అస్తిత్వంలోకి అంతర్యానం

గుప్పెట్లో పచ్చకర్పూరం పెట్టుకుని ఓ రెండు గంటలు కూచుంటే గాల్లో కలిసిపోయి ఆవిరైపోతూ గుప్పుమని గుబాళించిన పరిమళం ఒళ్ళంతా చుట్టుముట్టేసి మనసు లోలోపలికి చొచ్చుకుపోడానికి చేసే ప్రయత్నాల్లో స్థల కాలాలు గడ్డ కట్టుకుపోతూ పునర్ ద్రవీకరిస్తూ పునఃపునః ఘనీభవిస్తూ హృదయమూ మేధసూ పరస్పరమూ చర్చించుకుంటూ వితర్కించుకుంటూ సంశ్లేషించుకుంటూ పరస్పరం సంలీనమైపోతూ విలీనమైపోతూ మిగిల్చిన శేషప్రశ్న ఎవరు నేను?’

అరుపులు కేకలు పెడబొబ్బలు గోలలు ఘోషలు రగడలు కొట్లాటలు కాట్లాటలు కీచులాటలు మొరగడాలు కరవడాలు కండపీకేయడాల నుంచి పుట్టుకొచ్చే ధ్వని కాలుష్యం మనో కాలుష్యం భావ కాలుష్యం నరాల ఒత్తిళ్ళు రక్తపోట్లు నవ్వుల పాట్లు నిరంతర ప్రయాసలు ఆగని ఆయాసాలు ఓపలేని నిట్టూర్పులు మోయలేని తాపాలే హృదయ స్పందనలుగా రసనిష్పందనలుగా మారిపోయి ప్రమాణాలుగా ముద్రపడిపోయి టెక్స్ట్ బుక్స్ గా మిగిలిపోయి సున్నితత్వాన్నీ సౌకుమార్యాన్నీ అమాయకత్వాన్నీ ముగ్ధ మనోహరత్వాన్నీ వినోదం నుంచే కాదు జీవితాల నుంచే చెరిపేస్తున్న విధ్వంసకాండ మధ్యలోనుంచి మెల్లగానే అయినా బలంగా లేచి నిలబడి ఉనికి చాటుకుందా ప్రశ్న .

వేయి రొదల నడుమ స్పష్టంగానూ స్ఫుటంగానూ వాయులీనమూ మోహన వంశీ అలవోకగా కర్ణామృతం పంచుతుంటే కాన్ సేన్ లా వినడానికి చెవులొ గ్గితే మనసు కుదుటపడుతుందనీ తేట తేరుతుందనీ సేద తీరుతుందనీ రణగొణ ధ్వనులకు ఆవలున్న జీవితం ఇంకా విస్తారమైనదన్న సంగతి అర్ధమవుతుందనీ సాత్విక భావోదయం కలిగినప్పుడే సత్యమూ శివమూ ఐన సౌందర్యం వికసిస్తుందనీ జీవితపు వన్నె చిన్నెలన్నింటినీ బుద్ధి కుంచెలో కలిపి రంగరించినపుడే మనోజ్ఞ సీమల్లో హిమవన్నగ ధావళ్యం పరుచుకుంటుందనీ తాత్వికత అంటే అయోమయపు గందరగోళం కాదనీ వివరించిన జవాబులకు మూలం ఆ ప్రశ్నే.

క్లీషేలు లేకపోలేదు,లోపాలూ ఉండకపోలేదు, రంధ్రాన్వేషణ చేస్తే దొరకనిదంటూ ఏదీ ఉండదు. అంతర్యానానికి నేపథ్యం ఏదైనా కావచ్చు, కానీ హిమాలయాల నేపథ్యంలో తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం కచ్చితంగా ఓ మస్ట్ వాచ్ మూవీ. అరిగిపోయి మురిగిపోయి కాలం చెల్లిపోయి ఇప్పుడసలు తెలుగులో ఉన్నాయా లేవా అనిపిస్తున్నాయి సింబాలిక్ షాట్లు. ఈ సినిమాలో వాటిని వాడుకున్న తీరు అద్భుతః. తాత్వికతకూ హాస్యానికీ ఉండే దగ్గరి సంబందాన్ని సరళించి వివరించే సన్నివేశాలెన్నో . ఓ కొ త్త కుర్రాడి మీద నమ్మకం పెట్టి అతని చేతిలో మెగాఫోన్ పెట్టి పెట్టుబడి పెట్టిన ఇద్దరమ్మాయిల ధైర్యానికిఅధ్యక్షాటోపీలు తీసితిమి.

Advertisements

6 Comments (+add yours?)

 1. kastephale
  Mar 25, 2015 @ 05:33:55

  సినిమా ఎలా ఉన్నా, మీ మాటలతో మళ్ళీ ఇరవైల్లోలా రైలెక్కి రాజమండ్రిపోయి సినిమా చూసేయాలనిపించింది 🙂

  Reply

 2. kastephale
  Mar 26, 2015 @ 04:39:41

  Really r u so serious about the pic?

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Mar 27, 2015 @ 09:27:46

   మాస్టారూ… మీకు తెలీని కొత్త పాయింట్ ఉంటుందని కాదు… కొత్త తరం కుర్రాళ్ళ దృక్కోణం కనిపిస్తుందని…! ఇంకోటి, హిమగిరి సొగసులు చూడడం ఆహ్లాదరకరమైన అనుభవం.

   అలా అని, ఒకవేళ చూస్తే, చూసాక మీకు నచ్చకపోతే, తిట్టుకోకండే 🙂

   Reply

 3. bonagiri
  Mar 29, 2015 @ 10:48:28

  Yes. really good movie.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: