…చాంద్రీ మృదు కీర్తి

సాహిత్య చరిత్ర అంటూ చేసిన క్రోడీకరణల్లో ఇప్పటికీ ఇంకా దొరుకుతున్నది, ఆధునిక సాహిత్య అభిమానుల మన్ననలు అందుకున్నదీ… ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రే. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరూ అలాంటి ప్రయత్నం చేయలేదు అని నేను అనను కానీ… ఆరుద్ర పనితనం ప్రతిభో ఏమో కానీ ఇప్పటికీ దానికే కొంత విలువ ఉంది.

నాన్నగారు ఈమధ్య ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర పునశ్చరణ చేస్తున్నారు. స.ఆం.సా.చ.లో నన్నయ మొదలు కొన్ని వందల మంది రచయితలు కవుల పరిచయాలు చేసాడా రుద్రుడు. కొన్ని విశ్వవిద్యాలయాలు కలిసి చేయవలసిన పనిని ఒంటిచేతి మీద పూర్తి చేశారన్న ఘనత కూడా మూట కట్టుకున్నాడు ఆయన. ఆరుద్ర సంకలనం చదువుతున్న నాళ్ళలో ఒకరోజు నాన్నగారు చెప్పిన విషయం విన్నాక నాకు నవ్వూ ఏడుపూ ఒకేసారి వచ్చాయి.

తెలుగు నవల – కొత్త మలుపులు అన్న శీర్షికలో చలం గురించి 20 పేజీలు రాశారు ఆరుద్ర. అందులో చలం రచనల గురించి సగం రాస్తే మిగతా సగం ఎలాంటి సాహితీ ప్రయోజనాన్నీ కలిగించలేని, కనీసం రచయిత వైయక్తిక అనుభవాలుగా విలువనివ్వలేని సోది రాశారట. అలాంటిది విశ్వనాథ సత్యనారాయణ గురించి ఆరుద్రుడు నిండా నాలుగు పేజీలు రాయలేదట. అభిప్రాయాల్లో, భావజాలంలో… విభేదాలున్నంత మాత్రాన అలా చేయడం సరియా? అని నాన్నగారి ప్రశ్న. ఆరుద్ర తన సొంత రచన చేస్తూ ఉంటే దాన్ని తనకు నచ్చిన రంగుతో బ్రహ్మాండంగా నింపుకోవచ్చు… తెలుగుల సాహిత్య చరిత్ర నిర్మిస్తున్నప్పుడు ఆ పని చేయకూడదు కదా… అలా అని అసలుకే వదిలేయలేదు లెండి. తెలుగు లోని సాహిత్య ప్రక్రియలు అన్నింటి గురించీ ఒక్కో విభాగం క్రోడీకరించిన ఆరుద్ర… విశ్వనాథ గురించి మూడు చోట్ల ప్రస్తావించారు. అది ఎలాగో మీరే అవధరించండీ.

********** ********** **********

ఆధునిక యుగంలో కవి సామ్రాట్ బిరుదు వహించి అనేక ప్రక్రియలలో నైపుణ్యం చూపించిన విశ్వనాథ సత్యనారాయణ గారు జమిందారీ యుగం లోనే గేయాలూ పద్యాలూ కథలూ నాటికలూ రాసి “దేశం పట్టనంత కవి”గా పెరగడం ప్రారంభించారు. ఆయన రచించిన కథల వివరాలు చూడండి… జమీందారు కొడుకు, భావనా సిద్ధి, రోధము, తిరోదానము, నీ రుణం తీర్చుకున్నా, కలాలీలు, వియోగిని, కవిసంభవం. విశ్వనాథ తొలిరోజుల్లో వాడుక భాషలోనే కథలు రాసారు. “విశ్వనాథ సత్యనారాయణ కథలు” అనే సంపుటం ఒకటి వెలువడింది. చిన్న కథలపట్ల ఈయనకు చిన్నచూపు లేదని ఈ కథలు ప్రకటిస్తాయి.

……………. …………….

ఇవాళ దేశంలో ఎవరూ తన పక్కన నిలబడలేనంత ఎదిగిపోయిన విశ్వనాథ సత్యనారాయణ గారు తొలిరోజులలో స్కూల్ ఫైనల్, ఇంటర్ చదువుకునేటప్పుడు కొడాలి ఆంజనేయులు గారితో కలిసి సత్యాంజనేయ కవులని జంట కవిత్వం చెప్పారు. అంతకు ముందు అద్రి తనయులు అనే పేరుతో రాసేవారు. గిరికుమారుని ప్రేమగీతాలు తొలి ముద్రణలో ఇద్దరి పేర్లూ ఉన్నాయి. జాతీయోద్యమం మోజులో సత్యాంజనేయ కవులు “అవతార పరివర్తన” మనే నాటకం రాసారు. కొన్ని ప్రదర్శనల తరువాత ఈ నాటకాన్ని ప్రభుత్వం నిషేధించింది. తరువత ఎవరి దారిలో వారు రచనలు చేసారు.

……………. …………….

జమీందారీ యుగంలో చివరి దశాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కొద్దిగా వామపక్షం వైపూ, చలం బొత్తిగా కామపక్షం వైపూ మళ్ళిస్తున్నప్పుడు మధ్యేమార్గంలో కాక పూర్తిగా బండి వెనక్కి తిప్పే ప్రయత్నం చేసిన రచయితా, కవీ ఒకాయన లేకపోలేదు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ. ఈయన 1921లోనే అంతరాత్మ అనే నవల రాసారు. ఇది మరీ ప్రాథమికంగా ఉంది. బాగా చెయ్యి తిరగని రచన. 15 రేకుల నవల. ఇందులో కొంత భాగం 1923లో శారద పత్రికలో ప్రచురితమయింది. మొదటి నవలా రచన 1921లో ప్రారంభించినా తరువాత కొన్నేళ్ళు ఈ ప్రక్రియను ముట్టుకోలేదు. ఆయన బాగా శిల్ప నైపుణ్యం చూపెట్టిన ఏకవీర 1930లో కానీ రచించలేదు. ఆధునిక యుగంలో విశ్వనాథ రచించిన చెలియలికట్ట, వేయిపడగలు నవలలోని పాత్రలు “అంతరాత్మ”లో వేషాలు లేని రిహార్సల్స్ చేసికొంటున్నట్లు కనబడతాయి.

********** ********** **********

నారాయణబాబు, శిష్‌ట్లా వంటి మిత్రుల గురించీ ఘనంగా రాసుకున్నారు ఆరుద్ర. అయితే వారి ఎవరి రచనలకూ శాశ్వతత్వం రాలేదు. శ్రీశ్రీ అనంగానే మహాప్రస్థానం తప్ప ఇంకేం గుర్తుకురావు. మహా అయితే సిప్రాలి వంటి వినోద ప్రధాన రచనలు, సినిమా పాటలూ మరికొందరికి గుర్తుంటాయేమో. చలం రచనల్లో మైదానం తప్ప మరొహటి తెలిసిన వారెందరు? విశ్వనాథ కూడా అదే కోవలో వేయిపడగలు, ఏకవీర, చెలియలి కట్ట వంటి రెండు మూడింటితోనే లబ్ధప్రతిష్టుడు కదా అనవచ్చు. ఐతే… రచనల విస్తృతి, వాటి స్థాయి, శిల్పం, శయ్య, పరిణామం, పరిమాణం అన్నింటినీ గమనిస్తే విశ్వనాథ రచనల్లోనే వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. చదువరిలో ఆసక్తి కలిగిస్తుంది. అందుకే నేటికీ ఆయన సాహిత్య సృష్టి అజరామరంగా నిలిచిపోయింది.

ఇష్టం ఉన్నా లేకపోయినా యెవణ్ణి పట్టించుకోడం, యెవణ్ణి చదవడం మానలేమో వాడే గొప్ప రచయిత. వాడే విశ్వనాథ సత్యనారాయణ. అందుకే ఆ ఆభిజాత్య మూర్తి చెప్పుకోగలిగాడిలా….

అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టిదా వ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్.

Advertisements

6 Comments (+add yours?)

 1. Veerendra
  Sep 11, 2013 @ 08:45:46

  Nice analysis. Good work ra Phani 🙂

  Reply

 2. merajfathima
  Sep 17, 2013 @ 08:21:40

  అద్భుతమైన విష్లేషణ, చాలా హుందాగా రాస్తారు మీరు.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Sep 18, 2013 @ 06:39:04

   ఫాతిమా గారూ… ధన్యవాదాలు. గొప్పదనం విషయానిది తప్ప నాది కాదు.
   భేదాభిప్రాయాలు లేనివారు ఉండరు. ఐనంత మాత్రాన వారి విశిష్టతను మరుగు పరిచే ప్రయత్నం సరి కాదూ అని…. నాన్నగారు చెప్పే, పాటించే ధర్మం.

   Reply

 3. చందుతులసి
  Sep 23, 2013 @ 20:32:17

  చాలా మంచి విషయాలు చెప్పారు మాష్టారూ.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: