నదిపై వాన

చినుకులు
అలా నీళ్ళ మీద పడి
చిన్నగా సుడి తిరిగి
ప్రవాహంలో కలిసిపోతుంటే

నువ్వు
నవ్వుతూ
అలా నవ్వుతూ
అలా నవ్వుతూనే ఉన్నట్టుంటుంది

నువ్వొక
అఖండ ప్రవాహానివి
నీ చిరునవ్వు
ఓ సుడిగుండం

ఈ చినుకులని
అలా కురుస్తూనే ఉండనీ

17 Comments (+add yours?)

  1. the tree
    Jun 15, 2012 @ 12:15:13

    meeru kavithalu ala raasthune undandi,
    chakkaga undandi, feeling.

    Reply

  2. మధురవాణి
    Jun 15, 2012 @ 15:29:17

    భలే ఉందండీ.. అసలు ‘నదిపై వాన’ అనే మాటే కవితలా ఉంది. చినుకలతో నవ్వు పోలిక చాలా బాగుంది.

    Reply

  3. Sri
    Jun 15, 2012 @ 16:18:06

    :)) Nice!

    Reply

  4. ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jun 15, 2012 @ 16:54:15

    శ్రీ గారూ… ధన్యవాదాలు.

    Reply

  5. మధురవాణి
    Jun 15, 2012 @ 17:07:54

    అమరావతి కథలు ఒకటో రెండో తెలుసు గానీ పుస్తకం అంతా చదవలేదండీ.. చాన్నాళ్ళ నుంచీ చదవాలనుకుంటున్న పుస్తకాల్లో అదొకటి. తప్పక గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు. 🙂

    Reply

  6. sri
    Jun 15, 2012 @ 22:07:07

    నువ్వొక
    అఖండ ప్రవాహానివి
    నీ చిరునవ్వు
    ఓ సుడిగుండం…
    nice… baagundi…@sri

    Reply

  7. rpratapa
    Jun 16, 2012 @ 01:00:03

    Chinukulu vo direction lo padithe, torque yinko direction lo yela generate ayindabba? Man, your whirlpools are defying Newtonian mechanics!

    Reply

  8. వాసుదేవ్
    Jun 16, 2012 @ 14:00:12

    ఫణి గారు ఆమెవరో అన్నట్టు కవితా శీర్షికే కవిత్వం…నాకూ నచ్చింది.

    Reply

  9. merajfathima
    Jun 16, 2012 @ 19:09:07

    సర్ , సుడిగుండంలో చినుకు పడటం ఓ మమేకం , ఓ కలయిక మీ కవిత ఓ కొత్తప్రయోగం, స్త్రీ నుండి ఆశించే ఓ కొత్త స్పందన , చాలా బాగుంది

    Reply

  10. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
    Jun 17, 2012 @ 06:26:43

    నువ్వొక
    అఖండ ప్రవాహానివి
    నీ చిరునవ్వు
    ఓ సుడిగుండం

    Reply

  11. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
    Jun 17, 2012 @ 06:28:28

    బావుందండి. పైన వ్రాసిన లైన్లు ఇంకా బావున్నాయి

    Reply

  12. ఫణీన్ద్ర పురాణపణ్డ
    Jun 21, 2012 @ 12:00:34

    వాసుదేవ్ గారూ, ఫాతిమా గారూ… నా పిచ్చి గీతలు నచ్చినందుకు ధన్యవాదాలు. పైన చూశారుగా.. ఫిజిక్స్ మరిచిపోయానని మా మిత్రుడు కూకలేస్తున్నాడు 🙂

    Reply

Leave a comment