ఆ మిత్రులిద్దరికీ మనం కామన్‌ శత్రువు కదా….

ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసినందున ప్రస్తుతం మన ప్రభుత్వం దృష్టి సహజంగా ఓట్లు, ఓటర్లపైన మాత్రమే ఉంది. ఈ రెండు మూడు నెలల్లోనూ గరిష్ట రాజకీయ ప్రయోజనం సాధించడానికి ఏమేం సాధించవచ్చునో అవన్నీ చేసేయాలని కేంద్ర ప్రభుత్వం ఉబలాటపడిపోతోంది. ”ఏం చేశామన్నది కాదన్నయ్యా… ఏం చెప్పుకున్నామన్నది ముఖ్యం” అనుకుంటూ జపాన్‌ నుంచి జనాలను తెచ్చుకుని 5వందల కోట్ల వ్యయంతో యాడ్‌లు చేయించుకుంటోంది. నిజానికి యూపీయే హయాంలో విదేశాలతో వ్యవహారాలు చక్కబెట్టింది ఏమీ కనిపించడం లేదు.. ఎంతసేపూ అమెరికాతో అణు ఒప్పందం అనుకుంటూ మన్మోహన్‌జీ న్యూయార్క్‌ తిరిగి రావడం మినహా. విధానపరమైన ప్రభావశీలమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారంటే చెప్పడానికి పెద్దగా ఏమీ కనబడదు. కానీ అదే సమయంలో మన దాయాది దేశం, మన శత్రుదేశం కలిసి ఎంతకైనా తెగిస్తామంటున్నాయి. ఇంతకు మించి మంచి సమయం ఎక్కడ దొరుకుతుంది మన పొరుగు దేశాలకి….?

పాకిస్తాన్‌ అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుసేన్‌ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జి జింపింగ్‌తో భేటీ అయ్యారు. కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. వాటి ప్రకారం… పశ్చిమ చైనా నుంచి అరేబియా సముద్ర తీరంలోని గ్వదర్‌ ఓడరేవు వరకూ 20 బిలియన్‌ డాలర్లతో ఒక ఎకనామిక్‌ కారిడార్‌ నిర్మిస్తారు. నిజానికి గ్వదర్‌ ఓడరేవును గతంలో నిర్మించి పెట్టినది కూడా చైనాయే. పాకిస్తాన్‌లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న ఓడరేవు గ్వదర్‌. ఇప్పుడీ ఎకనామిక్‌ కారిడార్‌ పూర్తయితే చైనా నుంచి ఓ మోటర్‌ సైకిల్‌ వేసుకుని నేరుగా పాకిస్తాన్‌లోని గ్వదర్‌కు వెళ్లిపోవడం చాలా సులువవుతుంది. ఆ ప్రయాణమార్గం సుమారు 2వేల కిలోమీటర్లు. అది పేరుకి చైనా నుంచి పాకిస్తాన్‌కే కానీ… దానిలో గరిష్ట భాగం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనే ఉంది. అంటే… ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా చైనా, పాకిస్తాన్‌ మరో నాలుగు అడుగులు వేస్తున్నాయన్న మాట. సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా… పీఓకేలో ఎవరి ప్రత్యక్ష పరిపాలనా లేకపోతే దాన్ని భారత్‌ గెలుచుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఆ అవకాశాలను పూర్తిస్థాయిలో నాశనం చేయడానికే పాకిస్తాన్‌ చైనా కలిసి కష్టపడుతున్నాయి. కారకోరం హైవే నిర్మించాయి. ఇప్పుడు దాన్ని మరింత విస్త్రత పరిచి అభివృద్ధి చేస్తామంటున్నాయి. అంతేకాదు… దానిగుండా రైల్వే లైన్‌, ఆయిల్‌ పైప్‌లైన్‌ కూడా నిర్మించడానికి ప్రణాళికలు రచించుకుంటున్నాయి. అవి కూడా పూర్తయితే… పీఓకే ఎప్పుడో ఒకప్పటికి భారత్‌లో కలిసే అవకాశం సంగతి దేవుడెరుగు… ఇప్పుడున్న జమ్మూకశ్మీర్‌ పక్కలో శాశ్వతంగా బల్లెం పెట్టుకుని పడుకోవలసిందే.

ఈ కారిడార్‌ చివరన ఉన్న రేవు పట్టణం గ్వదర్‌. ఆ నగరంలో విమానాశ్రయం నిర్మించడం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగమే. వ్యూహాత్మకంగా అరేబియా సముద్రంలోని కీలక ప్రాంతంలో ఉంది గ్వదర్‌. ఇరాన్‌-పాకిస్తాన్‌ బోర్డరే అయినా అది భారతదేశానికి చాలా సమీపంలోకి వస్తుంది. అక్కడ ఎయిర్‌పోర్ట్‌ అంటే భారతదేశానికి ఎంత ముప్పు ఉంటుందో ఇట్టే ఊహించవచ్చు. రహదారి, రైల్వే మార్గం, ఓడ రేవు, విమానాశ్రయం… అంటే ప్రయాణ అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ చైనా తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుందన్న మాట.

మరి ఆ పరిస్థితిని ఎదుర్కోడానికి మన దేశం దగ్గరున్న వ్యూహాలేంటి? ఇది బేతాళుణ్ణి విక్రమార్కుడి భుజం మీద శాశ్వతంగా ఉంచేసే ప్రశ్న.

Advertisements

2 Comments (+add yours?)

 1. kastephale
  Feb 20, 2014 @ 09:01:15

  మనం పడుకుని నిద్రపోతున్నాం కదా! విదేశీ వ్యవహారాలని కూడా సరిగా నిర్వహించలేకపోవడం దేశపు దౌర్భాగ్యం.

  Reply

 2. satish
  Feb 24, 2014 @ 11:03:21

  అందుకే ఈ మధ్య చైనా వాళ్లు మన దేశానికి వచ్చారు. పార్లమెంటులో పెప్పర్ స్ర్పేలు చల్లుకుంటున్న మనల్నిచూసి అపరిపక్వ రాజకీయాలని తిట్టుకుంటూ వెళ్లాయి. అసలు వాళ్లు వచ్చిన కథ వేరు. ఇక్కడ రాజకీయ నాయకుల్లో తమను ఎదుర్కొనేంత మార్పు వచ్చేసిందేమో అని భయపడి చెక్ చేసుకోడానికి వచ్చాయి. గల్లీలో కర్రబిళ్ల ఆడుకునే వాళ్లు కూడా రౌడీయిజాలు గూండాయిజాలు చేసి పార్లమెంటులో కుళ్లు రాజకీయాలు వెలగబెడుతుంటే… వీళ్లేం పీకుతారని చైనా హాయిగా గుండెల మీదా చెయ్యేసుకుని వెళ్లింది. తన పని తాను చేసుకుంటూ భారత్ సరిహద్దు డ్రాగన్ నే గోడగా పెడుతోంది. సూపర్ ఆర్టికల్.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: