రెండు ఇజాలూ… ఒక్క నిజమూ…

మడిసన్నాక కాసన్ని అభిప్రాయాలుండక మానవు. ఆ అభిప్రాయాల తీవ్రత ఇజాలుగా కరడు కట్టుకోకా ఆగవు. ఛిత్రమేమంటే… ఆ ఇజాలన్నిటి మధ్యనా ఇరుక్కుని నలిగిపోయే ఇజం ఇంకోటుంది. ఆదే… నిజం, ఐ మీన్, రియలిజం. ఇది నిజం. 🙂

ఇజాల ప్రిజాల రూపురేఖలు రూపొందేందుకు కారణాలేవైనా కావచ్చు. కానీ అవన్నీ రకరకాల రంగులనే చూపిస్తాయి. వాదాల నాదాల నడుమ చిరుసవ్వడులు వినబడకపోయే ప్రమాదమెక్కువ. కాకపోతే ఎవరి ఇజం వారికి నిజం. అందుకే ఏ రెండు దృక్పథాల నడుమా వైరం ఏనాటికీ తెగదు.

ఆశ నిరాశల నడుమ ఊగిసలాడేవారికి ఆ రెంటికీ మించిన దాని గురించి పట్టించుకునే ఓపిక ఉంటుందా? ఏమో! నా ఉద్దేశం… ఆప్టిమిస్టుకీ, పెసిమిస్టుకీ మధ్య అని. 🙂

దేన్నయినా ఆశావాద దృక్కోణంలో చూడాలంటారు ఆప్టిమిస్టులు. ఎంత చేసినా ప్రయోజనం లేదంటారు నిరాశావాదులు. గ్లాసు సగం నిండిందని ఒకడంటే సగం ఖాళీ అంటాడింకోడు.

ఇద్దరూ పట్టించుకోని విషయం ఒకటుంది. అదే రియలిజం… అనగా నిజం. అది ఆ రెంటికీ మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. సాధారణంగా అది దేనికి దగ్గరగా ఉంటుందో… దాన్ని అభిప్రాయంగా చెప్పే వాళ్ళెక్కువమంది ఉంటారు. దనితో ఆబ్జెక్టివ్ ట్రూత్ అనగా విశుద్ధ సత్యం ఇదీ అని చెప్పలేని పరిస్థితి. సగం గ్లాసు నీళ్ళను తాగేశాక దాహం తీరితే ఆప్టిమిజం, తీరకపోతే పెసిమిజం. ఆ సగం గ్లాసు నీళ్ళూ తాగడం అన్నమాట మాత్రం నిజం.

మరింత స్పష్టంగా చెప్పాలంటే…. నా అభిప్రాయంలో రియలిజం నూటికి డెబ్భయ్ ఐదు శాతం పెసిమిజానికి దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు నిజం మాట్లాడినా దాన్ని నిరాశావాదపుటాలోచనగా కొట్టిపారేస్తారు తక్కినవారు.

ఓ జనరల్ కేస్…. “ప్రపంచ వ్యవస్థను కాపాడగలిగేది ప్రజాస్వామ్యం ఒక్కటే, నియంతృత్వం ప్రజలను రాక్షసంగా తొక్కేస్తుంది” అన్నది సాధారణ భావన. ప్రజాస్వామ్యంలోనూ లోటుపాట్లు చాలానే ఉన్నాయంటే డెమొక్రటిక్ ఆప్టిమిస్టులు చస్తే ఒప్పుకోరు. “ఎన్ని లోపాలున్నా అన్నిటి కంటె ప్రజాస్వామ్యమే మంచిది, దానిలోని సద్గుణాలను చూడండి” అంటారు. “నాయనలారా… రాజకీయులకు అది ఓ ముసుగు మాత్రమే” అని అంటే… ఆ మాట చెప్పిన వాళ్ళని పెసిమిస్టులుగా ముద్ర వేసేస్తారు. అంతే కానీ దానిలోని నిజాన్ని ఎప్పటికీ ఒప్పుకోలేరు. కనీ నిజమేంటో వారికి తెలీకనా… “అంత మంచి వ్యవస్థ అయితే రాజకీయాల్లోకి మీరు దిగి నిరూపించండి” అన్నారో… ఇక సరి, వాళ్ళ స్పందన చెప్పనే అక్కరలేదు. ఇంతా చేసి వారికి నిజం తెలీకనా? కానే కాదు… వాళ్ళకదో తుత్తి అనుకుందామా 🙂

సరే… ఓ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. అవినీతిపై పోరాడదాం అని అన్నా హజారే పిలుపునిచ్చినప్పుడు దేశం మొత్తం ఊగిపోయింది. ఆనాటి టాపికల్ ఇష్యూ అదే కాబట్టి అవాళ్టి కరెంట్ ఎఫైర్స్ బులెటిన్‌లో అదే అంశం మీద చర్చిస్తున్నాం. ఆ సందర్భంగా మా బాసుకు నేను ఓ మాట చెప్పా. “ఆయ్యా…. హజారే చెప్పిన మాట మంచిదే కావచ్చు. కానీ ఆయన పార్లమెంటరీ వ్యవస్థను తను చెబుతున్నట్టు పని చెయ్యమంటున్నాడు. ప్రజాస్వామ్య విధానంలో దానికి ఒప్పుకోలేం కదా. మరి ఆయన్ను హీరోను చేయడం తప్ప మీడియాగా మనం సాధించేది ఏమిటి?” అని అడిగా. దానికి… “లేదు, ఇది దేశానికీ, సమాజానికీ, ఆఖరికి ప్రజాస్వామ్యానికీ కూడా చాలా మంచిది. సమాజ ప్రక్షాళన దీనితోనే సాధ్యం” అంటూ…. ధర్మపన్నాలు చెప్పారు.

ఇప్పుడు ఏం జరుగుతోందో మన కళ్ళ ముందే ఉంది కదా! ఒకట్రెండు నెల్ల పాటు హజారేకు వంత పాడిన దేశ యువత ఇవాళ మళ్ళి యధావిధిగా తమ కెరీరూ, తమ జీతాలూ, తమ (మందు) పార్టీలూ… షరా మామూలుగా తిరిగేస్తోంది. మన రాష్ట్రంలోనే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో చూడండి ఏం జరిగిందో.

ఈ మాట అన్నందుకు నన్ను పెసిమిస్టుగా చూస్తున్నారు కదా…! అవును నేను చెబుతున్నదీ అదే. రియలిజం సాధారణంగా పెసిమిజానికి దగ్గరగా ఉంటుందనే. 🙂 ( 😦 )

Advertisements

17 Comments (+add yours?)

 1. the tree
  Jun 24, 2012 @ 22:07:38

  good analysis, motham meeda meeru realist anna mata. bhgundandi.

  Reply

 2. rpratapa
  Jun 24, 2012 @ 23:21:49

  Nee ijam lo nijam yenthunna, I liked the phrase ‘ijala prizalu’

  Reply

 3. Sri
  Jun 25, 2012 @ 00:07:32

  Very well said!!! అసలు I really liked the way you have put this all together!! Very impressive.

  Reply

 4. sree
  Jun 25, 2012 @ 10:36:11

  అన్నా హజారే దీక్ష చేసింది నిజం. అయితే ఆయన మాటలని మీరు నేనూ ఒక్కోవైపు లాగుతూ ఒక్కోలా అర్థం చేసుకున్నామేమో!

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jun 25, 2012 @ 11:42:16

   sree… I have great respect towards anna hazare, nor i doubt his intentions. at personal level, i too welcome his revolutionary approach. what i merely said is that, first, his way is contradictory to the democratic system, second, he might be able to pull crowds for a day or two but the indian public are so thick skinned that they cannot his path for longer time.

   Reply

 5. kastephale
  Jun 25, 2012 @ 17:00:45

  రియలిసం పెసిమిసం లా కనపడచ్చు. ఎక్కడో ఒక చోట ఖండన మొదలు కావాలి కదా, మరెదెక్కడా?

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jun 25, 2012 @ 17:42:44

   రియలిజం ఆప్టిమిజంలానూ కనబడవచ్చు, కాకపోతే ఎక్కువ పాళ్ళు పెసిమిజానికి దగ్గరగా ఉంటుందని. ఇక…. దేన్నయినా సరే, ఖండించి తీరాల్సిన అవసరం ఏముంది?

   Reply

 6. the tree
  Jun 25, 2012 @ 18:08:06

  khandisthu nerchukovadam anedi kooda , nerchukovadam lo bhagame anukuntanandi. may it not be best, it has its value, you can learn more in this way some times, than obeying ones.

  Reply

 7. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jun 25, 2012 @ 18:59:44

  మాస్టారూ… మీరన్నది కరక్టే… నేను రాసినదానిలో తప్పుంది. కింద చూడండి.

  భాస్కర్ గారూ… నా ఉద్దేశాన్ని “అవసరం ఏముంది” అని తప్పుగా రాశాను. అక్కడ రాయవలసినది “ప్రయోజనమేముంది” అని. పెసిమిస్టుని కదా. 🙂

  Reply

 8. bonagiri
  Jun 25, 2012 @ 19:57:40

  “రియలిజం సాధారణంగా పెసిమిజానికి దగ్గరగా ఉంటుంది”

  పరిస్థితులలా ఉన్నాయి మరి.
  అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్న మాట.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jun 25, 2012 @ 20:04:23

   absolutely. btw… godavarikI mIkU sambamdham EmTO telusukOvacchA! (saradAgAnE lemDi.)

   Reply

   • bonagiri
    Jun 25, 2012 @ 20:11:06

    నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను.
    అదృష్టవశాత్తు, మూడో గోదావరి బ్రిడ్జి నిర్మాణంలో సివిల్ ఇంజనీరుగా పని చేసాను.

 9. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jun 26, 2012 @ 11:53:37

  bonagiri garu… nice to know that you have drunk enough amount of godavari waters.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: