కాలోయం దురతిక్రమః

దేశంలోనుంచి పోలియో పారిపోయి ఏడాది గడిచిపోయిందట. శుభం. ఇది నిజంగా నిజమై ఉంటే ఎంత బాగుంటుంది? కానీ… నమ్మడం సాధ్యమేనా?
ప్రభుత్వం ఆర్థిక అక్రమాలను బైటపెడుతున్న కాగ్ ని బహుళ సభ్య వ్యవస్థ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఆహా. అస్మదీయులుంటే ఆడిటింగ్ రిజల్ట్స్ కూడా మనకు అనుకూలంగా వచ్చేలా చేసుకోవచ్చుగా.
అవినీతి ఏమైనా పాలక పక్షం పేటెంట్ రైటా అంటూ ప్రతిపక్ష నేత బాధపడినట్టున్నాడు. ఆయన కూడా ‘సమాజ సేవ’లో ఆర్థికంగా తరించాడు. విభిన్నమైన పార్టీకి కూడా భిన్నత్వంలో ఏకత్వం కావాలి మరి.
రాజకీయాల ప్రక్షాళనతోనే అవినీతి అంతమవుతుందట. దానికి బైటనుంచి పోరాడాలని ఓ అన్న, లోపలనుంచే పోరాడాలని మరో ఆమ్ ఆద్మీ కొట్టుకున్నారు. ఈ ఇద్దరికీ మిగిలేది ఓటమేనేమో.

ట్విట్లరూ, ఫేస్ బుక్ ద్వారా సమాచారం పంచుకోడంతో ఆందోళన కార్యక్రమాలు శరవేగంగా ఆర్గనైజ్ అయిపోతున్నాయి. ఈ అర్బేన్ యాజిటేషన్లు ఎంతవరకూ నిలబడతాయి?
మోడీ మరోసారి గెలిచాడు. ఢిల్లీవైపు చూస్తున్నాడు. ఆ పరిణామం కాంగ్రెస్ కే కాదు… కమల దళానికీ నచ్చడం లేదట. అమెరికా, ఇంగ్గండ్ మాత్రం మనసు మార్చుకునేలా ఉన్నాయి.
మణిపూర్లో పబ్ నుంచి బైటకొస్తున్న అమ్మాయిపై సామూహిక దాడి, ఢిల్లీలో బస్సెక్కిన అమ్మాయిపై సామూహిక అత్యాచారం-హత్య. ఆడపిల్లల డ్రెస్సుల గురించి అమ్మాయిల అఫెన్సివ్, మగాళ్ళ డిఫెన్సివ్ వ్యాఖ్యలకే ప్రాధాన్యం. నేరాలు తగ్గించే దిశగా సామాజికంగానూ, మానసికంగానూ ప్రయత్నాలు నామమాత్రం.

వాడు నాలుగేళ్ళ నాడు మనింటి మీద దాడి చేయించాడు. ఐనా తప్పు మీదేనంటూ బొంకాడు. మీ పాత నేరాలకే వారలా స్పందించారని మండిపడ్డాడు. వాళ్ళలో దొరికిన ఒకణ్ణి శిక్షిస్తే దానికీ విరుచుకుపడ్డాడు. మీ ఇల్లు కూలగొట్టేస్తామంటూ ఇంకొకడితో ప్రకటనలు చేయించాడు. ఐనా వాడితో ఆటలాడాల్సిందేనని మనింటి పిల్లలు పట్టుపట్టారు. అక్కడి పిల్లలూ ఇక్కడికొస్తారని మారాం చేశారు. దాని గురించి మాట్లాడ్డానికి వాడు మనింటికొస్తే బిర్యానీ పెట్టాం. అది తినేసి మీకు మీ ఇల్లు కాచుకోడం రాదని తిట్టేసి వెళ్ళిపోయాడు. అయినా వాళ్ళ పిల్లలు మన దేశానికి వచ్చారు. ఇక్కడ ఆటలాడ్డం మొదలెట్టారు. శాంతీ సహనమూ అని పెద్దవాళ్ళు చెబుతారేమో కానీ… నాలాంటి మూర్ఖులు దాన్ని సిగ్గూ శరం లేకపోడం అంటారు.

మాట మాట్లాడితే కాలం మారిపోతోందీ మనమూ మారిపోవాలీ అనే మహానుభావులకి ఓ దండం. కాలం ఏం మారుతోంది? ఏ మార్పూ లేకుండా తన ధర్మం తాను నిర్వర్తించుకుపోతోంది. మన ధర్మం మనకు గుర్తుండక… మార్పు గురించి మాట్లాడుకుంటాం. అరిచి గగ్గోలు పెడతాం. ఏ మార్పులూ వద్దు బాబో… మనుషులం.. మనుషుల్లా ఉందాం.. ప్రవర్తిద్దాం. అది చాలు.

Advertisements

1 Comment (+add yours?)

 1. kastephale
  Jan 01, 2013 @ 05:38:13

  కాలం ఎవరికీ దాట రానిదే!
  ఎవరెన్ని చెప్పినా ఓటు బేంక్ రాజకీయం ఈ దేశాన్ని వదిలేలా లేదు.
  నూతన వత్సర శుభకామనలు.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: