మెదడు మోకాల్లో ఉండే ఆడ జాతికి…

మాటిమాటికీ ఆడాళ్ళకు మెదడు మోకాల్లో ఉందంటావు, మా స్వేచ్చని వాడుకుంటూ ఏం చేసినా తప్పుపడుతుంటావు… నీకసలు బుర్రా బుద్ధీ ఉందా… అసలు మీ మగాళ్ళకి అరికాల్లో ఉంటుంది బుర్ర…. ఉక్రోషం తట్టుకోలేక ఓసారి అడిగేసి కడిగేసింది ఓ సహోద్యోగిని.

అందుకే మీది కోడి బుర్ర అనేది. అసలు మగాళ్ళకి మెదడే ఉండదు కదా. వాళ్ళకి మళ్ళీ మోకాల్లో ఉంటుందని అనుకునేంత కాలం మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు అన్నాను నేను వెంటనే.

అంటే… ఆశ్చర్యంగా అడిగిందామె.

ఏముంది, మగాళ్ళు పశువుల కంటె హీనం. వాళ్ళ నుంచి కాపాడుకోడానికి మీ ఏడుపు మీరే యేడవాలి.

మరి ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే కదా.. ఒకళ్ళ నుంచి మరొకళ్ళు రక్షణ కోసం కష్టపడ్డమేంటి?

మళ్ళీ నీ ఆడ కోడి బుద్ధి చూపిస్తున్నావ్. ప్రజాస్వామ్యమే పెద్ద జోక్. ఎన్ని రకాల సుత్తి కబుర్లు చెప్పినా… బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌ని దాటే సంస్కారం సమాజంలో యూనీఫాంగా ఎదగనంత కాలం మీరు మీ మోకాలిని జాగ్రత్తగా వాడుకోవాలి.

ఈ వెధవతో ఎందుకు మాట్లాడానురా బాబూ… అనుకున్నట్టు ఓ విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయిందామె.

*** *** *** *** *** ***

గతంలో చదువూ సంస్కారం అనే జమిలి పదాలుండేవి. తెల్లోడి పుణ్యమా అని మనదైన విద్యా విధానాన్ని తగలేసుకున్నాక ఆ రెండో పదాన్ని అందరమూ వదిలేశాం. దానితో పాటే మనలో సున్నితత్వమూ సౌకుమార్యమూ పూర్తిస్థాయిలో నశించిపోడం మొదలయింది.

ఇక ఈక్వాలిటీ ఆఫ్ జెండర్స్ అని మొదలెట్టి ఆడకీ మగకీ తేడా తెలీకుండా చేసుకున్నాం. ఏ జీను ప్యాంటునో చూసినా అది మగదో ఆడదో తెలుసుకోడానికి పరీక్షగా మళ్ళీ చూడాల్సిందే. ఖర్మ కాలి చూసేది మగాడూ, తొడుక్కున్నది ఆడాడూ… ఎర్ర్… డదీ అయితే… సదరు ఇస్త్రీ మూర్తి చెలరేగిపోడం మొదలెడుతుంది. ఒక దశ వరకూ ఫ్లర్టింగ్‌ని ఎంజాయ్ చేసి తరవాత విరుచుకుపడే ఈ ఆడాళ్ళని భరించడం మానవమాత్రుడికి అసాధ్యం….. (ఆగాగూ.. టాపిక్ డైవర్ట్ ఐపోతోంది)

ఆధునికత ముదురుతున్న కొద్దీ మనిషిలో సంస్కారం పెరుగుతుందన్నది సర్వసాధారాణంగా కలిగే ఓ భావన. కానీ నిజం దానికి పూర్తి విరుద్ధంగా ఉంటోంది. మగాళ్ళ సంగతి సరే స్త్రీల్లోనూ సెన్సిటివిటీ కనిపించడమే లేదు. తమలో తప్పు పెట్టుకుని ఎదుటి జంతువుల్లో సెన్సిటివిటీని ఆశించడం ఆడాళ్ళ తప్పే కాదు, నేరం కూడా.

ఇంక ఆపు నీ నీతి సూత్రాలు. ఎవడికి తెలీదు సంస్కృతీ పరిరక్షకులమంటూ పోజులు కొట్టే మీలాంటి వాళ్ళ కురచ బుద్ధులు. స్త్రీని భోగ వస్తువుగా చూసే మీరా ఈ కాకమ్మ కథలు చెప్పేది అని విరుచుకుపడే మహానుభావు(విణు)లకో దండం. 80-20 సూత్రం తెలుసుగా. గతంలో 20శాతానికి పరిమితమై, సోషల్ టాబూగా పరిగణించబడే విషయాలు ఇప్పుడు 80 శాతానికి చేరి సోషల్ స్టేటస్‌గా మారుతున్నాయి. “అది తప్పు” అని చెప్పడం నైతిక సుత్తిగా మిగిలిపోతోంది. అలా… నేరాల సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి నేరాలకు బలయిపోయే ప్రమాదం పొంచి ఉందని తెలిసినపుడు దాన్నుంచి కాపాడుకునేందుకు చర్యలు తీసుకోడం ఏ మనిషికైనా అవసరం. కాదూ కూడదూ అంటారా… గువాహతిలో జరిగిన ఘటనల్లాంటివే పునరావృతమవుతుంటాయి.

గువాహతి ఘటన మనుషుల్లో… ముఖ్యంగా మగాళ్ళలో నానాటికీ నశించిపోతున్న మానవత్వానికీ, వికృత వికటాట్టహాసం చేస్తున్న పైశాచికత్వానికీ ప్రత్యక్ష తార్కాణం. మొన్న సోమవారం నాడు (09-07-12) ఓ అమ్మాయి ఓ పుట్టినరోజు పండుగకు అటెండ్ కావడానికి తన స్నేహితులతో కలిసి ఓ బార్‌కి వెళ్ళింది. అక్కడ ఆ మిత్రుల్లోనే ఒకరు ఈ అమ్మాయి గురించి అసభ్యంగా కామెంట్ చేశాడు. దానితో వారి మధ్య గొడవ జరిగింది. బార్ యాజమాన్యం వారిని బయటికి తరిమేసింది. ఆ రాత్రి పూట అరకొర బట్టల్లో రోడ్డు మీద కనిపించిన ఆ అమ్మాయిని ఓ మగ రాక్షసుల గుంపు చూసింది. ఇంకేం. ఆమెపై దారుణమైన దాడి జరిగింది. నడి రోడ్డు మీద ఆ అమ్మాయిని చుట్టుముట్టి చితక్కొట్టి (ఉన్న సగం సగం) దుస్తులు ఊడపెరికే ప్రయత్నం చేసి ఆ అమ్మాయిని పాశవికంగా హింసించారు. రేప్ ఒక్కటి తప్ప మిగతా ఘోరమైన పనులన్నీ చేశారు.

*** *** *** *** *** ***

ఇప్పుడు ఎన్ని సూక్తులు చెప్పుకుంటే ఏం లాభం. ఆడది అర్ధరాత్రి పూట స్వేచ్చగా తిరిగినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అంటూ ఐడియల్ జిబ్బెరిష్ మాట్లాడుకోడం వల్ల ఏం ఒరుగుతుంది? అయినా ఆ అమ్మాయి తప్పేమీ లేదూ అనే అంటారా స్త్రీవాదులు… మరింకేం…. పొట్టి షర్టులూ, పింక్ మిడ్డీలూ వేసుకుని రాత్రుళ్ళు బార్‌లకు వెళ్ళి మందు కొట్టి నిరసన ప్రసంగాలివ్వండి.

ఎన్ని రకాల కబుర్లు చెప్పుకున్నా… మగాడు తన పాశవిక ప్రవృత్తి వైపే వెడుతున్నాడు. గతంలో కనీసం సామాజిక బంధనాలు అడ్డం ఉండేవి. ఆధునికత పుణ్యమా అని అలాంటి నిబంధనలన్నీ మూర్ఖత్వాలుగా పరిగణించే మనస్తత్వాలు బలుస్తున్నాయి. ఇంట్లో కూచుని అంట్లు తోముకోకుండా ఆడాళ్ళు తగుదునమ్మా అని రోడ్లెక్కేస్తున్నారు. అరకొర బట్టలు వేసుకుని అవతలి మృగాలను రెచ్చగొట్టీ… మా తప్పేం లేదంటే… సంస్కారం అనే విషయమే బహిష్కృతమైపోయిన నేటి సమాజంలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి.

మరి మగాడి తప్పేమీ లేదా అంటూ గుర్రుగా చూడకండి. మొదటే చెప్పానుగా… ఆడాళ్ళకి మోకాల్లో ఉండే మెదడు అనే పదార్ధం మగాడికి లేనే లేదనీ…! పశువుల కంటె హీనమైన ఆ రాక్షసులకు శిక్ష వద్దా… అనే కదా అడుగుతున్నారా… ఇదిగో.. నాకు తోచిన శిక్ష ఇక్కడ చూడండి.

(పొద్దున్నే ఇంట్లో వంట చేసి ఆఫీసుకు వచ్చిన వెంటనే ఈ వార్త చూసి మనసు పిచ్చెక్కి అడ్డగోలుగా రాసిన రాత. ఈ టపాలో స్ట్రీంఆఫ్ ఫ్లో సరిగ్గా లేకపోతే ఈసారికిలా ఎడ్జస్ట్ చేసేసుకోండి.)

Advertisements

56 Comments (+add yours?)

 1. kastephale
  Jul 13, 2012 @ 17:10:00

  దీని మీద చర్చోపచర్చలయిపోయాయి సార్! మా ఇష్టం వచ్చినట్లు వేషధారణ చేస్తామన్నవారినేంచేస్తారు. మొగాళ్ళకి బుద్ధి లేకపోయినా అడాళ్ళకి బుద్ధి లేకపోయినా నష్టపోయేది స్త్రీ మాత్రమే. Let us hope good sens will prevail on all.

  Reply

 2. chandhuthulasi
  Jul 13, 2012 @ 18:49:03

  సార్…ఆడాల్లపై అఘాయిత్యాలకు, ప్రజాస్వామ్యానికి లింక్ ఎక్కడ వుందో నాకర్ధం కాలేదు. నిందా స్తుతిలో ఆడాళ్ళను తిడుతూనే బాధను, కోపాన్ని, వెల్లకక్కారు.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 13, 2012 @ 19:14:19

   తులసీ (నువ్వే కదా, లేక చందూనా)…

   ప్రజాస్వామ్యంలో లింగ వివక్ష ఆధారంగా ఏ అఘాయిత్యాలూ జరక్కూడదు కదా, అలా చూడ్డానికి వ్యవస్థలున్నాయి కదా… అందుకన్న మాట. అయినా…. టపా చివరిలో డిస్‌క్లెయ్‌మర్ చూడలేదా…!

   Reply

 3. the tree
  Jul 13, 2012 @ 20:13:41

  too complicated topic, meekika commentle commentlu,
  ha,ha, enjoy (saradake sir, ee vishayam lo na abiprayalaku viluva ledu)

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 15, 2012 @ 16:03:40

   tree bhaskar….

   for me, it is not at all a complicated issue, Man is a sophisticated animal, and never cannot control his wild behavior. circumstances – both external and internal – alone will stop him from taking or not taking advantage.

   comments kosam kadamdi ee post pettinadi, feeling mukhyam kada… (in the lines of sunil in atadu movie :))

   don’t ever say your opinion has no value. i may agree or disagree, but respect your opinion. 🙂

   Reply

 4. veenaalahari
  Jul 13, 2012 @ 20:37:51

  ఫణీంద్ర గారు చాలా కరెక్ట్ గా చెప్పారు ఆడపిల్లల వస్త్రధారణ లో మార్పు రానంతవరకు మగ పశువులను ఏమీ అనే అవకాశమే లేదు.పిల్లల్ని అలాంటి డ్రెస్ లో చూసి సిగ్గుపడని ఆ తల్లిదండ్రుల్ని ముందుగా అనాలి.ఇంకా తల్లిగా భార్యగా పనికొచ్చే ఆడది కూతురిగా మాత్రమే పనికి రావడం లేదేందుకో అలాటి వాళ్లకి ఏ శిక్ష వేసినా తక్కువేనేమో.ఇలాటి సంఘటనలు చర్చలకి నాలుగు రోజుల ఉద్యమాలకి ఏదో చేయ్యాలన్న కోపానికి ఏమీ చేయలేని నిస్సహాయతకు పరిమతమౌతున్నాయే తప్ప సమస్య పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో కనబడడం లేదు.

  Reply

 5. Sri
  Jul 14, 2012 @ 01:46:53

  *పిల్లల్ని అలాంటి డ్రెస్ లో చూసి సిగ్గుపడని ఆ తల్లిదండ్రుల్ని ముందుగా అనాలి.*
  కొన్ని సిటిలలో తల్లి కూడా అదే డ్రెస్ వేసుకొని కూతురి అందానికి పోటి ఇవ్వాలని చూస్తుంది. అసలికి ఎక్కడో ఉన్న రాష్ట్రం లో కల్చర్ మీద మనకేమి అవగాహన ఉంది. ఆ సంగటనలను తప్పొప్పులు నిర్ణయించటానికి. మీడియాకైతే ఎదో ఆడోళ్లన్ను మెరుగైన సమాజంకొరకు ముందుకు తీసుకుపోతున్నమని డబ్బా కోట్టుకోవచ్చు.

  మీరు పాతరోజుల్లో లాగా బాధపడుతున్నారు. అబ్బాయిలకి ఇమ్రాన్ హష్మీ సినేమాలు,కథలు చెపుతూ పెంచితేనే నేటీ ఈ నవీన యుగంలో వాళ్లు నెగ్గుకొచ్చేది.

  Reply

  • Sri
   Jul 14, 2012 @ 12:20:23

   DO NOT Publsih my comment

   అయ్యా ఫణిగారు, ఆ paina కామేంట్ ను తొలగించండి. ఇమ్రాన్ హష్మి ఆదర్శం అని ఎదో వ్యంగ్యంగా రాశాను.
   విషయానికొస్తే నేను మీలాగే చాలా సార్లు అనుకొనేవాడిని. మా సిటిలో కల్చరల్ షాక్ చూసి భయం వేసేది. తల్లులు కూడా మిడ్డిలు, మినిలు వేసుకొని కూతుళ్లతో షాపింగ్ కి బయలుదేరుతారు. ఎన్ని మార్లు అమ్మాయీల పైన దాడి జరిగిందనిపేపర్లో వార్తలు వచ్చినా ఏ పబ్ లో నైనా రోజు జరిగే పార్టిల సంఖ్య తగ్గిందా? అమ్మాయిలు పోకుండా ఉంట్టున్నారా? అక్కడికి వేళ్లే అమ్మాయిలకి తెలుసు పబ్ వోనర్లు దుర్గటనలు జరిగిన తరువాత పెద్ద జాగ్రత్తలు ఎమీ తీసుకోలేదని. అయినా వేళ్లుతూనే ఉంటారు. మనదేశం లో ఉన్న అవినితి వ్యవస్తలో, న్యాయం జరుగుతుందని ఆశించటం అత్యాశ. ఆడైనా, మగైనా ఎవరి జాగ్రత్తలో వారుండాలి. ఆమాట మీరు చెప్పారే అనుకోండి, మీ పైన పడి అందరు రక్కుతారు. ఇమ్రాన్ హష్మీ సినేమాలకు వేళ్లినపుడల్లా అతని సినిమాలలో ఓవర్డొస్ సీన్లు వచ్చినపుడు,పాత తరం ప్రతినిది నైనా నాకు చూడాలంటే ఇబ్బంది గా ఉంట్టుంది. కాని చుట్టుపక్కల ఉన్న వారు ఎలా ప్రతిస్పందిస్తారో గమనిస్తే ప్రస్తుత తరం మహిళలు ఏ అభ్యంతరం, ఇబ్బంది లేకుండా ఎంతో ఇదిగా యంజాయ్ చేస్తూంటారు.
   కాలం మారింది. మనం దానిని గుర్తించాలి. ఇక బ్లాగులోకం లో అంతా మధ్యతరగతి నడివయసు వారూ, వృద్దులు ఎక్కువగా వ్యాసాలు రాస్తూంటారు కనుక నీతులు ఎక్కువగా వినిపిస్తుంటయి. ప్రస్తుత తరం ఎంత అగ్రెసివ్ గా మారిందో మన ఊహకు కూడా అందదు. ఇంట్లో అందరూ మంచిగానే ఉంటారు, బయటకు వచ్చిన తరువాత వాళ్లు ఆడవరైనా, మగవారైనా వారు చేసే చేష్ట్టలు మన ఊహకు కూడా అందవు. ఇది ఎన్నో సం|| పరిశిలనతరువాతా అవగాహనైంది. కాలం,తరం,టెక్నాలజి ఎంతో మారింది, మనుషుల ప్రవర్తన లో కూడా మార్పులు వస్తున్నాయి. దానిని అర్థం చేసుకోవటంలో అందరు విఫలం అయ్యారు.

   మీరు అమ్మాయిల వరకు వేళ్లారు, నిన్న మావూరిలో ఒకటే వర్షం, నడిరోడ్డు మీద బైక్స్ ఆపి మాట్లాడుతూంటే, హారన్ కొట్టి పక్కకు పోయి మాట్లాడుకొండి అనిచెప్పినందుకు (వర్షంవలన కారు బ్రేక్లు స్కిడ్ అవుతున్నాయి), ఆ మూడూ బైకుల మీద ఉన్నా ఆరుగురు 16సం|| లోపు పిల్లలు, నన్ను ఎగతాళి చేస్తూ, నాకారు ఆపి కిందకు దిగమని సైగలు చేస్తూ, కారు అద్దాన్ని కొడుతూ, కారును చుట్టుముట్టి దానిని వెంబడిస్తూ నానా రచ్చ చేశారు. అంత చిన్న పిల్లలు అంత అగ్రేశివ్ గా ప్రవర్తించటం మొదటి సారిగా చూసి షాక్ కి లోనైయాన్ను. వాళ్లు నాకారు అద్దాలను పగలకొట్టి, నన్ను కొట్టిపోయినా చేయగలిగేది ఎమీ లేదు. పోలిస్తేషన్ లో ఇటువంటి విషయాలకు ఫిర్యాదు కూడ తీసుకోరు. ఇది ప్రస్తుత సమాజ పరిస్థితి.

   Reply

   • ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jul 15, 2012 @ 16:23:42

    sri…

    at first sorry for not deleting your first comment. i don’t think there is any wrong in your sarcasm.

    I did not see any of imran hashmi’s films. but i can understand a little bit the attitude of mahesh bhatt’s group and how do they showcase sexuality.

    “ఎక్కడో ఉన్న రాష్ట్రం లో కల్చర్ మీద మనకేమి అవగాహన ఉంది.” — to the best of my ignorable knowledge, NE part of India is much liberal (can i say bold) in such matters than rest of India. in such a case, a girl’s exposing should not be a matter of sexual attraction.

    No 2: I am not at all talking about culture. cultural aspect is much wider. I am confined to single point that present day society is not only ignoring the need of imbibing ethical values, but is encouraging the generations becoming much vulnerable to primitive and basic negative instincts.

    your experience with teen-age rowdies seconds what I am speaking above.

    “కాలం,తరం,టెక్నాలజి ఎంతో మారింది, మనుషుల ప్రవర్తన లో కూడా మార్పులు వస్తున్నాయి.” — here my perspective is, who should basic moral values of human beings change with time? And, why such change is running backwards only? technology is man-made, man surrendering to it is meaningless.

    As you can easily understand, this is a subject with no conclusion. So here I rest my case.

 6. శ్రీ (జలతారు వెన్నెల)
  Jul 14, 2012 @ 03:04:40

  నేను ఈ టపా చదివి ఆశ్చర్యపోయాను…చాలా విషయాలలో మీరు రాసిన దానితో నేను ఏకీభవించటం లేదు..But oh well!!! Does not matter!! :))

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 15, 2012 @ 16:24:55

   vennela garuu.. thanks. i think you may agree with at least one point, that males don’t have mind at all. 🙂

   Reply

   • Snkr
    Jul 16, 2012 @ 06:47:32

    / i think you may agree with at least one point, that males don’t have mind at all/
    I agree with you in your particular case, as supported by your post. But can’t be generalised based on one post! 😛 :))
    Keep writing such stuff… One day… I may agree. 😉

    btw, men & women are same species and hence they are supposed to have similar constitution.

   • ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jul 16, 2012 @ 12:16:03

    SNKR garu…

    I don’t hesitate to claim myself as a beast, with self restrictions, learnt not at societal level, but at family level. So, I heartily welcome you agreeing me as a mindless one 🙂

    Yes, I agree with that constitution matter to 200 per cent. But the matter of constitution itself is an intellectual thing, i.e., another ideal gibberish, which will work out in rarest of the rare conditions.

    In another side, I think, every man has a miniscule part of femininity, to say at 20 – 80 level with masculinity, and vice versa. when both masculinity and femininity becomes equal, then the ideal constitutions will be able to work effectively.

 7. Vanaja Tatineni
  Jul 14, 2012 @ 06:47:22

  ఈ పోస్ట్ పై నా అభిప్రాయం ఆనే కంటే.. ఒక కోణం గురించి చెపుతున్నాను.

  “పొట్టి షర్టులూ, పింక్ మిడ్డీలూ వేసుకుని రాత్రుళ్ళు బార్‌లకు వెళ్ళి మందు కొట్టి .. ”

  ఇది హక్కు కాదంటారా!? లేదంటారా!?

  మీరన్నట్టు “ఆడాళ్ళకి మోకాల్లో ఉండే మెదడు అనే పదార్ధం మగాడికి లేనే లేదనీ”

  ఇది నిజమేనండోయ్!!

  మగవాళ్ళు బట్టలు సంపూర్ణంగా ధరించలేదని అందువల్ల ఇబ్బందిగా ఉందని ..ఆడవాళ్ళు చుట్టుముట్టి హెరాస్ చేస్తున్నారా!? చెప్పండి ఇంకా ఏమైనా చేస్తున్నారా?

  నియంత్రణ అంటూ ఉండాలే కాని వస్త్రధారణ ఎలా ఉన్నా ఏమి కాదు. కారణాలు వెతికి మరీ.. లేదా ఆడవాళ్ళ పై చిన్న చూపుతో మృగాల్ల పడవద్దు అని.. ఈ తరం అమ్మాయిలూ అంటున్నారు.
  మెదడు ఆనే పదార్ధం లేని మగాడు కి చెప్పడం ఎలా! అర్ధం అయ్యేది ఎలా!?

  ఈ పోస్ట్ లో జరిగే పరిణామం గురించి సున్నితంగా హెచ్చరించారు. అది అర్ధమై ఆలోచించగల్గితే.. అదే శ్రీ రామ రక్ష

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 15, 2012 @ 16:44:05

   vanaja garuu…

   rights and responsibilities…. … I called the same as Ideal Gibberish. I strongly feel “The Change/Growth in the society with Time” is mere a mythical concept. Today’s human being is no more better than the homosaepian. Any kind of social structure is mere a cover for a few power-grabbers, either with stick or carrot.

   One should develop self values at individual level only. However, as a social animal, (s)he cannot rescue self, as the person at the other end may not respond at the same level of intellect. so, no one is safe.

   “ఇది నిజమేనండోయ్” — i think you are happy with that part. 🙂

   man’s dressing is not concerned with sexuality. whereas beauty and dress-sense of a female are things of attraction for opposite sex; power, money and only next, handsomeness attract female sexuality. a half naked man will not provoke sexual emotions in ladies whereas a tinge of cleavage exposing will make males stare. however, exceptions are always there. high society women enjoying a stripping man (in all manners), has been a common phenomenon in even our so-called yet conservative society.

   నియంత్రణ అంటూ ఉండాలే కాని వస్త్రధారణ ఎలా ఉన్నా ఏమి కాదు. కారణాలు వెతికి మరీ.. లేదా ఆడవాళ్ళ పై చిన్న చూపుతో మృగాల్ల పడవద్దు అని.. ఈ తరం అమ్మాయిలూ అంటున్నారు. — sorry to say, sheer escapism of women’s part. the women who has the chance to raise voice, are enjoying good amount of freedom and safety in this society. in most of the controversial cases, wrong lies on both the sides, however, being victim, a woman gets higher sympathy. the wild males can never understand that.

   Reply

 8. Sri
  Jul 15, 2012 @ 19:00:12

  ఎమీ లేదు మీ ఇంటి పేరు చూసి ” పురాణపణ్డ” సనాతన సాంప్రదాయం వారై ఉంటారేమో అని భయంవేసింది. ఇక మహేష్ భట్ గారి గురువు, నా గురువు ఒకరే అండి. ఆయన పేరు యు జి కృష్ణమూర్తి. యు జి గారు గొప్ప యోగి ఐనా, ఎక్కడా దేవుడు, ప్రేమ గురించి మాట్లాడరు. వాస్తవ ప్రపంచం గురించి చాలా నిక్కచ్చిగా,కొట్టినట్లు మాట్లాడుతారు. ఒకప్పుడు భట్ సినేమాల మీద గొప్ప అభిప్రాయం ఉండేది కాదు. కాని నా మితృడికి కూతురు ఉండేది, ఆ అమ్మాయిని తీసుకొని అతని భార్య విడిపోయి విడాకులు ఇచ్చింది. ఇంకొక పెళ్లి సంవత్సరం లోపు చేసుకొనింది. మనం ప్రేమ అది ఇది అనుకొంటాము, కాని జీవితం లో వారికి అన్నిటికన్న ముఖ్యం డబ్బులు, సెక్స్ అని చెప్పాడు. డబ్బులు లేని రోజులు సాంప్రదాయం ముసుగేసుకొని పురుషాదిక్యత ను చాలా ఓపికగా భరిస్తున్నట్లు నటిస్తారు. అంతే. ఇప్పుడు అందరికి వారి వారి స్థాయి నననుసరించి మిగులు డబ్బులు వచ్చాయి. అసలు రంగు బయటపడుతున్నాది.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 15, 2012 @ 19:29:43

   Sri garu…

   mee bhayam nijame ani cheppadaniki migula samtasimchuchunnanu. nenu sampradaya vadaniki karadu gattina samarthakudine. 🙂

   UG Krishnamurtivi nenu peddaga emi chadavaledamdi. ayana gurimchi vinnanu. mumdu sampradaya sahityam ayina ramayana bharata bhagavatale purtiga chadavaledu. a tarvata ramakrishna paramahamsulu, vivekanamda… vallani chadavanivvamdi. tarvata vilunu batti UG daggaraku vasta.

   evari sishyudaina kanivvamdi, mahesh bhatt, ayana camp tise cinemalu phaktu vyaparatmaka chitrale, cinemalaki, guruvulaki sambamdham avasaram ledu kada. paiga, UG batikunna rojullo, ayanaku sishyulam ani cheppukodam fashion emo kada. nijamga ayana tatvam talakekkite mahesh bhatt aa industrylo konasage vadena?

   mi mitrudi jeevitam gurimchi cheppina ghatana — oka vyaktigata vishayam gurimchi daniloni lotupatlu naku telivu kabatti — dani gurimchi matladanu. kakapote oka mata… alamti udamtalu okappudu aruduga umdevi, ippudu samajamlo bhagamaipoyayi. case to case chudalemo.

   Reply

   • Sri
    Jul 15, 2012 @ 22:17:19

    నాకు సాంప్రదాయవాదులు అంటే భయమండి. ఇక మా గురువుగారు విలువలు గురించి ఎప్పుడు మాట్లాడడు. ఆయన వాటికి అతీతం. ఆయన ఎవరిని ఎదీ పాటించమని చెప్పడు. చిన్నపటి నుంచి మీ అమ్మానాన్నలు అది చేయి,ఇది చేయవద్దు అని చెపుతూ పెంచారు. మళ్లి నేను చెప్పేది ఏముంది? నువ్వు ఎందుకు మళ్లి మారాలనుకొంట్టున్నావు? అది అయ్యే పనికాదు, అలాగే ఉండు అని చెప్పి పంపుతారు. There is nothing wrong in this world, why are you trying to change? ani amTAru. ఆయన తత్వం చాలా భిన్నమైనది. ఈ మధ్య అబ్బూరి ఛాయదేవి ఆయన మీద తెలుగు జాతి రత్నాలు అనే పుస్తకం రాసింది.

 9. Sri
  Jul 15, 2012 @ 19:28:52

  మీరు ఒక సాద సీదా మధ్య తరగతి గృహిణి, ఖాళీ సమయాలలో నాలుగు సాహిత్యం పుస్తకాలు చదివి, అందరితో పంచుకొంట్టూ ఆనందించే వారు. కాని సంప్రదాయంగా ఉండాలనుకోనే, మీలాంటివారి కలలను దెబ్బతీయటం ఇష్ట్టంలేక గమ్ముగా ఉండవలసి వస్తుంది. మీతో సీరియస్ చర్చ చేయటం పెద్ద విషయం కాదు. మీతోనే కాదు మీలాంటి వారికి సాహిత్యం పేరు తో, బి.సి. కాలం నాటి జ్ణానం ప్రసాదించిన, మహిళా రచయితలతో సహా!

  కాని ఒక చిన్న షరతు, మొదట మీ అబ్బాయికి పెళ్లి చేసి, కోడలు వచ్చిన రెండు సం|| తరువాత ఇక్కడికి వచ్చి ఈ తరం అమ్మాయీల తరపున మీ వాదాన వినిపించండి. ఇలా అంట్టున్నందుకు కోపంతెచ్చుకోకండి.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 15, 2012 @ 19:39:13

   in case nenu magadinaite serious charcha chestara… 🙂 duradrushtavasattu nenu magadinenandi babu.

   to be more specific i am a middle class coastal andhra upper caste male, from the family of preachers of puranas; have acquaintance with a little bit of telugu literature being son of a telugu teacher (err… master, my father, another male).

   mi sharatulu patimchadaniki naku abhyamtaramemi ledu. kani na iddaru kodukulu (kuturi kosam chuste remdo sari koduke puttade ani ma ‘dampatula’ badha) pelliduku ravadaniki imka kanisam 23, 25 ellu ravali. amduvalla mi saval svikarimchaleka potunna. kshaminchagalaru 🙂

   imtaki i comment miru rasinadi nannu uddesimcha, leka evaraina comment chesina varini uddesimcha — komchem confusing ga umdi, clarify chedduru.

   Reply

 10. Sri
  Jul 15, 2012 @ 22:03:52

  సారి అండి, అది వనజ గారిని ఉద్దేశించి రాసినది. కాపి పేస్ట్ లో ఆమే పేరు మిస్ అయ్యింది.
  ఆమే ఈ తరం అమ్మాయిల గురించి మాట్లాడుతున్నది కదా! ఒక ఐదేళ్లు ఆగమనండి రాబోయే తరం అమ్మాయిలు బయటకు పోవటానికి కూడా వందసార్లు ఆలోచించవలసి వస్తుంది. ప్రభుత్వం ఫైల్యుర్ అయిపోయింది. ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉన్నని రోజులు ఎవరు దానికి భyaపడరు. అప్పుడు ఈ స్రీవాదులు కొత్త పల్లవి ఎత్తుకొంటారూ , ఆడవారు కుటుంబం లో భాగం వారిని రక్షించవలసింది మగవారే అని. మళ్లి పాత పుచ్చి పోయిన గ్రంథాలు, సాహిత్యం చదివి స్రీ పురుషుడి ఆస్థితి అని ఆమేను రక్షించ వలసిన బాధ్యత మగవాడిదే, భర్తదేఅని ,అక్కడ రాశారు, ఇక్కడ రాశారు. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లన్ని సంసారం చక్కని సంతానం అని పాట అందుకొంటారు. వీరి ఎత్తుగడలను మీలాంటివారు ఒక కంట కనిపెట్టి ఉండాలి. మీకిద్దరు అబ్బాయిలంట్టున్నారు, మీరిప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోండి 🙂 🙂

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 16, 2012 @ 13:31:17

   sri garu…

   samajam imka pramadakaramga tayaraye pramadam pomchi umdanna mee bhavanato ekibhavistanu.

   hardcore feminists meeru cheppinattuga stand change chestarani nenu anukodam ledu. vari bhavalato nenu ekibhavimchina, chakapoyina.. vari nibaddhatanu samkimchalenu. tama vadanaku kattubade umtaru.

   sampradayavadulamte meeku bhayam deniko naku ardham kaledu. mental conditioning anedi evarilo ledu cheppamdi… strivadulato saha.

   marpu kosam asimchaku ani mee guruvu garu chepparamtunnaru kada… aa maata naaku baga nacchimdi. naa uddesamlo maarpu anedi asadhyam. uparitala sthayilo marpulu okka ravva kanipimchavacchunemo kani moulikamaina tama tatvanni evaru marchukoru. memu maripoyamu, maa pata paddhatulanu purtiga vadilesamu ani cheppe varu – tamaku telisina, telikapoyina – abaddham adutunna vare.

   UGK meeda chayadevi gari pustakam gurimchi vinnanu, chadavaledu. tappaka prayatnistanu.

   ika vanaja gari gurimchi – ame blog dvara naku ardhamainanta varaku – avida general well wisher of one and all, irrespective of gender, and other factors. avida gurimchi ettugadalu vamti padalu anavasaramemo.

   thanks for coming by.

   Reply

   • Sri
    Jul 17, 2012 @ 10:37:31

    *సమజం ఇంక ప్రమదకరంగ తయరయె ప్రమదం పొంచి ఉందన్న మీ భవనతొ ఎకిభవిస్తను.*
    ఇది మొదలండి. ముందుంది ముసళ పండగా!

    *సంప్రదయవదులంతె మీకు భయం దెనికొ నకు అర్ధం కలెదు*
    ఇక నాకు సాంప్రదాయ వాదులంటే భయం అనటానికి కారణం, వారిది ఒక కుక్క తోక వ్యవహారం. అన్ని చదువుతారు, తెలుసుకొంటారు, చేసిన తప్పులేచేయాలనుకొంటారు (ముఖ్యంగా పెళ్లి). మగపిల్లలకు పెళ్లి చేసి కోడలు ను ఇంటికి తీసుకురావాలని ఆశిస్తారు 🙂 పెళ్లి అనేది ఈనాడు మనకు అవసరం లేదు. అది ఎప్పుడో అవుడేటేడ్ అయిపొయినా, మనం దానిని సాంప్రదాయం పేరుతో అప్ డేట్ చేస్తూ వస్తున్నాము. ప్రస్తుత కాలపు పెళ్లిలు అనేది బ్రాహ్మణ సాంప్రదాయం అని అనిపిస్తుంది. ఆ సంప్రదాయం క్షత్రియ రాజుల పాలనలో ఆదరణ పొందింది (ఎనిమిది రకాల పెళ్లిలలో ఒక్కరకం మిగిలింది). ఇక కాలం ఎంతో మారింది. గత 30సం||గా మనం నియో క్షత్రియుల పాలనలో ఉన్నాం. వారి సామాజిక విలువలకు, బ్రాహ్మణ సాంప్రదాయానికి పొత్తు కుదరదు. ప్రస్తుత కాలం నాటి వివాహమహోత్సవాన్ని (నియోక్షత్రియుల పాలనలో ) తీసుకొంటే, ఆ కులానికి చెందిన ప్రముఖుడొక్కరు చాలా లావిష్ గా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొంటారు. ఆ కులంలోని పేద,మధ్య,ధనవంతులందరు ఆ పెళ్లిని, తమ ఇంట్లో పెళ్లి జరిగినంతగా టి వి లోచూసి ఆనందిస్తారు. ఆ పెళ్లిళని, టి వి వాడు అదేపనిగా ఒక వారం రోజులు, పాటలు పెట్టి చూపుతాడు. ఇదే ప్రస్తుత ట్రెండ్. మనం దీనికి అప్ గ్రేడ్ కావాలి.
    ఇంతకీ నేను చెప్పొచేదేమిటంటే రాష్ట్రవ్యాపతం గా కులానికి, ఒక పది ఇరవై కుటుంబాలను గుర్తించి, వారిలో ప్రముఖ రాజకీయ,పారిశ్రామిక,సెలెబ్రిటి, ధనవంతులైన వారిని గుర్తించి, వారి కుటుంబాలు పెళ్లిళు చేసుకొంటె మనం చూసి ఆనందిస్తేచాలు. వాఇని ఎలాగూ మనవారనుకొంట్టున్నాముకదా! ఇక మధ్యతరగతి వారికి పెళ్లిలు అనవసరం. ముఖ్యంగా పెళ్లి అనేది మగవారిని దోచుకోవటానికి వేసే ఎత్తుగడ గా అతివేగంగా మారుతునాది. మరి ధనవంతులు, సేలెబ్రిటిలు లేని వారి సంగతేమిటి? అని అడుగుతారేమో! ఉదాహరణకు బ్రాహ్మణులూనే తీసుకొందాం వారిలో పెద్ద ధనవంతులు, సేలేబ్రిటిలు లేరు కనుక వీరికి భధ్రాచల సీతారామకల్యాణం,తిరుపతి వెంకటేశ్వర స్వామి కల్యాణం వీరి చేత చేయించో లేక టి వి లో జరిగేవి చూపించి ఆ పెళ్లి తాలుకు అనుభూతిని కలిగిస్తే సరి. ఎంత చెట్టుకు అంతగాలి 🙂

 11. Vanaja Tatineni
  Jul 16, 2012 @ 05:55:25

  శ్రీ గారు ..మీరు చెప్పినట్లు బ్లాగ్ లు వ్రాసే వారికి ప్రస్తుత సమస్యలు సృష్టించే వారికి (యువ తరం) వారికి జనరేషన్ గ్యాప్ ఉంది.
  వీళ్ళు చెప్పే నీతులు,సంస్కారా విలువలు వీరి తలకి ఎక్కవు.గడప దాటితే మన పిల్లలే ఎలా ఉంటారో..మనకి తెలియదు కదా! నేను ఈ పోస్ట్ లో నా అభిప్రాయం అని నేను చెప్పలేదు. ఒక కోణం లో అని చెప్పాను.
  వస్త్ర ధారణ, అతిగా ప్రవర్తించడం,మితిమీరిన స్వేచ్చ వల్ల కలిగే అనర్ధాలు..గురించి..నేను నా బ్లాగ్ పోస్ట్ లలో చాలా వ్రాసుకున్నాను.
  నేను ఈ పోస్ట్ పై చేసిన వాఖ్య ఏమిటో.. ఇది చూడండి. నేను పోజిటివ్ గా స్పందిన్చానో.. లేదో మీరే అర్ధం చేసుకోవాలి.
  ఇంకో చిన్న మాట .. కాలక్షేపం కోసమో,అభిరుచి తోనో..సాహిత్యం చదివే వారు..కూడా ఆ సాహిత్య ప్రభావం తో..జీవితాన్ని తీర్చి దిద్దుకుంటారు,లేదా అజ్ఞానం తో..నాశనం అవుతారు.
  చదివిన ప్రతి పుస్తకం లేదా..నచ్చిన రచయితల భావాలు ప్రతి ఒకటి నచ్చాలి,లేదా ఆచరణలో చూపాలనుకోవదమో..చేయాలనుకోవదమో జరగదు. లేదా ప్రతి విషయాన్ని మనసు పై అప్లయ్ చేసుకోరు. చదివి వదిలేస్తారు. అంతే!
  నేను ఒకటి మాత్రం చెప్పదలచాను. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అనుభవాలు ఉంటాయి.
  కేవలం స్త్రీ లకే సమస్యలు ఉన్నాయి. పురుషులే కారణం ..అని నేను ఎప్పుడూ నొక్కి వక్కానించలేదు.
  అలాగే పురుషులు అందరూ మంచివాళ్ళే స్త్రీలు మాత్రమే సైలెంట్ కిల్లర్లు, మగవాడిని సర్వ నాశనం చేసేవారు అని చెప్పలేదు.
  పోస్ట్ కి అనుగుణంగా ఆ సమయంలో నేను వ్రాసిన విషయానికి అనుగుణంగా వైరుధ్యాన్ని చూపించే ప్రయత్నం చేసాను.
  నా వ్యక్తీ గత అనుభవాల వల్ల ఎక్కడైనా ఎవరినైనా నొప్పించే వ్రాతలు వ్రాసి ఉండవచ్చును కూడా!.
  నేను మాత్రం సంప్రదాయ వాదిని. అనుభవాల దృష్ట్యా.. పెయిన్..అనుభవించిన దానిని..
  అలా అని పురుష ద్వేషినో,లేదా . స్త్రీ పక్షపాతినో..కాదో! సాదా సీదా మనిషిని.అంతే!!
  శ్రీని వాస్ గారు.. మీ సవాల్ ని నేను స్వీకరించలేను..సారీ అండీ.:))

  Reply

 12. శ్రీ (జలతారు వెన్నెల)
  Jul 16, 2012 @ 06:46:01

  wow!!! vanaja gaaru, Sri gaaru,phaneedra gaaru, easy easy easy!!! After all we should be respecting each other’s views!!

  Reply

 13. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jul 16, 2012 @ 13:38:54

  vanaja garu…

  meeru remdo konam gurimchi cheppadamlo nenemi feel avaledu. meeru cheppina a vaadana nenu vinnanu. you did not offend me in any way.

  ee post rasina roju… aa sadaru varta vinnaka na emotional outrage ni ila tapaayimchaka mental gaa chala free ayipoyanu. amduke mee commentki konta freega respond avagaliganu.

  intlo vamta vishayam gurimchi… adi pakshika satyame kada ani maa aavida gurtu chesimdi. basic level 70 per cent vamta nenu cheste, migata 30 per cent critical part tane chesimdi lemdi. 🙂

  blogulo vaagullu psychological outlet matrame ani naa abhiprayam. ee maatalanu seriousga teesukokamdi. maa hindi mitrulu cheppetattu.. dil pe mat le yaar….!

  Reply

 14. శ్రీ (జలతారు వెన్నెల)
  Jul 16, 2012 @ 21:39:49

  :)) I am honored!!

  Reply

 15. కొత్తపాళీ
  Jul 16, 2012 @ 22:48:33

  I have nothing to contribute to the main bulk of your post, but I do have a crazy wish – you shd wear a little vid camera on your head when you have these conversations with your female colleagues – I would love to see their faces after you impart your brilliant life truths 🙂

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 17, 2012 @ 12:30:03

   కొత్త పాళీ గారూ…

   ఈ టపా విషయంలోనే కాదు, నేను గిలికే ఏ టపా విషయంలోనూ అదేదో ప్రయోజనకర చర్చ అన్న భ్రమలేమీ నాకు లేవు. ఇక బ్రిలియంట్, లైఫ్, ట్రూత్… ఆ మూడింటిలో దేనికీ ఆస్కారం లేదు 🙂 Am mere a dreamer.

   నా స్నేహితుల సంఖ్యే చాలా తక్కువ, వాళ్ళల్లో అమ్మాయిల సంఖ్య మరింత తక్కువ. నా మాట తీరును భరించే వారితోనే నా ఎకసక్కేలన్నీ. అందువల్ల వారి హావభావాల్లో పెద్ద మార్పేమీ ఉండదండీ. టపా కోసం ఓ 5-10 పెర్సెంట్ డ్రమెటైజ్ చేశానంతే.

   ఇక మిగతా వారితో కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేను. నా గెంతులన్నీ నా బ్లాగుకే పరిమితం 🙂

   Reply

 16. Rvss Srinivas
  Jul 16, 2012 @ 23:00:12

  ఫణి గారూ!
  ఆడవారు ఏవో రెచ్చగొట్టే దుస్తులు వేసుకుంటేనే…
  మగవారు వారిని వేదిస్తారనేది నిజం కాదు…
  సాంప్రదాయ బద్దంగా చీరే కట్టుకునో,
  లేక చూడీదార్ వేసుకునో వెళ్ళినా…
  వేధించడం మానటం లేదే…
  అంచేత..దుర్యోధన, దుశ్శాసన, కీచక అంశలు ఉన్నవారిలో మార్పు రాదు..
  ఏమంటారు?
  నిజంగా ఆలోచించాల్సిన విషయం…
  అన్నీ తెలిసినా అశక్తత…
  @శ్రీ

  Reply

 17. Sri
  Jul 17, 2012 @ 11:06:24

  *ఆవిడ గురించి ఎత్తుగడలు వంటి పదాలు అనవసరమెమొ*

  అది ఆవిడ గురించి రాసింది కాదండి. ఆమే అంటే నాకు గౌరవమే. అసలికి వ్యక్తిగతం గా ఎవరి మీదా కోపం ఉండదు. ఈ క్రింది టపాలో సామాన్యగారు ఎత్తుగడలను గురించి చాలా స్పష్ట్టంగా మాట్లాడింది. అది చదివిన తరువాత ఆమే చాలా దిగులు పడుతున్నాదని, ఆవిడ కి ఇంకొక కొత్త కోణంలో, మహిళలకు రానున్న కాలంలో మంచి అవకాశాలు ఉంటాయని ధైర్యం చెపుతూ ఆవిడ బ్లాగులో వ్యాఖ్యరాశాను. అంతే ఆమే భానుమతి గారిలాగా నాపైన విరుచుకు పడ్డారు. ఆవిడ ఆరోపణలకు ఎక్కడా రాజి పడకుండా,సహేతుకంగా సమాధానం ఇచ్చాను. నా జవాబులు చదివిన ఆవిడ, ఎమైందో ఎమో, చివరి నాలుగు కామేంట్ల ను తొలగించేశారు. ఇప్పుడు అక్కడ ఒక్క కామెంట్ ఉన్నాది.

  http://amayaas.blogspot.in/2012/06/blog-post_11.html

  ఇప్పటికి అర్థం కాని విషయమేమిటంటే, మగవారికి ఉద్యోగం లేకపోతే పిల్లను ఇవ్వరు. ఉద్యోగం ఉంటే వాడు ఉదయం 8కి వెళ్లి రాత్రి 8కి ఇంటికి వస్తాడు. ఇంట్లో కుచొన్న వీరీ మీద, ఆఫీసులో పని చేసుకొంట్టు ఉండేవాడు వేసే ఎత్తుగడలేమిటో? మరి ఎంతో ఖాళి సమయాం ఉన్నవారు ,టి వి సీరియల్స్ చూసేవారు, ఎత్తుగడలు వేస్తారా ఆఫీసులో పనిచేసుకొనే వారు ఎత్తుగడలేస్తరా?

  Reply

 18. Sri
  Jul 17, 2012 @ 11:08:54

  నేను రచయితను కాను. మీలాగా ఇంత పెద్ద్ద టపా రాయలేను. టైపు చేస్తూంటే మధ్యలో విసుగొస్తుంది.. ఎందుకు రాస్తున్నాను అనవసరం గా అనిపిస్తుంది. అక్షర దోషాలు ఉంటే వాటిని ఒగ్గేయండి.

  Reply

 19. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jul 17, 2012 @ 12:11:11

  శ్రీ గారూ…
  – మీ అభిప్రాయాలు చదవడానికి ఆసక్తికరంగా ఉన్నాయి.
  – ప్రస్తుతానికి నేను కుక్క తోక వ్యవహారాన్ని అనుసరిస్తున్నాను. ఇంకోలా చెప్పాలంటే పైన SNKR గారు పరిశీలించినట్టు కుక్కనేనేమో కూడా. 🙂
  – అమయ గారి బ్లాగు నేనూ అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాను. వారి(లాంటివారి)తో ఏకీభవించినా… చకపోయినా… తాము నిజమని నమ్ముతున్న విషయాలపై వారి నిబద్ధత నాకు నచ్చుతుంది.
  – నేనేమీ రచయితను కాదండీ…. ఏదో చేతి దురద తీర్చుకోడానికి ఓ చిన్న బ్లాగు తెరుచుకున్నానంతే.
  మీ స్పందనలకు ధన్యవాదాలు.

  Reply

  • Snkr
   Jul 17, 2012 @ 14:03:45

   /SNKR గారు పరిశీలించినట్టు కుక్కనేనేమో కూడా/
   అలా పరిశీలించానా? నేనా?! మిమ్మల్నా?! శివ శివా!
   మీరు పొరపడి వుంటారు, 😦 ఏదో సరదాగా పొరపాటున ఓ కామెంటేసుకున్నాకాని మీ చర్చలు ఫాలో అవడం లేదు.
   నన్ను శునక పరిశీలకుడిననే( ఏదో బర్డ్ వాచర్ లాగా) మీ ఆరోపణను నిర్ద్వందంగా ఖండిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అద్యచ్చా.

   Reply

   • ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jul 17, 2012 @ 14:57:49

    SNKR గారూ…
    పొరపాటు నాదే లెండి… మీరన్నది మెదడు విషయంలో కదా.
    నా మరో పెద్ద ఘోర తప్పిదం శునకాలను అవమానించడం.
    శునక పరిశీలకుడు – పదం బాగుందండోయ్….!
    మీకు మామూలుగా కాదు బేషరతుగా క్షమాపణలు చెప్పేసుకుంటున్నానధ్యక్షా 🙂
    కాకపోతే… ఇంత తీవ్రస్థాయి నైచ్యానికి దిగజారిన, రుతున్న మగ జాతిలో నేనూ ఒకడినైనందుకు మాత్రం సిగ్గు పడుతున్నా.

   • Snkr :D
    Jul 17, 2012 @ 17:26:41

    /ఇంత తీవ్రస్థాయి నైచ్యానికి దిగజారిన, రుతున్న మగ జాతిలో నేనూ ఒకడినైనందుకు మాత్రం సిగ్గు పడుతున్నా/

    అంటే హోల్ మొత్తం మగజాతికి మీరు అధికారప్రతినిధి అభిషేక్ సింఘ్వినా!?! 🙂 నాకేదో అనుమానంగావుంది, ఆ గుంపులో మీరు లేరు కదా?! ఏంపరవాలేదు నిజం చెప్పండి, ఇక్కడ రాష్ట్రపతి భవన్‌నుంచే భిక్ష తేగల ముష్టి మగ మానవహక్కుల లాయర్లున్నారు :)) 😛

   • ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jul 17, 2012 @ 17:40:11

    అయ్యా.. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దాన్ని మిగతా మగాళ్ళ మీద ఆపాదించడం లేదు.

    సింఘ్వీతో పోలికా… అయ్యబాబోయ్ వద్దు సార్… అంతకంటె ఆ పురుష దురహంకార సూకరాలే మేలేమో. 😦 (మరో జంతువును పట్టుకొచ్చా చూశారా 🙂 )

    అయ్యా… క్షమాభిక్ష ఇప్పిస్తానంటున్నారు… నేను ఏ పనీ లేక ఇలా రాత తీట తీర్చుకుంటున్నానని మీకు బాగా అర్ధమైపోయినట్టుందే.

    (By the way, are you and the above SNKR the same person?)

  • Sri
   Jul 18, 2012 @ 11:43:56

   *మీ అభిప్రాయాలు చదవడానికి ఆసక్తికరంగా ఉన్నాయి*

   దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. పది సం|| నామిత్రుని వైవాహిక జీవితం దెబ్బతిన్నందుకు నేను బాధపడుతుండే వాడిని, ఇంతలో ఒక రోజు అతనిని కలిస్తే చాలా ఆనందంగా కనిపించాడు. కారణ మేమిటా అని ఆరా తీశాను. అతను చెప్పింది విని ఆశ్చర్యపోయాను. అది చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వియ్యంకులు కాబోతున్నరని, నిశ్చితార్ధం త్వరలో జరగబోతున్నాదని సంబరపడ్డాడు.

   Reply

   • ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jul 19, 2012 @ 11:09:05

    సెలెబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమేనా పలువురికి ఆసక్తికస్రంగా ఉండడం అన్ని రకాల వ్యవస్థల్లోనూ ఉన్నదే అనుకుంటా.

   • Sri
    Jul 19, 2012 @ 22:36:28

    అది ఒకప్పుడు ఒక మోతాదు లో ఉండేది. ఇప్పుడు శృతి మించింది. వారు పెLli కుదిరినప్పటినుంచి పిల్లలు పుట్టడం దాకా అంతా మీడీయా తో పంచుకొంట్టున్నారు (వారి మూడు రాత్రుల పోటొలు తప్పించి ). మన తెలుగువారు అవి చూసి ఆనందించటం మరీ ఎక్కువైపోయింది.

 20. sravya
  Jul 17, 2012 @ 13:53:32

  తాలిబాన్లు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంటారనుకునే దాన్ని, ఈ పోస్టు, కామెంట్లు చూసింతర్వాత నా అభిప్రాయం తప్పని తెలిసింది.ఇక ఆడాల్లందరికీ ముసుగేసుకునే బయటికి రమ్మని ఆదేశాలివ్వడమే మిగిలింది. చీర కట్టుకొస్తే, పొరబాటున ఏ వీపో, కడుపో కనిపిస్తే, ఆమె రెచ్చగొట్టడానికే అలా చూపించింది కాబట్టి ఆమెది కూడా దోషముందని వాదించడం వీరికెవరికీ పెద్ద కష్టం కాదు. తాలిబాన్ జిందాబాద్.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 17, 2012 @ 14:02:52

   sravya garu…
   hmm.

   Reply

  • Sri
   Jul 18, 2012 @ 12:09:06

   శ్రావ్యగారు,
   చాలా మంచి మాట చెప్పారు. మీ వ్యాఖ్య చదివిన తరువాత, నాకళ్లు తెరచుకొన్నాయి. ఇన్ని రోజులు నేను ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో ఉన్నానను కొన్నాను. ఇప్పుడు అది తప్పని తేలింది. మనం ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నామన్నమాట. ఆ మాట వింటే దేశాన్ని ప్రత్యక్ష పరోక్షంగా పాలించే కార్పోరేట్ రంగంవారు, నియోక్షత్రియులు నొచ్చుకొంటారేమో! వారంతా వారిని ప్రజాస్వామ్య వాదులుగా, జాతీని అభివృద్దిపథాన తీసుకొని పోయేవారుగా భావిస్తున్నారు కదా! ఎవరి నోరు తెరచినా మాపాలనలో ఇంత జి డి పి అభివృద్ది, సాఫ్ట్ వేర్ అభివృద్ది, సిటి ల అభివృద్ది జరిగిందని చెపుతూంటే మీరు భారతదేశంలో తాలిబాన్ల గురించి మాట్లాడటం విని వారు షాక్ లోనౌతారు.

   *ఇక ఆడాల్లందరికీ ముసుగేసుకునే బయటికి రమ్మని ఆదేశాలివ్వడమే మిగిలింది*

   ఆడవాళ్ల కి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి లో ఇప్పుడు ఎవ్వరు లేరమ్మా! ముఖ్యంగా మగవారికి అంత శక్తి లేదు. మీ స్వేచ్చన్ని ఎవరు కాదనటం లేదు. మీరు మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి ఎవరు కాదన్నారు. ప్రజాస్వామ్యం లో వ్యక్తుల స్వేచ్చను కాపాడటం ప్రభుత్వాల కర్తవ్యం, మీరు ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి. రోడూ మీద పోయె మగవారు ఆ మాత్రం రక్షించ లేరా అని వాపోవటం బాగాలేదేమో అని అనిపించింది. ఎమీ పరిచయం లేని అమ్మాయిలను ఎవరైనా ఎందుకు రక్షించాలి (ఆడవాళ్లన్ని రక్షించే అజెండా మగవారికి ఎమీ ప్రభుత్వం ఇవ్వలేదు కదా! ) . గత సం|| ఒకబ్బాయి రౌడిమూలకల బారి నుండి ఒక అమ్మాయిని (బాంబేయ్ లో ) రక్షిస్తూ ప్రాణాలు కోల్పొయాడు. అసలికి ప్రాణాలు పోతుంటే ఎవరు పట్టించుకోవటంలేదు.

   ఇదా మానవత్వం?
   http://teluguyogi.blogspot.in/2012/07/blog-post_05.html
   విశ్వాత్మ(స్వామి విశ్వాత్మానంద) గారు ఇక లేరు
   http://teluguyogi.blogspot.in/2012/07/blog-post_10.html

   Reply

   • ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jul 19, 2012 @ 11:12:01

    శ్రీ గారూ.. మీ అభిప్రాయాలు మీరు చెప్పినట్టే శ్రావ్య గారు తన అభిప్రాయం తాను చెప్పారు.
    “రోడూ మీద పోయె మగవారు ఆ మాత్రం రక్షించ లేరా అని వాపోవటం బాగాలేదేమో అని అనిపించింది.” — ఈ మాట ఆమె అనలేదనుకుంటా.

   • Sri
    Jul 19, 2012 @ 22:41:21

    *“రోడూ మీద పోయె మగవారు ఆ మాత్రం రక్షించ లేరా అని వాపోవటం బాగాలేదేమో అని అనిపించింది.” — ఈ మాట ఆమె అనలేదనుకుంటా*

    ఆమే అనక పోవచ్చు కాని మీడీయాలో ఆసీన్ చూస్తున్నపుడు వచ్చే అర్థమేమిటి? ఒకరిని అంత అల్లరి పెడుతూంటే రోడ్డు మీద పోయేవారు కనీసం అడ్డుచెప్పలేరా? ఆపలేరా? అభ్యంతరం తెలపలేరా అనే కదా?

 21. the tree
  Jul 17, 2012 @ 18:29:06

  ఫణి గారు, మీరు కామెంట్లతో బిజీగా వున్నట్లున్నారు.
  నా వ్యాఖ్యకు విలువ వుంది అని మీరు చెప్పేసరికి,
  ఆ ఆనందంతో ఓ కవితే రాసేసానండి,
  ఆడతనం-మగతనం-చేతగానితనం.
  ఓ వారంలో పోస్ట్ చేస్తానండి,

  Reply

 22. శ్రీ (జలతారు వెన్నెల)
  Jul 17, 2012 @ 20:07:53

  శ్రీ అని కామెంట్ పెట్టేవారు ఎక్కువ అయిపోయి, ఏ శ్రీ కామెంట్ పెట్టారో తెలీయక అంతా తిక మక గా ఉంది.. నా కామెంట్ లు అన్ని శ్రీ( జలతారు వెన్నెల బ్లాగ్) అని పెడతాను ఈ సారి నుంచి…

  Reply

 23. the tree
  Jul 19, 2012 @ 18:03:30

  ఫణి గారు, నా కవిత మీ కామెంట్ కోసం వెయిటింగ్.
  పుట్ ఎ కామెంట్, ప్లీజ్…

  Reply

 24. yssubramanyam
  Oct 31, 2014 @ 20:36:00

  the issue is not with the dress code. it depends on body language. how ever the objection arises based on wealth. none can comment on celebrities/models. they are beyond the reach. but the common people and those who are exposed to public areas has to be careful in every respect. the undisciplined male devils are more in present days.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: