దృశ్యాదృశ్యం

నిన్నెంతో చూసాను
అని అనుకుంటూంటాను

కాని
ఎంత ప్రయత్నించినా
నీ రూపు గుర్తు రాదు

యెందుకబ్బా
అని ఆలోచిస్తాను

నిన్నసలు నేను చూడలేదు
అనే నిజం
మనసుకి తెలుస్తూనే ఉంటుంది

అయితే
నిన్ను నేను తప్ప
యింకెవరూ చూడలేదనే భ్రమలో
మనసుని అణిచేసి
తిరిగి ప్రయత్నిస్తూంటాను

నువ్వొచ్చి
నా ముందు నిలబడ్డప్పుడు కూడా
నిన్ను చూడకుండానే
నీ రూపాన్ని గుర్తు చేసుకుంటూంటాను

నిన్నెంతో చూసాను
అని నేననుకుంటూంటాను

Advertisements

4 Comments (+add yours?)

  1. vanajavanamali
    Aug 21, 2013 @ 09:22:39

    చాలా బావుందండి . కవితా శీర్షిక కి తగిన కవిత .

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Aug 21, 2013 @ 18:51:58

      వనజ గారూ… ధన్యవాదాలు.
      కవితకు శీర్షికా, శీర్షికకు కవితా అన్న వాదం సంగతి తెలీదు కానీ… ఇప్పుడు నేను చేసింది మాత్రం కవిత రాశాక శీర్షిక పెట్టడమే.

      Reply

  2. merajfathima
    Aug 22, 2013 @ 15:55:16

    మనస్సుతో చూడటం ప్రేమకు నిదర్శనం కదా అందుకే చూడకున్నా కనిపిస్తూనే ఉంటారు. మీరేమంటారు?

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: