ఆరిపోయిన ఆశాజ్యోతి పేరు….

కళ్ళ నిండా కలలూ, జేబులకు మాత్రం చిల్లులతో దేశ రాజధాని చేరుకున్న లక్షల కుటుంబాల్లో ఆ కుటుంబమూ ఒకటి. 2012 డిసెంబర్ 16నాటి దుర్ఘటన… ఆ కుటుంబాన్ని ఈ దేశం అంతటికీ ఆత్మీయులను చేసేసింది. ఆరుగురు ఉన్మాదుల పైశాచికత్వంతో ఆ కుటుంబానికి కలిగిన తీరని లోటును… ఈ దేశమంతా తమకు కలిగిన లోటుగా భావించింది. ఆ ఇంటి ముద్దుల కూతురి మరణానికి కన్నీళ్ళు పెట్టని వాళ్ళే లేరు.

తన కూతురు చనిపోయిందన్న విషయం ఆయనకు తెలుసు. అంతకు ముందు అమానుషమైన హింసకు గురైందనీ తెలుసు. ఆ హింసాకాండకు కారకులు దొరికారనీ తెలుసు. ఇప్పుడాయన కోరుకుంటున్నది ఒకటే. మనిషి రూపంలో ఉన్న ఆ నీచులు ఈ భూమండలానికి చెందిన వారు కాదు. వాళ్ళను ఉరి తీయండి. ఇక్కణ్ణుంచి తరిమేయండి.

తమ కుమార్తె చనిపోయి రెండు వారాలు దాటుతున్నా… ఆ కుటుంబం ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. బాధితురాలు క్రిస్మస్ రోజున తన చేతివేళ్ళు ఆకాశం వైపు చూపిందట… స్వర్గానికి వెళ్ళిపోతానంటూ. ఆ జ్ఞాపకం గుర్తొస్తే చాలు… కన్నీరు మున్నీరైపోతున్నాడా అమ్మాయి తమ్ముడు. అసలా కుటుంబంలో కొంతలో కొంత ధైర్యంగా ఉన్నది…. ఆమె తండ్రి ఒక్కడే. పరీక్షలు దగ్గర పడుతున్నాయీ… చదువు మీద దృష్టి సారించండీ అని చెబుతున్నాడు మిగిలున్న ఇద్దరు కొడుకులకూనూ. ఎలాగైనా డాక్టర్ కావాలన్న కూతురి కోరికని ఆ దుర్మార్గులు చిదిమేశారు… ఇప్పుడామె కలలను సాకారం చేయడం ఆమె తమ్ముల చేతిలో పని అని ఆయనకు తెలుసు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ఆయన్ను కలిసినప్పుడు తన కూతురి జ్ఞాపకాలు ఆ తండ్రి గుండె పొరల్లోనుంచి పెల్లుబికి వచ్చాయి.

“నా కూతురికి పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా కావాలనుకుందంటే అది దొరికే వరకూ వదిలేది కాదు. తను నాలుగో తరగతిలో ఉన్పప్పుడు స్కూలుకెళ్ళే దారిలో ఓ స్వీట్ షాప్ ఉండేది. అక్కడ ఏదైనా స్వీట్ కావాలని తనకు అనిపిస్తే… ఆ దుకాణం యజమానిని కూడా సతాయించేది. పైచదువుల విషయంలోనూ అదే పట్టుదల చూపించింది. తను ఏం చేయాలనుకుందో అదే చేసింది. ఒకసారి నేను తన స్నేహితుల గురించి అడిగాను. ‘నాన్నా, నా పుస్తకాలే నా స్నేహితులు’ అని చెప్పింది. తను చిన్నతనం నుంచీ డాక్టర్ కావాలనుకుంది. మా పిల్లలకు మంచి చదువుల కోసమే మా పల్లెటూరి నుంచి ఢిల్లీ వచ్చాం. నా కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నన్ను గట్టిగా పట్టుకుని గంటలకు గంటలు నిద్రపోతుండేది. ఈ ఘటన జరిగాక మొదటి రెండురోజులూ తను స్పృహలో లేదు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక, తనకు తినడానికి ఏమైనా పెట్టమని డాక్టర్ ని అడిగింది. ఐతే భోజనం పెట్టడం కుదరదని డాక్టర్లు చెప్పారు. అప్పుడామె వాళ్ళని టాఫీ కావాలని అడిగింది. లాలీపాప్ ఇవ్వమంటావా అని అడిగారు వాళ్ళు. సరే అంది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళమ్మతో కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు వాళ్ళమ్మని పట్టుకుని ‘అమ్మా… సారీ, సారీ…’ అంటూ చెవిలో గుసగుసలాడింది.”

నా కూతురు ఏ తప్పూ చేయలేదు. తనను తాను కాపాడుకోడానికి ప్రయత్నించింది. ఆమె పేరును దాచాల్సిన అవసరం ఏమీ లేదు. నా కూతురు ఎంత శారీరక, మానసిక వేదన అనుభవించిందో… అయినా… జీవితం మీద ఆశలు కోల్పోకుండా ఆఖరి ఊపిరి వరకూ ఎంతలా పోరాడిందో… ప్రపంచానికి తెలియనీయండి. తనలా హింసకు గురైన వారికి స్ఫూర్తి కలగాలి. జీవితం మీద ఆశ పెరగాలి. ఎవడో నికృష్టుడు చేసిన నేరానికి కుమిలిపోతూ … చనిపోయేవరకూ చీకటి గదిలో మగ్గిపోకుండా… వారు సాధారణ జీవితం గడపాలి. అది జరగాలంటే నా కూతురి పేరు అందరికీ తెలియాలి. ఆకాశం పైకప్పు ఎక్కి దిక్కులు పిక్కటిల్లేలా అరవాలి… అంటున్న ఆ తండ్రి పేరు బదరీ సింగ్ పాండే. ఆరిపోయిన ఆయన ఆశాజ్యోతి పేరు జ్యోతీ సింగ్ పాండే.

బదరీ సింగ్ పాండే, ఆయన కుటుంబం

Victim Family

Advertisements

2 Comments (+add yours?)

  1. the tree
    Jan 07, 2013 @ 19:05:55

    జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే.జ్యోతీ సింగ్ పాండే…………… ……………………………………………..

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: