యశ్… ఎంత ప్రేమ నీకు

ఉన్నట్టుండి నాకో విషయం అవగతమవుతుంది
నువ్వు పుట్టింది నాకోసమే అని అర్ధమవుతుంది
ఏ తారాలోకాల్లోనో ఉండే నిన్ను ఈ భూమ్మీదకు
ఆ దేవుడు నా కోసమే పంపించిన సంగతి తెలుస్తుంది

నీ మేని మెరుపులు, నీ చూపుల తూపులు నా కోసమేనా
ఒత్తరి మెత్తని నీలాల నీ కురుల నీడలు నా సొంతమేనా
విడీ విడని నీ పెదాలు, చుట్టుకుని వదలని నీ చేతులూ నావే కదా

దూరాన్నుంచి సన్నగా షెహనాయి పాట వినిపిస్తూంటుంది
నీ మోముపై మేలిముసుగు మెలమెల్లగా జారిపోతూంటుంది
తొలిరేయి నునుసిగ్గు తెరల కౌగిలిలో నీవొదిగిపోతూంటావు
ఆ స్వప్న సౌకుమార్యం నా గుండెల్లో నిలిచిపోతుంది

ఈ జీవితమంతా నువ్వు నన్నే ప్రేమిస్తావు కదూ
ఆరాధన నిండిన సోగ కళ్ళతో నన్నే చూస్తావు కదూ
అలా కొత్తగా ఊరకనే నన్ను చూస్తూనే ఉంటావు కదూ
ఉన్నట్టుండి నీ ప్రేమ నాకు అలా అలా గుర్తొస్తూనే ఉంటుంది


(ప్రణయ హృదయాలను మండించేసిన సాహిర్ లూధియాన్వీ కభీ కభీ గీతానికి పేలవపు టనుకృతి)

Advertisements

10 Comments (+add yours?)

 1. కొత్తావకాయ
  Oct 28, 2012 @ 00:06:00

  హిందీ అర్ధం కాని ఓ నేస్తానికి “కభీ కభీ..” వింటే ఏమనిపిస్తుందో చెప్పాలని ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నా. నా పని సులువయ్యింది. 🙂 థాంక్యూ..

  పేలవపుటనుకృతి కాదండీ.. బావుంది. ఒక్కోసారి అనువాదం అనుభూతిని పలుచన చేసేస్తుంది. అది జరగలేదు. కనుక బాగున్నట్టే.

  Reply

 2. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Oct 28, 2012 @ 17:11:46

  ఆవకాయ గారూ… తీపి తినిపించారు, ధన్యవాదాలు.

  Reply

 3. Dantuluri Kishore Varma
  May 18, 2013 @ 22:58:02

  బాగుంది ఫణీంద్రగారు.

  Reply

 4. చందుతులసి
  Jun 16, 2013 @ 11:54:50

  కభీ కభీ పాటను….మీ అనువాదాన్ని పోల్చి చూసి మరీ…మళ్లీ మళ్లీ విన్నాను. చాలా బాగా అనువాదం చేశారు. ఏదైనా మంచి హిందీ కావ్యాన్ని తెలుగు పాఠకుల కోసం అనువాదం చేయకూడదా మాస్టారు….

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jun 22, 2013 @ 12:57:55

   చందూ… నాలుగు హిందీ ముక్కలు తెలుసుకుని ఏదో గిలికినంత మాత్రాన నువ్వు ఇలా చితక్కొట్టాలనుకోడం భావ్యమా? కావ్యాలా! కనీసం కవితలు చదవడం కూడా రాదు బాబూ.

   Reply

 5. rpratapa
  Jun 13, 2014 @ 01:02:19

  ముకేష్ బదులు మరొకడు పాడినా,
  ఖయ్యం బదులు బప్పీదా కంపోజినా (నీ భాషలో)
  అభీ తక్ భీ ఖయాల్ వచ్చేది కాదేమో…

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jun 22, 2014 @ 14:39:06

   అదో క్లాసిక్‌ కాంబినేషన్ అంతే. వాటికి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించలేం కదా…
   కేకే అయితే విరగదీసేసేవాడు… అంటాడేమో బాచిగాడు….

   Reply

 6. kOnkiskaa
  Jun 13, 2014 @ 07:12:24

  అవగతమవడం, అర్థమవడం ఏమో కాని, ‘ఖయాల్ ‘ ఆంటే ఆలోచన రావడం మాత్రమేనండి. ఆర్థాలు తాత్వర్యాలు అవగతమైపోయినట్టు అనుకోకూడదని మా హిందీ మాస్టారు అనేవారు.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jun 22, 2014 @ 15:12:40

   కోన్‌కిస్కా గారూ…
   అవునండీ… నేను రాసింది తప్పే… మీరు చెప్పిన తర్వాత మారుద్దామనుకున్నాను కానీ…
   సరే… నా అజ్ఞానాన్ని ఇలా కనబడనిద్దాం.. కింద ఎలాగూ మీ వివరణ ఉంది కదా అని.. ఇలా వదిలేస్తున్నా.
   ధన్యవాదాలు. (ప్లస్‌ ఆలస్యపు జవాబుకు క్షమాపణలు)

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: