శనివారం అర్ధరాత్రీ… ఓ పుస్తకమూ… ఓ సినిమా….!

ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో ఏదో సభ జరుగుతోంది. విశ్వనాథ సత్యనారాయణ గారూ, అబ్బూరి రామకృష్ణారావు గారూ ఆనాటి వక్తలలో ఉన్నారు. విశ్వనాథ వారు తెలుగు పద్యాన్ని గురించి మాట్లాడుతూ ఆవేశపడిపోయి మన తెలుగు పద్యం లాంటిది ప్రపంచంలోనే లేదన్నారు. అంతే కాకుండా యతులు ప్రాసలు గురించి ప్రస్తావించి అసలు తెలుగు మాటల్లోనే మహాశక్తి ఒకటి ఉందని అంటూ తన అద్భుతమైన బాణీలో కొన్ని పద్యాలు చదివి ఫలానా మాటలో ఫలానా అక్షరంలో ఇంత శక్తి ఉందంటూ మాట్లాడారు. ఆ తరువాత ప్రసంగం చెయ్యవలసిన అబ్బూరి వారు లేచి అక్కడి సభలో ఒకరి దగ్గరున్న వార్తాపత్రికను తీసుకొని సంపాదకీయాన్ని రాగవరసలో చదివి కొన్ని మాటల్లో వున్న కొన్ని అక్షరాలలో విశ్వనాథ వారు చెప్పిన శక్తి ఉందనీ, నన్నయ్యా విశ్వనాథ వారే కాకుండా ఎవరైనా ఇలాగ రాయగలరనీ విమర్శించి అక్కిరాజు ఉమాకాంతం గారు తెలుగు చందస్సును విమర్శించడాన్ని గురించి చెప్పారు. ప్రసంగం ముగియగానే విశ్వనాథ వారు మళ్ళీ మైక్ అందుకుని అద్భుతంగా కవిత్వం చెప్పిన రామకృష్ణరావు పాశ్చాత్య విద్యతో చెడిపోయినాడంటూ విమర్శించారు. రామకృష్ణారావు గారు నవ్వేసి ఊరుకున్నారు. సభలో అందరికీ ఇంక వీళ్ళు మాట్లాడుకోవడం కూడా మానేస్తారన్న భావం కలిగింది. అయితే సభ ముగియగానే ఇద్దరూ కలిసి ఓ రిక్షా ఎక్కి నవ్వుకుంటూ వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగించింది అందరికీ.

ఈ ముచ్చట చెప్పిన వారు రామకృష్ణరావు గారి కుమారుడు అబ్బూరి గోపాలకృష్ణ. తన తండ్రి గురించి ఆయన రాసిన వ్యాసం ఉన్నది “అమ్మకి జేజే! నాన్నకి జేజే! గురువుకి జేజే!” అన్న పుస్తకంలో.

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గతంలో కొంతమంది మహనీయుల చేత “అమ్మ” గురించిన వ్యాసాలను “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో ప్రచురించి “అమ్మకి జేజే” పేరిట పుస్తక రూపంలో తెచ్చారు. దాన్ని పునర్ముద్రించే విషయాన్ని తిరుపతి రాజాచంద్ర ఫౌండేషన్ వారి దృష్టికి తెచ్చారు. వారు మరింత పూనిక వహించి మరికొందరు మహనీయుల చేత నాన్నకూ, గురువుకూ జేజేలు కొట్టించారు.

నేను ఈ ఉదంతాన్నే ఉటంకించడానికి కారణం విశ్వనాథ మీద వీరాభిమానం మాత్రమే కాదు. నిన్న రాత్రి సుమారు 8 గంటలకు మొదలెట్టి రాత్రి రెండు గంటల వరకూ చదువుతూ సరిగ్గా ఈ వ్యాసం దగ్గర ఆగాను. అదీ సంగతి. 🙂

*** *** ***

అంతకు ముందు… పుస్తకం చదువుతూనే చానెళ్ళు తిప్పుతూన్నాను. అప్పుడు త్రీ ఇడియట్స్ నా కంట పడ్డారు, కొన్నాళ్ళ క్రితం అదే సినిమా చూస్తుండగా సగంలో కరెంటు పోయింది. మిగతా ముక్క నిన్న రాత్రి పూర్తి చేశాను.

ఆమిర్‌ఖాన్ స్వోత్కర్ష లాంటి కొన్ని దృశ్యాలను మినహాయిస్తే…. సినిమా చివర్లో ఓ గర్భిణీకి వ్యాక్యూం క్లీనర్‌తో ప్రసవం చేసిన దృశ్యం బాగా నచ్చింది.

నిజానికి విధూ వినోద్ చోప్రా సినిమాలంటే నాకో భయం. ఆయన 1942 – ఎ లవ్ స్టోరీ చూసినప్పుడు ఆయన సినిమా తీసే విధాన్ని పిచ్చపిచ్చగా ప్రేమించేశా. ఆ తర్వాత చోప్రా సినిమా చూసింది మున్నాభాయ్ ఎంబీబీయెస్సే. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధూ నిర్మించిన ఆ సినిమా నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టింది. ఆ దెబ్బకి లగేరహో మున్నాభాయ్ చూడనేలేదు. చివరికి ఒకానొక అర్ధరాత్రి ఒక మిత్రుడి రూంలో కంప్యూటర్‌లో చూశా. ఎంబీబీయెస్ కంటె పరవాలేదనిపించింది.

వైద్యం, విద్య… ఆ రెంటికీ ఇంకా కొంత పవిత్రత మిగిలే ఉందని నా ఉద్దేశం. వాటిని అపహాస్యం చేసే సినిమాలంటే నాకు ఒళ్ళుమంట. ఎంబీబీయెస్ సినిమాలో నాకు నచ్చనిది అదే. హీరోని గొప్పవాడిగా చూపడం కోసం కాలేజీ ప్రిన్సిపాల్‌ని వెధవను చేయడం నాకు ఒళ్ళు మండించింది. ఇంక ఇడియట్స్‌లో ఐఐటీ ప్రిన్సిపాల్‌ని వెధవని చేయడం మరింత ఇరిటేషన్ కలిగించింది. అందుకే థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు చూడలేదు.

కొన్నాళ్ళ క్రితం ఒకానొక సెలవు రోజున ఒక్కణ్ణీ ఇంట్లో ఉన్నప్పుడు ఓ చానెల్లో ఆ సినిమా వస్తోంది. ద్వైదీభావనల మధ్యన భయపడుతూనే చూడ్డం మొదలు పెట్టాను, సగం దాటాక కరెంటు పోయింది. ఇంక ఇలా లాభం లేదని, ల్యాప్‌టాప్ తెరిచి ఎప్పుడో సేకరించి దాచుకున్న చేతన్ భగత్ నవల్ల ఫోల్డర్ తెరిచి ఫైవ్ పాయింట్ సంవన్ చదవడం మొదలెట్టాను. ఆ సాఫ్ట్ కాపీ కూడా సగంలో ఆగిపోయింది. ఆ అర్ధరాత్రీ ఇంక నిద్ర పట్టక చేతన్ మరో నవల త్రీ మిస్టేక్స్ పూర్తి చేసి కానీ పడుకోలేకపోయా.

నిన్న రాత్రి అనుకోకుండా ఆ సినిమా మళ్ళీ ఎయిర్ అవుతూ కనిపించింది. చూడడానికి బానే ఉన్నా, మౌలికంగా నాకు కలిగిన ఇబ్బంది అలాగే ఉండిపోయింది. ఇంజనీరింగ్ పరికరాల సాయంతో పురుడు పోయడం ఒక్కటే కొంతవరకూ నచ్చింది. ఇప్పటికైనా నవల పూర్తి వెర్షన్ సంపాదించి చదవాలి. అప్పుడైనా కొంత కన్విన్స్ కాగలుగుతానేమో.

Advertisements

14 Comments (+add yours?)

 1. kastephale
  Jun 10, 2012 @ 19:36:34

  గొప్పవారి పనులన్నీ పిచ్చిగానే కనపడతాయేమో!

  Reply

 2. Vanaja Tatineni
  Jun 10, 2012 @ 21:27:28

  వైద్యం, విద్య… ఆ రెంటికీ ఇంకా కొంత పవిత్రత మిగిలే ఉందని నా ఉద్దేశం. వాటిని అపహాస్యం చేసే సినిమాలంటే నాకు ఒళ్ళుమంట.
  same feeling.

  Reply

 3. merajfathima
  Jun 10, 2012 @ 21:40:17

  సినిమా వల్లా మంచి జరిగినట్లు ఎక్కడా ఉండదు, కాని పుస్తకాలు మనిషిని మంచిగా మాగ్చాగాలవని నా అభిప్రాయం. ఏమంటారు సార్.

  Reply

  • Phaneendra
   Jun 11, 2012 @ 11:57:11

   పుస్తకం వల్ల మేలైనా, కీడయినా… ఆలోచన తర్వాతనే జరుగుతుంది, కానీ సినిమా శక్తిమంతమైన మాధ్యమం. ఆలోచనను బ్లాక్ చేసేస్తుందది. అందువల్ల అది సమాజానికి చేసే కీడే ఎక్కువ. అంత శక్తి కలిగిన మాధ్యమాన్ని కళాత్మక భావ వ్యక్తీకరణ కోసం వాడితే మంచిదే. ఆ ముసుగులో ఎన్ని వికృతులు సినిమాలో చొరబడుతున్నాయో చూస్తే ఆవేదనే మిగులుతుంది. సాహిత్యం పేరులోనే సమాజానికి హితం చేకూర్చాలన్న భావన నిక్షిప్తమై ఉంది. కానీ సినిమా…. 😦
   స్పందనకు ధన్యవాదాలు.

   Reply

 4. merajfathima
  Jun 10, 2012 @ 21:43:06

  Sir, meeru raasina vidaanam chaalaa simple gaa undi , kaani ardhavamtamgaa undi,

  Reply

 5. rpratapa
  Jun 12, 2012 @ 00:02:15

  Dreamer garu atte kunuku theesthunnattu ledu meeru! Arogyam Jagartha!

  Reply

  • Phaneendra
   Jun 12, 2012 @ 11:51:34

   టెక్నోక్రాట్ గారూ… మీరు చెప్పాక కూడానా… మీరు చెప్పినట్టే చేస్తాను 🙂

   Reply

 6. Sri
  Jun 12, 2012 @ 01:56:41

  విధ్యా విధానాలలో లోపాలు ఉన్నాయని ఎత్తి చూపెట్టాలనుకోవడం దర్శకుడు ఉద్దేశం అవ్వచ్చు 3 idiots movie లో! కాని aamir khan లాంటి చ్రేతివె పెర్సొన్స్ ఎంతో మంది ఉండరు కదా? అలాగే అది చూపించటానికి మీరనట్టు IIT College principal ని వెధవను చెయ్యక్కర్లేదు. Munnabhai, mbbs లో కూడా అలాగే medical college principal ni fool లా చూపారు. మీరన్నట్టు హాస్యం పండించటానికి అలాంటి ఉన్నత మైన padavi లో ఉన్నవారిని అపహాస్యం చేస్తే, principals మీద, lecturers మీద ఉన్న గౌరవం పూర్తిగా పోతుంది. ఎలాగు తెలుగు సినిమాలో విధ్యార్ధిని (వాడెంత వెధవ అయినా, హేరొ కాబట్టి) చేత lectures and principals ని వెధవలుగా ఎప్పుడొ చూపెట్టారు కదండి?
  మీ శనివారం రాత్రి, ఒక పుస్తం, ఒక సినిమా పోస్ట్ నాకు నచ్చింది.

  Reply

 7. Sri
  Jun 12, 2012 @ 02:36:57

  “చ్రేతివె పెర్సొన్స్” – creative persons!
  “ఎలాగు తెలుగు సినిమాలో విధ్యార్ధిని” – ఎలాగు తెలుగు సినిమాలో విధ్యార్ధి
  sorry for the typos!

  Reply

 8. Phaneendra
  Jun 12, 2012 @ 11:54:53

  శ్రీ గారూ…
  నేను చెప్పేదీ అదే. ఆమిర్ ఖాన్, విధూ, హిరానీ లాంటి సృజనాత్మకత తెలిసిన వారు కూడా అలాంటి మూసలో సినిమాలు తీస్తే ఎలాగ అన్నదే నా బాధ. తెలుగు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 😦 మీ స్పందనకు ధన్యవాదాలు.

  Reply

 9. d.v.hanumantha rao
  Jun 23, 2012 @ 16:03:26

  కామెడీ పండడంకోసం పోలీసోళ్లమీద జోకులు, లెక్చరర్స్ మీద జోకులు.. ఇప్పుడు మీరు చెప్పినట్టు హీరోయిజం పెంచడంకోసం వైద్యాన్ని అపహాస్యం చెయ్యడం… ఇది మన సినీమా విధానం.. ఆ యమ్ బి బి యస్ సినీమా అంతే మెడికల్ కాలేజీలో సీటు అంత ఈజీయా.. ఇవన్నీ నవ్వి ఆనందించడానికి కాదు నవ్వుకొని ఏడవడానికి…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: