మరణం, ఒక కామా

అతడు చనిపోయాడా! చనిపోవడమంటే ఏమిటర్ధం? చనిపోయిన దేమిటి? అతని యడల నాకుండే గౌరవం చచ్చిందా? అతని మీద నాకుండే ప్రేమ చచ్చిందా? అతని అభిప్రాయాలను గ్రహించే శక్తి నాలో చచ్చిందా? నా హృదయంలో అతడు రేకెత్తించిన భావాలు నశించాయా? అతడు నిజాయితీపరుడైన ధైర్యశాలి అనే జ్ఞానం నాలో చచ్చిందా? ఇదంతా చచ్చినట్లా? నాకు సంబంధించినంత వరకు ఇవేమీ ఎన్నటికీ చావవు. ఒక వ్యక్తిని గురించి మనం చాలా తొందరగా ‘అతడు చచ్చిపోయాడం’టూ ఉంటాం. అతడి పెదవులు నిర్జీవములే అయిన నేమి? అతడి మాటలు సజీవుల హృదయాల్లో చిరస్థాయిలే.
… … …
బహుశా నేను చెప్పేదంతా తెలివి తక్కువ ప్రసంగంలా కనిపించవచ్చు. కానీ నిజాయితీపరులు అమరజీవులని నా నమ్మకం. నాకు ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకులైన వారి అమరత్వంలో నాకు విశ్వాసముంది. ఏ జీవితం, ఆశ్చర్యకరమైన తికమకలతో నన్నుత్తేజపరుస్తోందో, అమూల్యమైన విషయాలను చూపిస్తోందో, నా హృదయం నాకెంత ప్రేమాస్పదమో నాకంత ప్రేమాస్పదమైన భావాలను పెంపొందింపజేస్తోందో, అలాంటి జీవితాన్ని నాకిచ్చిన వారు అమరులే.

(శీర్షిక వాకాటి వారిదీ, సరుకు మగ్జీం గోర్కీ అమ్మదీనూ)

Advertisements

6 Comments (+add yours?)

 1. the tree
  Jul 05, 2012 @ 17:42:34

  మరణమే పరిపూర్ణ జ్ఞానానికి సరైనదారి,
  సోక్రటీస్ అన్నట్టు గుర్తు,
  good post.

  Reply

 2. Sri
  Jul 06, 2012 @ 02:18:01

  జ్ఞాపకం ఎప్పుడూ మన వెన్నింటే ఉంటుంది.
  మనల్ని ప్రభావితం చేసిన వారు ఎప్పుడు సజీవంగానే నిలిచిపోతారు మన మనసులో
  మరుపు దేవుడు ఇచ్చిన వరం కొన్ని సార్లు, శాపం కొన్నిసార్లు.
  ప్రత్యక్షంగా రోజు మన కళ్ళతో చూడలేనివి ఏవైనా మనం తొందరగా మరచిపోతాము.

  Reply

 3. కొత్తపాళీ
  Jul 06, 2012 @ 20:37:02

  Nice!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: