… గోదారి నీళ్ళల్లో కలిసిపోతూ నువ్వు

సంద్రాన అలలు పాడే రాగాలూ
అడవిలో పూలాడే తానాలూ
రూపు దాలిస్తే నువ్వు

తెల్లారే సూరీడి బంగారు పసిమీ
పున్నమి చెందురుడి యెర్రటి వెన్నెలా
కలబోసి కలగంటే నువ్వు

ఆకాశమ్ముంగిట్లో సీతమ్మారబోసిన కుంకుమా
పొలాల్లోంచి యెత్తుకొచ్చిన కొమ్ము పసుపూ
ముద్దగా పూసుకుని ముద్దొస్తూ నువ్వు

మబ్బుల నీడల్లో మెరుపుల సోకుల్లో
వురుముల పాటల్లో గోదారి నీళ్ళల్లో
కరిగిపోతూ కలిసిపోతూ నువ్వు

Advertisements

5 Comments (+add yours?)

 1. Sri
  Jun 04, 2012 @ 18:56:40

  Simply Superb! చాలా చాలా బాగుంది!

  Reply

  • Phaneendra
   Jun 04, 2012 @ 19:37:39

   శ్రీ.. ధన్యవాదాలు.
   అన్నట్టు, రాతలో ఎంత అందమైన అక్షరం మీ పేరు…!

   Reply

 2. Sri
  Jun 04, 2012 @ 19:50:14

  :))..Thank you!
  My blog name was misspelled , just correcting that!

  Reply

 3. వాసుదేవ్
  Jun 05, 2012 @ 07:31:21

  మీ బ్లాగ్ చూడకపోయుంటే చాలా మిస్సయ్యేవాణ్ణి…నాబ్లాగులో మీ కామెంట్ తో మీ చొక్కాపట్టుకుని ఇక్కడకొస్తే ఇక్కడో నిధి దొరికినంత ముచ్చటగా కొన్ని రాతలు కన్పడ్డాయి…..ఈ చిన్న కవితలో బోలెడంత భావుకత్వం ఉంది.” సితమ్మారబోసిన కుంకుమా” లాంటివి చిదివిస్తాయి రచనలని….అభినందనలు ఫణి గారు

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: