తు ముఝే భులా న పావోగే….

నా గాలిపాట విన్నపుడల్లా
కూనిరాగాలు తీస్తుంటావు
నన్నెలా మరువగలవు నీవు

ఆనాటి మన ఊసులెన్నో, ఒక్కటీ గుర్తులేదనకు
కొంచెం కనికరించు, ఒకట్రెండు ముత్యాలు రాల్చు
ఈ గుండె నీది, జవదాటను నీ మాటను

నా మౌన ప్రణయ రాగాలు అర్ధమయేది నీకే
ఈ జీవితం గడచిపోయినది నీ గురుతుల్లోనే
కరిగిపోతున్నా నీ తలపుల్లోనే, ఇంకెంత వేధించినా

నా ఎద గదిలో దాగినదంతా నీపై ప్రేమే
నా జీవితం గురించి ఆలోచనైనా లేనేలేదే
ఆ దారిలో నీకై వేచినదెవరో తెలియులే

నా గాలిపాట విన్నపుడల్లా
కూనిరాగాలు తీస్తుంటావు
నన్నెలా మరువగలవు నీవు

( శంకర్ జైకిషన్ స్వరాల సాయంతో లత గానించిన హస్రత్ జైపురి అలతి అలతి పదాలకు నా వికృతి )

Advertisements

13 Comments (+add yours?)

 1. merajfathima
  Jun 29, 2012 @ 15:58:24

  అందమైన పదాలు అవి వికృతి ఎలా అయ్యాయి, చక్కటి భావన బాగుంది సర్.

  Reply

 2. the tree
  Jun 30, 2012 @ 06:24:14

  auvadham chakkaga undi, pataithe nenu vinaledandi, kabatti vikruthi aina naku o.k
  thank you sir.

  Reply

 3. Vanaja Tatineni
  Jun 30, 2012 @ 11:37:13

  MUJHE NA BULA LATA MANGESHKAR FILM SUVARNA SUNDARI [1957] MUSIC A.N.RAO.
  ఫణి గారు.. పైన నేను చెప్పిన పాటే కదా.. ! ఇప్పుడే చూసి వచ్చాను.
  \”పిలువకు రా..అలుగకు రా\”.. మన తెలుగు పాట..
  ఈ రెండు పాటలు కాకుండా.. మీరు వ్రాసిన పాట ఉంది చూసారూ.. ఇది చాలా చాలా బాగుంది.
  వికృతి,పైత్యం ఏదైతే ఏం లెండి . అందులో రసజ్ఞత ఉండాలి కదా.. అది మెండుగా ఉంది. బావుంది.

  Reply

 4. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jul 01, 2012 @ 11:24:56

  భాస్కర్ గారూ…. ధన్యవాదాలు.

  వనజ గారూ…. నా సినిమా పరిజ్ఞానం దాదాపు సున్నా. రంగోలీలోనూ, మా మిత్రులొకరిద్దరి దగ్గరా… పాత హిందీ పాటలు వింటుండే వాణ్ణి. వాటిలోని సౌందర్యం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఆ కుదుపు మరీ ఎక్కువైనప్పుడు ఇలాంటి గీతలు కొక్కిరిస్తుంటాను. ధన్యవాదాలు.

  Reply

 5. Sri
  Jul 02, 2012 @ 01:31:30

  సినిమాలు చూడకపోయినా old hindi songs వింటారనమాట.
  నాకు గుర్తున్నంతవరకు, మీరు చౌదవీ కా చాంద్ కూడా అనువాదం చేసినట్టు ఉన్నారు ఇంతకు ముందు?
  అయ్యో! నేను మర్చేపోయాను…నేను చిరునవ్వు మాత్రమే ఇవ్వాలి కదా? (నా బ్లాగ్ లో మీరు ఒదిలిన కామెంట్ కి నా స్పందన చూడండి.)

  :))

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 02, 2012 @ 12:05:32

   వెన్నెల గారూ…
   పాత హిందీ పాటలు వింటుండే వాడిని. ఇప్పుడూ అదీ లేదు. కానీ కొన్ని పాటలు అలా మనసులో ముద్ర వేసేస్తాయి. వదలకుండా వెంటాడతాయి. అలాంటి వాటి భరతం పట్టాలని ఇలా నా చేతి తీట తీర్చుకునే ప్రయత్నాలు. అంతే. 🙂
   ఇంక మీ బ్లాగులో స్మైలీ వదలడానికి కారణం ప్రత్యేకం ఏం లేదు. నాకు స్పందించడం, వ్యాఖ్యానించడం సరిగా తెలీదు అంతే. అన్యధా భావించవద్దు.

   Reply

 6. Sri
  Jul 03, 2012 @ 22:40:12

  సరాదాగా మాత్రమే అలా స్పందించాను.అన్యధా భావించద్దని మనవి!

  Reply

 7. chandhu( thulasi )
  Jul 05, 2012 @ 21:38:50

  namaste sir… meeru blog start chesara..?cheppane ledu ( evarooo.) ippude chusanu. chala bagundhi. anni chadivaka malli spandisthanu. best of luck.
  by chandhu

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 06, 2012 @ 12:27:41

   డియర్ చందూ (తులసీ)…

   దాదాపు ఏడాదయింది బ్లాగ్ ప్రారంభించి. కానీ సుమారు ఆరు నెలల నుంచే కొంచెం కొంచెం రాస్తున్నా.

   దీనిలో చెప్పుకునేంత విషయం ఏముంది? మన మిత్రుల్లో చాలా మందికి ఇప్పటికీ తెలీదు.

   అన్నట్టు… ఒక పోస్ట్‌లో తులసి గురించి రాశాను. వీలును బట్టి చూడండి.

   Reply

 8. chandhuthulasi
  Jul 06, 2012 @ 23:42:45

  ఫణి సార్. చాలా పోస్ట్ లు చదివాను. చాలా బావున్నాయి. మీరెప్పుడు ఇంతే. బయటికి కనపడేది ఒకలా…ఆలోచనాంతరంగం మరొకలా. మీతో కలిసి పనిచేసింది కొంత కాలమే ఐనా, మా పై ప్రభావం చూపిన కొద్ది మంది వ్యక్తుల్లో మీరూ ఒకరు. మీ మీద నా(మా) కు చాలా ఆశలు ఉన్నాయి. మీ నుంచి మరిన్ని మంచి పోస్ట్ ల కోసం ఎదురుచూస్తున్నాం.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 08, 2012 @ 11:43:49

   చందూ… తులసీ…
   మీ అభిమానం తప్ప అంతకు మించి నా దగ్గర పెద్ద విషయం ఏమీ లేదు. తోచనప్పుడల్లా ఏదో ఒకటి రాస్తూ ఉంటాను. అంతే. కీప్ ఇన్ టచ్.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: