ఎందరో… మహా… నుభావులూ…!

హిందుస్తానీతో పోలిస్తే కర్ణాటకంలో భక్తి పాలు ఎక్కువ అనిపిస్తుంది. క్షేత్రయ్య లాంటివారి శృంగార కీర్తనలున్నా, త్యాగ, శ్యామ, ముత్తు త్రయం స్వరకల్పనలన్నీ దేవీ దేవతలను కీర్తించేవే. ఇక అన్నమయ్య ఏడుకొండల భక్తీ, రామదాసు జానకీపతి భక్తీ తెలీనిదెవరికి! అందుకే కర్ణాటక గాత్ర విద్వాంసుల, వాద్య కళాకారుల ప్రదర్శనల్లో భక్తి పారవశ్య గోదావరి పొంగిపొరలుతుండడం ఎందరికో అనుభవైకవేద్యమే.

90ల చివర్లో సదాశివ మాస్టారు హిందుస్తానీ గురించి పరిచయం చేసిన కొద్ది కాలానికే అదే బాటలో 21వ శతాబ్దపు తొలి నాళ్ళలో తనికెళ్ళ భరణి కర్ణాటక సంగీత కళాకారుల గురించి వివరించుకుంటూ వచ్చాడు. తెలుగువాళ్ళం నిలుపుకోలేకపోయిన మరో మంచి పత్రిక “హాసం’లో మూడేళ్ళ పాటు వరుసగా పలువురు కర్ణాటక కళాకారుల జీవితాల్లోని కొన్ని రసవద్ఘట్టాలను వర్ణించుకుంటూ వచ్చాడు. వారిలో చాలామంది మనకు తెలీనివారే. కొంతమంది పేర్లు వినబడినా… ఆయా ఘట్టాలు తెలిసుండే అవకాశాలు తక్కువ. తర్వాత పుస్తక రూపంలో వెలువడిన ఆ శీర్షికే “ఎందరో మహానుభావులు”.

పుట్టుగుడ్డి అయిన తన ఉద్యోగి కొడుక్కి జీవనోపాధి కోసం విజయనగరం సంగీత కళాశాల నిర్మింపజేశారట ఆనంద గజపతి మహారాజా. ఆ ఆనంద గజపతి, సితారే నేర్చుకుంటానంటే ఆయన తండ్రి విజయరాముల వారు వీణ నేర్చుకొమ్మన్నారట. ఆ రెంటి మధ్యా పోటీ పెడితే హిందుస్తానీ కళాకారుణ్ణి ఓడించి మరీ తండ్రి మాట నిలబెట్టించిన మహానుభావుడు దూర్వాసుల సోమయాజులు. పట్రాయని సీతారామశాస్త్రి గాత్రం పక్కన మృదంగం వాయించడానికి తానే స్వయంగా కూచున్నాడట సాలూరు రాజా వారు. గద్వాల సంస్థానాధీశురాలు ఆదిలక్ష్మీదేవి కళాకారుల పాదధూళిని వస్త్రకాళితం చేసి దాన్ని సిందూరంలో కలిపి పాపిట ధరించే వారట.

భోగం మేళానికి వాయించమన్న బొబ్బిలి సంస్థానాధీశుడి ఆజ్ఞ ధిక్కరించడానికి గుమ్మలూరి వెంకటశాస్త్రి జీవితంలో వీణ ముట్టుకోడమే మానేశారట. కారవేటినగరంలో పదకర్త సారంగపాణి ఆడవేషాన్ని రాజుగారు మోహిస్తే, నిజరూపాన్ని రాణీ కామించి ఆయన జీవితాన్ని దుర్భరం చేసిందట. కావ్యం అంకితమీయనన్న మద్దిరాల వెంకట కవిని బహిష్కరించిన పిఠాపురం రాజుకు రోగాలు చుట్టుకున్నాయట. కుష్టు వ్యాధిని సంగీత సాహిత్యాలతో నయం చేసుకున్న వాగ్గేయకారుడు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి, కాళహస్తీస్వరుడి సమక్షంలో రాసిన ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు నరాంకితం చేయనని కుండ బద్దలు కొట్టాడట.

రామదాసు తరువాత భద్రాచల రాముడికి సేవలు చేసిన వాగ్గేయకారుడు తూము నరసిమ్హ దాసు. ముత్తుస్వామి దీక్షితుల వారసుడి ఆభిజాత్యాన్ని పటాపంచలు చేశాడు పొన్నూరులో వారణాసి రామసుబ్బయ్య. ద్వారం వారి మాటున దాగిపోయిన వాయులీన ప్రతిభావంతుడు హరి నాగభూషణం త్యాగరాజస్వామి ప్రశిష్యుడు. పలుకు లేక పుట్టిన పలుకూరి వెంకట రమణుడి నోట స్వYఆనా వేంకటేశుడే సంగీతం పలికించాడట. పాలమూరు జిల్లా వేపూరు వాగ్గేయకారుడు హనుమద్దాసు, ఊళ్ళోకి విషజ్వరాలు రాకుండా కాషాయ ధ్వజం పాతాడట. అదే జిల్లా సంతూరులో కబోదిగా పుట్టి సిమ్హాచల నృసిమ్హుని కృపతో చూపు వచ్చి సిమ్హగిరి వచనాలు రాశాడు కృష్ణమయ్య. విష్ణువును నుతిస్తూ కల్లుకుండల మీద కవిత్వం రాశాడు తెలంగాణ బోర్నపల్లి సంస్థాన వాసి వర కవి కౌరం భూమ గౌడు.

దేశంలో నన్ను మెప్పించిన విద్వాంసులు, నా గురు తుల్యులు ఈయనే అన్నాడట విశ్వకవి తుమరాడ సంగమేశ్వర శాస్త్రి సంగీతం విన్నాక. వెంకటరమణదాసు వాయిస్తే వాన హోరు వినబడనంతగా వీణ జోరే వినిపించేదట. తలపై పెట్టిన నిమ్మకాయ కింద పడకుండా వీణ వాయించేవాడట వాసా అప్పయ్య. ఎడమచేతితోనూ వీణ వాయించే వాడట కాళహస్తి వీరయ్య. సంగీత సాధనలో మూడున్నర దశాబ్దాలు తన సతినే మరచిపోయాడట బొబ్బిలి విశ్వపతి శాస్త్రి. ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆమెకు తెల్లచీర చుట్టబెట్టేశారట. కళారంగంలో కళావంతులే తప్ప సద్వంశసంజాతలైన స్తృఈలకు స్థానం లేని రోజుల్లో సరస్వతీ స్వరూపాలైన సంగీత నాట్యాలు ఆయమ్మ బిడ్డలైన ఆడబిడ్డలు ఎందుకు నేర్చుకోకూడదంటూ మొదటి స్త్రీల సంగీత నాట్య పాఠశాల స్థాపించారట దాసు శ్రీరాములు.

తోటి కళాకారులను ఓడించి వారి తంబురాలు లాక్కునే అహంకారి “భూలోక చాప చుట్టి” బిరుదాంకితుడూ అయిన బొబ్బిలి కేశవయ్య సిమ్హనందన తాళ ఆలాపనకు ప్రతిగా శరభ నందన అనే కొత్త తాళం సృష్టించి ఆటకట్టించాడు శ్యామశాస్త్రి తంజావూరులో. తండ్రిని మించిపోయి ఓడించినందుకు ప్రతిగా కొడుకు అనంతయ్య కుడి బొటనవేలినే కొరికి పారేశాడు ఈర్ష్యాళువు వీణ కుప్పయ్య. దుడ్డు సీతారామయ్య చేత కాశీలో ఓడిపోయిన హిందుస్తానీ కళాకారుడు కాశీ గంగలో ప్రాణత్యాగం చేశాడట.

భరణి కబుర్లను మాస్టారి ముచ్చట్లతో పోల్చడం సరి కాదు కానీ, మలయ మారుతాలతో పోలిస్తే సంగీతం గురించిన “చర్చ” తక్కువ అనిపిస్తుంది, దాదాపు ప్రతీ వ్యాసంలోనూ వారివారి ప్రత్యేకతలనూ, రచనలనూ ఉటంకిస్తూ వచ్చినా. (లేదా నా కళ్ళజోడు తేడాయో మరి :)) ఇద్దరూ సమంగానే కథలు చెప్పినా… సదాశివ మాస్టారి ముచ్చట్లు నిండు గోదారిలా గుంభనంగా ఉంటే భరణి రచనలో ఆయన మార్కు పారవశ్యం, నాటకీయత, వర్ణనలూ కృష్ణమ్మ పరవళ్ళలా కదం తొక్కుతూ ఉంటాయి. మాస్టారు సంగీత స్వరూప స్వభావాల చర్చ కూడా చేశారు మలయమారుతాల్లో. కానీ భరణి దాని జోలికి పోలేదు. ఆ విషయమూ ఆయనే చెప్పుకున్నాడు…. సంగీతం నేర్చుకునే ప్రయత్నాలు ఫలించకపోయినా, దాని గురించి కొద్దో గొప్పో తెలుసుకోవాలన్న తపనతోనే ఈ కబుర్లు చెబుతున్నానని. అందువల్ల ఆయన తప్పేం లేదు లెండి.

ఏదేమైనా… ఎందరెందరో మహా కళాకారులు…. వారి వారి కథలూ గాథలూ….! వాటికి భరణినీయమైన శైలీ ఆభరణాలు. చదువుతుంటే ఎద నిండా పరుచుకునే పంచరత్నాలు.

Advertisements

14 Comments (+add yours?)

 1. kastephale
  May 30, 2012 @ 16:12:28

  Very good and interesting. thank u

  Reply

  • Phaneendra
   May 30, 2012 @ 16:36:51

   Sir, you must read those two books, they are like first steps to get interested in Indian classical Music.

   Reply

   • kastephale
    May 30, 2012 @ 17:20:01

    Thank u, can u give the address

   • Phaneendra
    May 31, 2012 @ 14:52:15

    Malaya Marutalu by Samala Sadasiva is a Telugu University Publication. Endaro Mahanubhavulu by Tanikella Bharani can be had from : Hasam Publications, C/O MBS Prasad, E-101, Satyanarayana Enclave, Adj. Church, Madinaguda, Hyderabad 49. Ph: 040-23047638

   • kastephale
    May 31, 2012 @ 16:48:35

    Thank u

   • ఉష
    Jun 01, 2012 @ 23:02:04

    నేను అడిగిన 2 పుస్తకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. కనుక, నా ముందరి వ్యాఖ్యని ఇగ్నోర్ చెయ్యండి. థాంక్స్ చక్కని వ్యాసానికి.

 2. Jalathaaru vennela
  May 30, 2012 @ 16:28:35

  Highly informative. Chaalaamandi karnaataka sangeetha kalaakaarula gurinchi telipaaru. Thanks for sharing.

  Reply

 3. NS Murty
  Jun 01, 2012 @ 18:28:51

  Phaneendragaru,
  You gave a just comparison between the two books. I read some of the articles of sadasiva garu earlier sometime (AndhraJyothi?). This generation is divided on the basis of religion. Those generations were united by music. Now our music is only cinema music and we rarely find such stalwarts as suryanarayana bhagavatar from vijayanagaram who held tyagaraja Utsavaalu in Vizianagaram for 15 days in my childhood.
  Thank you

  Reply

  • Phaneendra
   Jun 01, 2012 @ 19:56:01

   Murty garu… What I wrote is mere tip of the iceberg. In fact, I could not mention so many important points with the fear for length. Sadasiva sir had written in Andhra Prabha. My prior post is on Sadasiva gari Malaya Marutalu. In fact, this post is the last one in the trio.

   Reply

 4. NS Murty
  Jun 01, 2012 @ 20:19:20

  I am so happy to hear that Sri Samala Sadasiva garu is your uncle. I have been waiting for an opportunity to contact people related to him. Can you do me a favour. I wanted to translate some of the articles from Malayamarutalu into english and post them in my blog. Can you request on myhalf for the permission to do so. I will be greatly obliged.
  with best regards

  Reply

  • Phaneendra
   Jun 03, 2012 @ 12:01:43

   మూర్తిగారూ…

   సదాశివ గారికీ నాకూ ఏ బంధుత్వమూ లేదు. ఆ భావన మీకు ఎలా కలిగిందో తెలీదు కానీ. కాకపోతే ఉపాధ్యాయుడిగా పని చేసిన ఆయనను గురువుగా భావిస్తే మాస్టారు తప్పు పట్టుకోరని అనుకుంటున్నాను.

   ఇంకో రకంగా చెప్పుకోవాలంటే… మాస్టారి జిల్లా అయిన ఆదిలాబాదు నుంచి మన రాష్ట్రంలో అడుగు పెట్టే గోదావరి… మా రాజమండ్రీ వద్ద విశ్వరూపం చూపుతుంది. అలా గోదారి బంధం ఉందనుకోవచ్చు :).

   ఇక మీ అభిలాష మేరకు ఆయనకు సంబంధించిన వివరాలు మీకు సంపాదించి పెట్టగలను. మీ విజ్ఞప్తిని ఆయన వద్దకు తీసుకువెళ్ళగలను. ఒకట్రెండు వారాల్లో ఆ వివరాలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.

   Reply

 5. Phaneendra
  Jun 03, 2012 @ 11:51:37

  ఉషగారూ…
  భరణి మరో మంచి పుస్తకాన్ని కోట్ చేసారు. బాలాంత్రపు రజనీకాంత రావుగారి రచన. ఆ పుస్తకం (పేరు గుర్తు లేదు) మా నాన్న గారి దగ్గర ఉందట. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఆ పుస్తకం తెచ్చుకుని చదవాలి. దాని వివరాలు త్వరలో. (అంటే నా బద్ధకపు పరిభాషలో మరో మూణ్ణాలుగు నెలల్లో :))

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: