఇటూ వెతికితే కొన్ని పాయింట్లు దొరికాయి, వాటిని చెప్పానంతే.

      అవును తరుణ్ విజయ్ నోరు జారాడన్నది నిజమే. అయితే మాలాఫైడ్ ఇంటెన్షన్ ఉందా లేదా అన్నది గమనించాలని నా అనుకోలు. ఆ ఇంటర్ వ్యూలో ప్రోగ్రాం యాంకర్, ఆఫ్రికన్ విద్యార్ధిని, భారతీయ ఫొటోగ్రాఫర్ చేసిన సాధారణీకరణలను గమనిస్తే తరుణ్ విజయ్ అసలేం చెప్పదలచుకుని తడబడ్డాడో ఇట్టే తెలిసిపోతుంది.

      Reply

  3. SriRam UG
    Apr 09, 2017 @ 15:31:21

    @ బోనగరి గారు,

    మీరెలా వక్రీకరించాలంటే అలా వక్రీకరించుకోవచ్చు. మీ బిజెపి వ్యతిరేకత గురించి తెలిసిందే కదా! దేశ ప్రధాని పోటికి నితీష్ కుమార్ కు మద్దతు పలికి ఏకైక తెలుగు బ్లాగరు మీరు. మిమ్మల్ని ఎలా మరువగలం? 🙂 మీరెంత విమర్సిస్తే బిజెపి కి అంత బలం పెరుగుతుంది.
    అదెమీటోనండి నమో ప్రధాని అయ్యాక మీవంటి గొప్ప లిబరల్స్ ఊహించినట్లు పెద్దేత్తున మతకలహాలు జరగలేదు. హోరాహోరిగా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల ముందు దళితుల పై దాడులు, రోహిత్ వేముల సంఘటన గురించి ప్రచారం ఇలా అన్ని మీడియాలో చూపించిందే చూపించి బిజెపి ని దెబ్బతీయాలనుకొంట్టారు. కాని ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపులో నమో సునామి మొదలై ఉంట్టుంది.
    బిజెపి విజయభేరి మోగిస్తుంది. చుక్క రక్తం చిందించకుండా బిజెపి ప్రత్యర్ధులను మట్టుబెట్టుకొంట్టూ పోతున్నాది.

    చూస్తూంటే భారతదేశంలో నిశబ్ద హిందూ విప్లవం మొదలైంది. త్వరలో బిజెపి అశ్వమేధ యజ్ణాశ్వం బెంగాల్, ఒరిస్సా మీదుగా కోస్తా ఆంధ్రాకు చేరుతుంది.

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Apr 09, 2017 @ 18:30:44

      శ్రీరామ్ గారూ… పబ్లిక్ పల్స్ పట్టుకునే తీరును మీడియా మరచిపోయి ఓ ఇరవయ్యేళ్ళు అయిందేమో. ఇష్యూ బేస్డ్ జర్నలిజం, లేదా షీర్ పాలిటిక్స్ ను ఎనలైజ్ చేయడం… ఈ రెండూ రాని సోకాల్డ్ జర్నలిస్టులు ఇలాంటి టుమ్రీ విషయాలను వివాదాలు చేసి రోజులు వెళ్ళదీసేస్తున్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలన్నీ తమతమ ఎజెండాల మేరకు వార్తలు ఇస్తున్నాయి.

      నిశ్శబ్ద హిందూ విప్లవం…? ఒడిషాలో కొంచెం ఎక్కువగానూ, బెంగాల్లో కొంచెం తక్కువగానూ బీజేపీ ఎదగవచ్చునేమో. కానీ ఆంధ్రలో ఏం పెరక్కపోవచ్చు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు సాధిస్తుందని మీ అంచనా? 4-5 దాటకపోవచ్చునేమో.

      Reply

    • bonagiri
      Apr 09, 2017 @ 19:56:47

      శ్రీరాం గారు, నేను బిజెపి వ్యతిరేఖినని మీరు అపోహ పడుతున్నారు.
      నేను మీ జోలికి రావటంలేదు. దయచేసి మీరు కూడ నా జోలికి రావద్దు.

      Reply

  4. Real Indian
    Apr 09, 2017 @ 16:49:37

    నాన్నా శ్రీ రాం. హిందూ గూండా మూకలు మతకల్లోలాల అర్ధాలు మార్చారు చంటీ. ఇప్పుడంతా, మాప్ గీయటం, ఆవు పేరు పెట్టి లం* కొడుకులంతా మీదపడి జనాల్ని చంపడమే. నమోకేమో బయటజరిగేవాటికే సంతపాలు తెలియజెయ్యడంలోనే సరిపోతుందయ్యే.. ఐనా, అమ్మని కూడా దగ్గరపెట్టుకోలెని ఒక పనికిమాలిన వాడు, దేశాన్ని శాంతియుతంగా నడుపుతాడంటావా చిన్నీ ?

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Apr 09, 2017 @ 18:45:51

      రియల్ ఇండియన్ గారూ… దేశానికి ఈ చివర, అరిటాకు పాయలా ఉండే చిన్న రాష్ట్రం కేరళలో ఈమధ్యనే వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యల లెక్కా పద్దూ తెలుసునా.

      అమ్మని దగ్గర పెట్టుకోడానికీ, దేశాన్ని శాంతియుతంగా పరిపాలించగలగడానికీ సంబంధం లేదు కదా. తాతల మూతుల నేతుల వాసన పేరిట దేశాన్ని కొల్లగొట్టి అందరు బంధువులనూ బినామీలుగా చేసుకునే వారి కంటె… తల్లినీ అన్ననీ తమ్ముడినీ తమ వ్యక్తిత్వపు చిన్నికాళ్ళ మీదనే నిలబడనీయగలగడం మేలే. అది నిజం కాదని తెలిస్తే అప్పుడు చూద్దాం మోదీ పనికిమాలినతనపు సంగతి.

      నోరు జారి నేరస్తుడిగా బోనెక్కిన మనిషి గురించి మాట్లాడుకుంటున్నాం కదా… మీరు ఉద్దేశపూర్వకంగా అవాచ్యాలు మాటాడవచ్చునా?

      Reply

  5. Real Indian
    Apr 09, 2017 @ 19:33:47

    >>యల్ ఇండియన్ గారూ… దేశానికి ఈ చివర, అరిటాకు పాయలా ఉండే చిన్న రాష్ట్రం కేరళలో ఈమధ్యనే వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యల లెక్కా పద్దూ తెలుసునా.

    కాబట్టి మేము కూడా లెక్కా పక్కా లేకుండా చంపేస్తుంటాం. భారత్ మరో పాకిస్తాన్ లేదా సిరియా అయ్యేంతవరకు మిశ్రమించం. అదేనా మీరు చెబుతుంటా?

    Reply

    • SriRam UG
      Apr 09, 2017 @ 21:26:17

      దేశాన్ని ఇంతకుమునుపు వారికన్నా బాగానే నడుపుతున్నాడు. మరో పాకిస్తాన్ లేదా సిరియాలా అయిపోతుందని, మీరేమి ఆందోళన చెందక్కరలేదు. ఒకటి రెండు సంఘటనలను వందసార్లు ఇంగ్లీష్ టివిలలో, ఎన్నికల ముందు చూపించిందే చూపించి ప్రజలను బెదర్కొట్టాలని ప్రయత్నించారు కదా! కాని వాటిని స్థానిక ప్రజలు ఎవ్వరు పట్టించుకోలేదు కదా!

      Reply

      • Real Indian
        Apr 10, 2017 @ 07:18:28

        @#$%&* ప్రధానులు, ముఖ్యమంత్రులు అవుతున్న ఈ పాలనలో *&^%$#@ లేదంటే రాజా సింగ్ లాంటి ఉగ్రవాదులు ******? శ్రీ రాం! ఇప్పుడు హిందువులు ముస్లీంలనో, క్రైస్తవులనో చంపుతున్నారని *****. ఇది ఐపొయిన తర్వాత తర్వాత *******. ఉత్తరాది వారు ********** రిఫరెన్సు కావలంటే పురాణాలు తీసుకో.

      • Real Indian
        Apr 10, 2017 @ 08:30:52

        నీలాంటి సుగ్రీవుడు, విభీషణుడు చాలు. ఒక జాతి మొత్తం అంతరించిపోవడానికి. రాముడికి రాజ్యం ఒచ్చింది. ఇక వాళ్ళు చరిత్రలోనే లేకుండా పొయారు

      • SriRam UG
        Apr 10, 2017 @ 12:56:34

        ఫణి గారు, దేశ ప్రధానిని కించపరుస్తూ Real Indian రాసిన వ్యాఖ్యలను తొలగిస్తారని ఆశిస్తున్నాను.

  6. Real Indian
    Apr 09, 2017 @ 21:27:52

    ఆదాటున నోరుజారినదాన్ని పట్టుకోని విమర్శించడాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. అలాగని, హిందుత్వ/భారతీయత ముసుగులో చేసే అరాచకాలను కళ్ళకు గంతకు కట్టుకోని సమర్ధించను.

    Reply

    • Real Indian
      Apr 10, 2017 @ 14:46:24

      @SRI RAM
      మోడీని ని ఏమన్నా అంటే దెశం మొత్తానికి*&^%$#@

      Reply

  7. Real Indian
    Apr 10, 2017 @ 13:05:53

    Reply

  8. ఫణీన్ద్ర పురాణపణ్డ
    Apr 10, 2017 @ 18:12:35

    రియల్ ఇండియన్‌ గారూ…
    తరుణ్‌ విజయ్‌ అదాటున నోరుజారిన దాన్ని పట్టుకుని విమర్శించడాన్ని మీరు ఖండించడం వరకూ బాగానే ఉంది. ప్రస్తుత వ్యాస అంశానికి సంబంధించినంత వరకూ కథ అక్కడితో అయిపోయింది.

    “హిందుత్వ ముసుగులో చేసే అరాచకాలను సమర్థించను”… భయంకరమైన స్వీపింగ్‌ స్టేట్‌మెంట్‌. ఇలాంటి దారుణమైన సాధారణీకరణలను కొన్ని దశాబ్దాలుగా హిందువులు భరిస్తూనే ఉన్నారు.

    “కాబట్టి మేము కూడా లెక్కా పక్కా లేకుండా చంపేస్తుంటాం….” మీరు ఎలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారో దీన్ని బట్టే తెలిసిపోతోంది. స్వతంత్రం వచ్చిన గత ఏడు దశాబ్దాలుగా కశ్మీర్‌ నుంచి కేరళ వరకూ హిందువులను భౌతికంగా నిర్మూలించడం నుంచి రాజ్యాంగపరంగా ఏకాకులను చేయడం వరకూ ఎన్నిరకాలుగా టార్చర్‌ పెడుతున్నారో అర్ధమైన తర్వాతనే ప్రజల్లో మార్పు వచ్చింది. దాన్ని అర్ధం చేసుకోలేకనే, చేసుకున్నా జీర్ణించుకోలేకనే ఇలాంటి అబద్ధాల గోబెల్స్‌ ప్రచారం పెద్దయెత్తున జరుగుతోంది.

    “పాకిస్తాన్‌ లేదా సిరియా…” అక్కడ ఏం జరుగుతోందో తెలుసా? మీరు ద్వేషించే బీజేపీ హయాం సంగతి వద్దు.. అంతకు ముందు పదేళ్ళ యూపీయే పాలనలోనైనా పాక్‌/సిరియా లాంటి బీభత్స భయానక పరిస్థితులు మనదేశంలో ఏనాడైనా ఉన్నాయా? అక్కడి ముస్లిముల మతోన్మాదం స్థాయిలో ఈ దేశంలో హిందువుల మతస్వేచ్ఛా ప్రకటన ఏనాడూ లేదు.

    భావప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా అని ప్రధాని, ముఖ్యమంత్రుల గురించి నోటికొచ్చినట్టు వదరడం సరి కాదు. పాతబస్తీ ప్రాంత ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఉగ్రవాది అంటున్నారు. ఆ లెక్కన ఎంఐఎం ఒవైసీని ఏమనాలి, ఏం చేయాలి?

    “ముస్లిములనో క్రైస్తవులనో చంపుతున్నారని సంతోషించకు”… అబద్ధాలకు హద్దూ పద్దూ లేకపోవడమంటే ఇదే.

    “పురాణాల రిఫరెన్సులు…” మీరు చెప్పిన జాతులు అంతరించిపోలేదు. సరిగ్గా చదువుకుని రండి. రాముడికి రాజ్యం వచ్చాక కూడా లంకలో విభీషణుడు రాజుగా ప్రజలు సుఖంగా బతికారు.

    “ఇప్పటి మారణహోమం చూసి” మరో వదరుబోతు ప్రేలాపన.

    ఇంక చివరగా మీరిచ్చిన దళిత కమెండో లింక్‌… నిజం ఇసుమంతైనా లేకపోయినా కడివెడంత విషం చిమ్మడం ఎలా అన్నదానికి నిలువెత్తు నిదర్శనం. బాధ సంగతి పక్కన పెడితే ఆ స్థాయిలో బూటకపు ప్రచారాలు ఎలా చేస్తారన్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

    నా చిన్న పాత్రికేయ జీవితంలో ఎర్ర, ఆకుపచ్చ, నీలం తదితర రంగుల జెండాల వాళ్ళు వార్తలను ఎలా వక్రీకరిస్తారో దగ్గరగా చూసి అలవాటైన తర్వాత కూడా కంపరం పుట్టించేంత భయంకరమైన దుష్ప్రచారమిది.

    ఆ విషయాలు అర్ధం అవబట్టే మూడేళ్ళ క్రితం కేంద్రంలోనూ మూడునెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ ప్రజలు విస్పష్టమైన తీర్పునిచ్చారు.

    చివరిగా… నేను మీ వ్యాఖ్యలను తొలగించడానికీ, శ్రీరాం గారి సూచనకూ సంబంధం లేదు. ఇకపై ఇలాంటి ప్రేలాపనలు ప్రేలకండి.

    Reply

  9. Real Indian
    Apr 10, 2017 @ 20:37:42

    @#$%%%^^

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Apr 10, 2017 @ 21:27:01

      మన వాదన ఎంతకీ తెగదు. ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాల్సింది తప్ప మీ స్టాండ్ నుంచి మీరూ, నా స్టాండ్ నుంచి నేనూ మారం. కాబట్టి ఆ చుక్క ఇక్కడే పెట్టేస్తున్నాను. 🙂

      Reply

  10. Real Indian
    Apr 10, 2017 @ 21:44:58

    అంత పేద్ద……………….. సమాధానం రాశాక నాకు అదే ఫీలింగ్ వచ్చింది. అప్పుడే అందామనుకున్నా గాని, అహం అడ్డొచ్చింది.

    మీరు మాత్రం ఒక్క వాఖ్యంతో మీగొప్పతనాన్ని చూపించారు…

    Reply

    • Real Indian
      Apr 10, 2017 @ 21:47:15

      ఒక మంచి పోష్టును దారి మళ్ళించినందుకు క్షమించండి.

      Reply

  11. ఫణీన్ద్ర పురాణపణ్డ
    Apr 10, 2017 @ 22:08:05

    గొప్పతనం… సెటైరికల్ గా అంటున్నారా సీరియస్ గానా… అది ఏదైనా కానివ్వండి నేనేమీ గొప్పవాడిని కాదు, మానవ మాత్రుడినే.

    దారి మళ్ళడం కాదు కానీ, మెయిన్ రోడ్ మీద నుంచి ఫుట్పాత్ మీదకు వెళ్ళి అక్కడక్కడే తిరిగినట్టుంది అంతే 🙂

    శుభరాత్రి.

    Reply

  12. Real Indian
    Apr 24, 2017 @ 21:01:06

    @#$#%

    Reply

Leave a reply to Real Indian Cancel reply