తూలికాభ్యంతరాన….

 

కనుల మిలమిలలు కొలని చేపల చాంచల్యాలు..
పెదవుల పదనిసలు పగడాల పదును తళుకులు…
అలకల చిరు తరగలు నీలాల మెరుపు మరకలు…
జడగంటల సిరిసవ్వడులు మనసు మెలిదిప్పే రవ్వల మువ్వలు…
ఆ కుంచె నుంచి జాల్వారిన సౌందర్య గంగావతరణాన్ని ఒడిసి పట్టగలవాడెవ్వడు?

కాంతిమతి కనుకొలకులు నిర్భర రోష కషాయితాలు…
పడతి పెదవుల అల్లర్లు తుళ్ళిపడే కొంటె కబుర్లు…
మగువ ముంగురులు ఆత్మవిశ్వాసపు గాలితరగలు…
తనువంతా తారాడే జడగంటలు వనిత వ్యక్తిత్వపు వగరు వయ్యారాలు…
ఆ తూలిక తీర్చిన మానినుల ఆత్మాభిమానాన్ని అందుకోగల ధీరుడెవ్వడు?

సీతాకళ్యాణ వేళ వన్నెచిన్నెల తలంబ్రాల వైనమూ…
అపార్ధాల చీకట్లను తరిమికొట్టిన గోరంత దీపమూ…
అనుమానాల కసవూడ్చి తీర్చిదిద్దిన ముత్యాల ముగ్గూ…
మెలికముగ్గు పైట మెలికలో మడతపడిన పెళ్ళిపుస్తకమూ…
ఆ చేయి పేర్చిన నెలతల వ్యక్తిత్వపు ఒరవడిని చేరగల సాహసి ఎవడు?

మూలకు ముడుచుకుపోవడమే సంప్రదాయమూ కాదు…
అహంభావం ఆగమాగం చేయడమే ఆధునికతా కాదు….
రాతి నాతి మొదలు రమణీలలామ వరకు ఎవరైనా కానీయి…
ఇలనైనా కళనైనా పొలతి పొందికకు ఆత్మాభిమానమే విరితావి…
సత్తిరాజు లక్ష్మీనా(రాయ)ణా… బాపూరమణీయ మార్గాన నడువగలిగిన వాడెవడు!

Advertisements

2 Comments (+add yours?)

 1. kastephale
  Sep 01, 2014 @ 04:44:26

  ఒక తార రాలింది, ఒక యుగం ముగిసింది.

  Reply

 2. చందు తులసి
  Sep 30, 2014 @ 12:23:10

  బహుశా తెలుగు వాడు కావడం వల్లనేమో…బాపు గారికి తగిన గుర్తింపు రాలేదనిపిస్తోంది. అదే బెంగాళీ అయ్యుంటేనా…..ఇంతకన్నా ఎక్కువ పేరు వచ్చి ఉండేది. మరీ ఆవేదన కలిగించే అంశమేమిటంటే…
  విద్యాబాలన్ కి పద్మశ్రీ ఇచ్చే సమయానికి గానీ బాపు గారికి పద్మశ్రీ ఇవ్వకపోవడం…ఎంత సిగ్గు చేటు..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: