అదసలు జీవితమే కాదు కదా….

నీవు లేని జీవితం గురించి
ఏ ఆలోచనా లేదు, సణుగుళ్ళూ గొణుగుళ్ళూ లేవు
నీవు లేకుండా కూడా బతుకు సాగిపోతోంది
కానీ… అదసలు జీవితమే కాదే….

suchitra

బహుశా ఇలా జరిగుండాల్సింది
నీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మహలుకు చేరాల్సింది
ఎక్కడో సుదూరంగా ఉన్న భవనమది
కానీ నువ్వు తోడుగా ఉంటే బాగుండేది
భవంతులకు లోటే లేదు, కానీ నువ్వే….

గుండెలో పురుగు తొలుస్తూంటుంది
ఆ ఒత్తిళ్ళలో తల దించుకుని మేం ఏడుస్తూనే ఉంటాం…
కన్నీళ్ళు కారుస్తూ ఉండిపోతాం
నీ నీలాల కన్నులు మాత్రం చెమ్మగిల్లలేదు కదా..
నీవు లేని జీవితం…

నువ్వేదో చెబుతూ ఉంటావు
ఈ రాత్రి చందమామ ఇక నిశిలోకి జారుకోదు
నీ పలుకులు జాలువారుతుంటే రేయి నిలిచిపోవాలి
అంత కంటె ఈ జీవితానికి ఇంకేం కావాలి
కానీ నువ్వే…

(ఆంధీ సుచిత్ర ఇక లేదు.. మరి ఎలా….)

Advertisements

6 Comments (+add yours?)

  1. rpratapa
    Jan 18, 2014 @ 00:45:58

    RIP.. ‘సుచిత్ర’ సేన్ …!

    Reply

  2. gajula sridevi
    Jan 18, 2014 @ 06:47:05

    బాధ మనసును తొలుస్తున్నా , అదసలు జీవితమే కాకపోయినా కాలం ఆగదు కదా …మనం సాగాలి కదా …కవిత చాలా హృద్యంగా ఉంది సార్ .

    Reply

  3. gajula sridevi
    Jan 22, 2014 @ 04:53:36

    అది ఒక అద్భుతమైన పాట , ఆ పాటకు ప్రాణం పోసిన స్వరం, దానికి ధీటుగా నటించిన సంజీవ్ కుమార్….ప్రతిది అలా మనసులో చెరగని ముద్ర వేసినవే.

    Reply

  4. చందుతులసి
    Jan 24, 2014 @ 22:17:16

    నేనూ ఆ పాట విన్నాను. ఇప్పుడు మళ్లీ యూ ట్యూబ్ లో చూశాను. అద్భుతంగా ఉంది.

    ఇలాగే మాకోసం మరిన్ని మంచి పాటలు మాకోసం అందించగలరని కోరుతున్నారు నల్లగొండ నుంచి చందు…, చిత్తూరు నుంచి తులసి..ఇంకా మరి కొందరు శ్రోతలు.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: