లవ్‌ యూ మమతా….

రెండు కత్తులు ఒకే ఒరలో ఉండడం కుదురుతుందా? పిల్లీ ఎలుకా కలిసి ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండడం సాధ్యమేనా? అవునంటున్నారు సీపీఐ నాయకుడు ఏబీ బర్ధన్‌. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌తో వామపక్షాలు కలిసి పనిచేయడం అసంభవమైన విషయం కాదంటున్నారాయన. నరేంద్ర మోదీని ప్రధాని పదవికి దూరంగా నిలువరించడానికి… అవసరమైతే మమతా బెనర్జీతో చేయి కలపడానికి తాము సిద్ధమంటున్నారు బర్ధన్‌.

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో వామపక్షాలు పొత్తు పెట్టుకోడం అసంభవమైన విషయమేమీ కాదని సీపీఎం అంటోంది. నరేంద్ర మోదీని ప్రధాని పీఠం ఎక్కనివ్వకుండా చేయడానికి ఏమైనా చేస్తామని సీపీఐ నాయకుడు ఎ.బి. బర్ధన్‌ అన్నారు. అవసరమైతే బెంగాల్‌లో తమ వైరాన్ని పక్కన పెట్టి మమతా బెనర్జీతో చేతులు కలపడానికి కూడా సిద్ధమని బర్ధన్‌ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమికి 210 స్థానాలకు మించి రావని ఆయన అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఎన్నికల అనంతర పొత్తులకు అవకాశం లేకుండా చేయడానికి అన్ని రకాల అవకాశాలనూ పరిగణిస్తామని ఏబీ బర్ధన్‌ చెప్పారు.

మమతా బెనర్జీకి, వామపక్షాలతో రాజకీయ వైరం జగత్‌ ప్రసిద్ధం. లెఫ్టిస్ట్‌ పార్టీల కంచుకోటగా భావించే పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ రికార్డు సృష్టించింది. వామపక్ష కూటమి సుదీర్ఘ పాలనను విచ్ఛిన్నం చేసిన చరిత్ర మమతా బెనర్జీది. 2011లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ను గద్దె దింపిన తర్వాత కూడా వారిపై మమతా బెనర్జీ తన పోరాటం ఆపలేదు. బెంగాల్‌లో సుదీర్ఘ కాలం వామపక్షాల అసమర్ధ పాలన వల్లనే ఆ రాష్ట్రం మౌలిక వసతుల లేమి, భారీ రుణ భారాలతో కుంగిపోయిందంటూ ఇప్పటికీ దుయ్యబడుతుంటారు. అలాంటి మమతా బెనర్జీతో సైతం పొత్తు కుదుర్చుకోడానికి తాము సిద్ధమేనంటున్నారు బర్ధన్‌. మోదీని నిలువరించడం అన్న ప్రధాన లక్ష్యం ముందు ఇతర రాజకీయ వైరుధ్యాలు పెద్ద సమస్య కావని ఆయన వాదన.

లోక్‌సభ ఎన్నికల్లో యూపీయే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు విజయావకాశాలు బాగున్నా… అధికారం సాధించడానికి కావలసిన సాధారణ మెజారిటీకి దగ్గరలోనే ఆ కూటమి ఆగిపోతుందన్న సందేహాలున్నాయి. ఆ నేపథ్యంలోనే మూడో కూటమి ప్రస్తావన బలం పుంజుకుంటోంది. ఎన్నికల తర్వాతే తృతీయ కూటమి ప్రయత్నాలు చేస్తామంటున్న వామపక్షాలు.. ఆ కూటమిలో చేరాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ను కూడా ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమిలో మమతా బెనర్జీ ఉండడం వల్ల సమస్యలేమీ ఉండబోవని బర్ధన్‌ అంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రెంటినీ వ్యతిరేకించే పార్టీలకు వామపక్షాలతో సైద్ధాంతిక విభేదాలున్నా… మోదీని గద్దెకు దూరంగా ఉంచడమే లక్ష్యంగా కలిసి పనిచేయడం అసంభవం కాదంటున్నారు బర్ధన్‌.

Advertisements

4 Comments (+add yours?)

 1. చందుతులసి
  May 14, 2014 @ 22:14:55

  వాళ్లెప్పుడూ అంతే. మేం రాకున్నా ఫర్వాలేదు కానీ….. ఎదుటివాడు మాత్రం రాకూడదనే మనస్తత్వం ఎప్పుడు మారుతుందో…

  Reply

 2. bonagiri
  May 15, 2014 @ 09:51:58

  పాపం, వాళ్ళు అంత కష్టపడి కలిసి పోరాడక్కర్లేదు.
  NDA కి పూర్తి మెజారిటీ వస్తుంది.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: