ఇంటర్నెట్ పెళ్ళిళ్ళ గురించి రంగనాయకమ్మ కథా… దాని వెనుకనే రామాయణంలో చారిత్రక దృక్కోణాన్ని పరిశీలిస్తున్న కవనశర్మ వ్యాసమూ… రెండూ బ్యాక్ టు బ్యాక్ ప్రచురించిన రచన సెప్టెంబర్ సంచిక చదివిన కొన్ని గంటలకి అనుకోకుండా లైఫీజ్ బ్యూటిఫుల్ సినిమా చూశా. శేఖర్ కమ్ముల అన్న పేరు లేకపోతే ఆ సినిమా చూసేవాణ్ణి కాదేమో. ఆనంద్, గోదావరి తర్వాత శేఖర్ ఓ సెన్సిబుల్ డైరెక్టర్ అని భావించిన వాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఆ తర్వాత హ్యాపీడేస్ చూసినా… లీడర్ మాత్రం చూడలేదు. దానికి ధైర్యం చాలలేదు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్… సినిమాగా బ్యూటిఫుల్ గానే ఉంది. ఎంతైనా శేఖర్ సినిమా కదా. కానీ… ఎంత శేఖర్ దైనా సినిమాయే కదా… అందుకేనేమో, దానిలో లైఫ్… లెస్ అనిపించింది. నిజానికి లైఫ్-లెస్ అందామనుకున్నా… శేఖర్ మీద గౌరవం ఆ మాట అననివ్వడం లేదు. ఈ సినిమాతో నా ప్రధానమైన ప్రోబ్లెం ఏంటంటే… ఏ పాత్రకీ ప్రభావం చూపగలిగేంత క్యారెక్టర్ లేకపోడం. కథానాయకులు, నాయికలే కాదు… ఇతర పాత్రలకి కూడా. సినిమా అంతా శేఖర్ కమ్ముల మార్కు డైలాగులే తప్ప… శేఖర్ హృదయం కనబడనే లేదు. అందుకే…తన కూతుళ్ళని చెప్పుకున్న ఆనంద్, గోదావరిలకీ… కొడుకని చెప్పుకున్న హ్యాపీడేస్ కీ మధ్యస్థంగా మిగిలిపోయిందీ ఎల్లైబీ… రామరామ!
‘హ్యాపీడేస్-టూ’ అన్న ప్రచారం మొదటినుంచీ జరిగిన ఈ సినిమా నిజానికి ఓపెనింగ్ నుంచే పరమ భీకరంగా ఉంది. ప్రపంచంలో ధనవంతులు, మధ్యతరగతివారు, పేదవాళ్ళూ అనే మూడు వర్గాలు గీతలు గీసినట్టు డివైడై ఉంటారనీ… మొదటి తరగతి రెండూ మూడూ తరగతులతో కొట్లాడుతూనే ఉంటుందనీ… చెప్పిన తీరు చాలా ఆక్వర్డ్ గా అనిపించింది. అందులో కొంతైనా నిజం కాకపోదన్నది సరే. కానీ… రియల్ లైఫ్ లో అలా మాట్లాడుకోరే. కొట్లాడుకోరే. పోనీ… సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా… అది శేఖర్ సినిమాల్లోనూ ఇలాగే ఉండాలా? నాకైతే… క్యాపిటలిస్టిక్ లెఫ్టిస్టు ఐడియాలజీని రెప్లికేట్ చేస్తున్న సంగతి స్పష్టంగా తెలిసింది.
కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ ని డైలాగుల వరకే పరిమితం చేయడం ద్వారా హ్యాపీడేస్ డైరెక్ట్ ఎఫెక్ట్ లేకుండా మ్యానేజ్ చేసినా… ప్రతీ ఫ్రేమూ… ప్రతీ డైలాగూ… ఆ మూడు సినిమాల్లో చూసినదే, విన్నదే. చివరికి కుక్క కాన్సెప్ట్ కూడా థర్డ్ టైమ్ రిపీట్. ఇంక… పెద్ద వయసు హీరోయిన్, చిన్న వయసు హీరో కాన్సెప్ట్… హ్యాపీడేస్ లో సీనియర్-జూనియర్ గా పెట్టాడు కాబట్టి సరదాగానే అనిపించినా ఈ సినిమాలో అందంగా అనిపించలేదు. (‘కనిపించలేదు’ కాదు). చివరికి అది కూడా ఏదైనా శేఖర్ కి నచ్చిన (ఫెమిని)ఇజమా… ఏమో చూడాలి.
ఆనంద్ లో కమలిని కేరెక్టర్ బలంగా ఉండగానే… రాజా కేరెక్టర్ ప్రభావశీలంగా ఉంటుంది. గోదావరిలో సుమంత్ కేరెక్టర్ ఆదర్శప్రాయంగా ఉండగానే కమలిని కేరెక్టర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆఖరికి హ్యాపీడేస్ లో కూడా టైసన్ పాత్రధారి తనదైన వ్యక్తిత్వం చూపిస్తాడు. కానీ ఎల్లైబీలో ఏ పాత్రకీ వ్యక్తిత్వం అన్నది సరిగ్గా ఎస్టాబ్లిష్ ఐనట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. (కళ్ళజోడు మరచిపోయానా ఏంటి?)
ఐతే సినిమాలో బ్యూటీ లేదా? అంటే… ఓ… బోలెడంత ఉందని చెప్పుకోవాలి. ముగ్గురు మాజీ హీరోయిన్లు సినిమాకి గ్లామర్ బాగానే కలిపారు. అందమైన మనసున్న అమల, అందమైన శరీరంలో అందమైన మనస్సుతో అంజలా, అందమైన శరీరమున్న శ్రియ… ఫిల్మీజ్ ఫుల్లాఫ్ బ్యూటీ. వాళ్ళకి తోడు శేఖర్ మార్కు ఇద్దరు హీరోయిన్లు (పేర్లు తెలీకపోయినా) బాగున్నారు.
అన్నట్టు… ధనవంతులు విలన్లే అని ఔట్ రైట్ గా తేల్చేసిన శేఖర్… ఎందుకో మరి…. ఏ పొయెటిక్ జస్టిసూ లేకుండా వాళ్ళని అలాగే వదిలేశాడు. పైగా… భూముల కబ్జా కోసం, పేదలు దైవంగా భావించే ఓ చెట్టుని, విలనీ ధనవంతులతో చంపించేశాడు కూడా. అలా అని… కనీసం పొయెటిక్ జస్టిస్ కోసమైనా వాళ్ళ మీద హీరో అండ్ కో గెలుపు ఏదీ చూపించలేదు. కాకపోతే, వాళ్ళల్లో పశ్చాత్తాపం కలిగిందా అని అనుమానం కలగాలనో ఏమో, డబ్బులెన్నున్నా సంతోషం లేదే అన్న రెటోరిక్ డైలాగ్ ఆ విలనీ ధనవంతులతో చెప్పించి ఎండ్ చేసేశాడు. ఐతే… సంతోషించడానికి మనసొక్కటే చాలదనీ, ఎంతో కొంత డబ్బు కూడా కావాలనీ ఆయన కన్వీనియెంట్ గా మరచిపోయాడనుకోవాలా! ఏమో.
ఏదేమైనా.. సినిమా అందంగా ఉంది. డైలాగులు వినబుల్ గా ఉన్నాయి. పాటలు హాంటింగ్ మెలోడీస్ కాకపోయినా… ఆహ్లాదకరంగా ఉన్నాయి. కానీ ఎక్కడో ఏదో మిస్సింగ్.
Sep 16, 2012 @ 18:18:36
నేనింకా ఈ సినిమా చూడలేదుకాని, శేఖర్ గత సినిమాలన్నీ చూసాను.
నా దృష్టిలో శేఖర్ కమ్ముల తన సినిమాలని అందంగా ప్రజంట్ చేస్తాడు కాని, గొప్పగా ఏమీ తియ్యడు.
Sep 16, 2012 @ 18:38:59
మీ రివ్యూ బాగుందండి, మంచి పాయింట్లు కోట్ చేశారు. పై కామెంటు కూడా నిజమేలా వుంది.
Sep 16, 2012 @ 19:04:21
అరె..ఈ చిత్రం చూడాలి అనుకున్నాను. అంతా గొప్పగా ఏమి లేదన్నమాట. !
Sep 16, 2012 @ 20:00:22
I hate pictures of today
Sep 17, 2012 @ 12:11:01
బోనగిరి గారూ… మీ మాటతో ఏకీభవించాల్సి వచ్చేలాగే ఉంది. ధన్యవాదాలు
ట్రీ భాస్కర్ గారూ… మీ స్పందనకు ధన్యవాదాలు
వనజా మేడమ్… ఫర్వాలేదు, ఓసారి చూడొచ్చు. (శేఖర్ అభిమానిగా చూడొద్దని చెప్పలేనండీ :))
శర్మ గారూ… శేఖర్ సినిమాలని ద్వేషించనక్కర్లేదేమోనండీ.
Sep 17, 2012 @ 19:35:42
ఎటువంటి ఉద్రేకాలు లేకుండా మనసుకి హాయిని కలిగించే ఆనంద్ గోదావరి లాటి సినిమాలు తీసిన శేఖర్ గారు కూడా మూస సినిమాలు తీస్తుంటే కొంచెం బాధగా ఉంది ఇక ముందు ముందు మంచి సినిమాలు అప్పుడప్పుడూ కూడా చూడలేం కాబోలు
Sep 18, 2012 @ 11:28:02
వీణ గారూ…
మూసే కానీ అది శేఖర్ మూస. ప్రస్తుతానికి ఇంకా ఉద్రేకాలకు తావిచ్చేలా లేదా మూస. ఏమో… మళ్ళీ శేఖర్ విభిన్న తరహా చిత్రాలు తీస్తాడేమో.
Sep 19, 2012 @ 13:33:53
వినాయకచవితి శుభాకాంక్షలండి,