మిత్రులారా… మీకో అబద్ధం చెప్పనా….

నా దేశ వాసులారా, నా కష్టం మీతో చెప్పుకోనా…
సరిహద్దుల వద్ద నిలబడి ఉన్నాను, నా గాయాలు మీకు చూపించనా…
సెలవులకు వస్తానని పిల్లలకు ఎప్పుడూ చెబుతూనే ఉంటాను,
వాళ్ళ దగ్గర నేనెంత అబద్ధాలకోరునో మీకు వివరించనా…

చూపు మందగించినా వూరి రాదారి మీద వేచి చూస్తూనే ఉంటుంది అమ్మ
నీకోసం కళ్ళజోడు తెస్తానమ్మా అని పదులసార్లు చెప్పిన మాటలే మళ్ళీ చెప్పనా…
వయసు మీద పడినా రోజంతా పొలంలో కాయకష్టం చేస్తూనే ఉన్నాడు నాన్న
హద్దుల కావలి వదిలి కాడీ మేడీ ఎత్తుకుంటానని కబుర్లు చెప్పనా…

హద్దుల దారుల్లో చీకటి కోరల్లో రక్కసి మూకలతో పోరాడుతున్నప్పుడల్లా
అమ్మ, అక్క, చెల్లి, భార్య గురించి మది తలపులతో మరో సమరమే చేయనా…
యుద్ధం పూర్తయ్యే వరకూ బతికే ఉంటాననీ ప్రాణాలతో ఇంటికి వస్తాననీ…
ఎలాంటి పరిస్థితుల్లోనైనా మళ్ళీ కలుసుకుందామనీ ధీమాగా చెప్పనా…

Amar Jyoti

Advertisements

4 Comments (+add yours?)

  1. kastephale
    Jan 26, 2014 @ 13:23:27

    నిక్కచ్చి నిజం.

    Reply

  2. చందుతులసి
    Jan 26, 2014 @ 20:13:51

    దేశ రక్షకుల అంతర్మథనాన్ని కళ్లకు కట్టారు.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: