సా… పా… సా….

ఎప్పటిదో ఓ ఫెమినిస్టు రచయిత్రి కథలో ఓ ముక్క…. ఏ దిశగా అడుగులేస్తోందో అర్ధం కాని కూతురి గురించి ఆందోళన చెందే స్త్రీవాద తల్లి…. ఓ సారి ఆ పిల్ల ఏదో శాస్త్రీయ సంగీతం వింటుంటే… పోనీ అదైనా నేర్చుకుంటావా… అని అడుగుతుంది. వినడం ఇష్టమైనంత మాత్రాన నేర్చుకోవాలా, బోర్…. అంటుందా కూతురు. ఇప్పుడింతకీ నా గోల ఆ కథ గురించో, ఇస్త్రీవాదం గురించో కాదు…, సంగీతం గురించి.

సంగీతమంటే నాకు బోరు కాదు కానీ అది నేర్చుకునే లక్షణం లేదు. అందుకే మా చెల్లెళ్ళు వీణా, వాయులీనమూ నేర్చుకుంటే నేను కాన్‌సేన్‌గానే మిగిలిపోయాను. సీతమ్మ కుంకుమ ఆరబోసే వేళ ఆకాశవాణిలో వినిపించే భక్తిరంజనితో మొదలు వీనులవిందుగా వినడం అలవడడానికి. ఆ స్వరపేటిక జాలువార్చే లలితగీతాలు మొదలు సంగీత కచేరీల వరకూ వినడం బాల్యపు అపురూప అనుభూతి. త్యాగరాజ ఆరాధనోత్సవాల వేళ తిరువయ్యారులో అన్ని వేల మంది సంగీత విద్వాంసులు వినిపించే ఘనపంచరత్నాల సొగసు చూడ తరమా. అదే సంగీత ఋతువులో గోదావరి గట్టున మునిమాపు వేళ నది అలల తరగల పైనుంచి సుతిమెత్తగా వీచే చల్లని గాలుల నడుమ కచేరీలు వినడం… అనిర్వచనీయం,

వీణ మంద్ర గాంభీర్యతా, వాయులీనపు నాజూకుదనమూ, పిల్లనగోవి జీరదనమూ, జలతరంగిణి శైత్యమూ, మృదంగ లయవిన్యాసమూ, గాత్రంలోని మాధుర్యమూ రుచి చూసిన వాడెవడైనా శాస్త్రీయ సంగీతానికి దూరంగా ఉండగలుగుతాడా. పాడడమో, వాయించడమో రానంత మాత్రాన వినడానికేమి! (ఆవ పెట్టిన పనస పొట్టు కూర ఇష్టపడడానికి పనసకాయ చెక్కడమూ, పొట్టు కొట్టడమూ, ఆవ పెట్టడమూ రావాలా ఏమిటి? :))

ఏడు మెట్ల మీద తారా మండలానికి నేరుగా తీసుకుపోయే భారతీయ సంగీతానికి కర్ణాటక, హిందుస్తానీ రెండు పాయలు. కర్ణాటకం అలవాటయిన కొన్ని ప్రాణాలకి హిందుస్తానీ గాత్రమంటే సాగదీసుకుంటూ ఏడుస్తూ ఏడిపిస్తూండేది అన్న భావన ఉంటుంది. దానికి కారణం… కర్ణాటకం భారతీయ సంగీతపు శుద్ధ రూపంలో మిగిలిపోగా, హిందుస్తానీ విదేశీయ ధారలతో సమ్మిశ్రితమవడమే. ఒకసారి అలవాటు పడితే హిందుస్తానీ సొగసులూ ఎంతగానో ఆకట్టుకుంటాయి. విశ్వనాథ వారి మ్రోయు తుమ్మెద నవలకు నేపథ్యం హిందుస్తానీ సంగీతం. అది చదువుతున్నంత సేపూ షామీర్‌పేట చెరువు గట్టున సాక్షాత్కరించిన సంగీత శారద మన కళ్ళ ముందు కచేరీ చేస్తున్నట్టే ఉంటుంది.

అలాంటి సంగీతాన్ని వినే అనుభవాన్ని ప్రకటించడం, అక్షరీకరించడం సాధ్యమేనా! బాలమురళి సన్నజాజుల రవళి, సుబ్బులక్ష్మి భజనల తాదాత్మ్యత, టీయెన్ కృష్ణన్ వాయులీనం, బిస్మిల్లాఖాన్ షెహనాయి, హరిప్రసాద్ చౌరసియా పిల్లనగ్రోవి… వంటివి వినే అనుభూతులను సాధారణ శ్రోత ఎలా వ్యక్తీకరించగలడు? అంతకంటె ముందు, ఎలా అర్ధం చేసుకోగలడు?

సాహిత్యాన్ని చదివి అర్ధం చేసుకోవచ్చు. చిత్రలేఖనాలనూ, శిల్పాలనూ చూసి అర్ధం చేసుకోవచ్చు. పాఠకుడి లేదా వీక్షకుడి తెలివిడిని బట్టి అర్ధం చేసుకోడంలో స్థాయీ భేదాలుంటే ఉండవచ్చు కానీ మౌలికంగా మాటలోనో రాతలోనో వ్యక్తం చేయగలిగేలా అనుభూతి చెందగలడు. కానీ సంగీతం విషయంలో అది సాధ్యమా? సరిగమపదని అన్న అక్షరాలు తప్ప సంగీతం గురించి పెద్దగా తెలీని వాడు వాయిద్యకారుడి ప్రతిభకు పులకరించగలడేమో కానీ దానిలోని శాస్త్రీయ సంగతులను అర్ధం చేసుకోడం సాధ్యమేనా?

సంగీతాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి పుస్తకాలు చాలానే ఉన్నట్టున్నాయి. కానీ సంగీతాభిరుచిని కలిగించగల సాహిత్యం తెలుగులో పెద్దగా ఉన్నట్టు లేదు. నాకు తారసపడిన అలాంటి పుస్తకాలు రెండే రెండు. చిత్రమేమంటే, ఆ రెంటిలోనూ సంగీత కళాకారుల జీవన వాక్చిత్రాల ప్రదర్శనే. కానీ ఆ రెండూ పఠితలను గంధర్వ లోకాలకు తీసుకుపోతాయి. మనముంటున్న ఈ ప్రపంచంలోనే ఇలాంటి ప్రపంచమూ ఉండేదా అన్న అనుమానం కలిగిస్తాయి. అక్కడికు వెళ్ళిపోవాలన్న ఆతృత కలుగజేస్తాయి.

Advertisements

8 Comments (+add yours?)

 1. కొత్తపాళీ
  May 29, 2012 @ 21:57:15

  ఇది కూడా చాలా బావుంది. అవును, సంగీతానుభవాన్ని గురించి రాయడం చాలా కష్టం. అయినా ఏదో మనసు పట్టలేక ఏదో గిలుకుతూ ఉంటాను. ఇక్కడ (అమెరికాలో) రకరకాల సంగీతాన్ని ఆస్వాదించడం ఎలాగో బోధించే పుస్తకాలే కాక కాలేజి కోర్సులు, సరదాగా చదివే కోర్సులు కూడా ఉన్నాయి. కర్నాటక సంగీతానికి అటువంటి పరిచయం రాయాలని ఎన్నాళ్ళుగానో కోరిక. ఎప్పటికి తీరేనో?

  Reply

  • Phaneendra
   May 30, 2012 @ 11:52:34

   పూనుకోండి మాస్టారూ… అలాంటి సాహిత్యం విస్తృతంగా రావలసిన అవసరం ఎంతైనా ఉంది.

   Reply

 2. NS Murty
  Jun 01, 2012 @ 20:30:37

  ఆవ పెట్టిన పనస పొట్టు కూర ఇష్టపడడానికి పనసకాయ చెక్కడమూ, పొట్టు కొట్టడమూ, ఆవ పెట్టడమూ రావాలా ఏమిటి?….

  I am one of those. I think the need of the hour is integration of peoples and religions than division.We have divided ourselves sufficiently enough. It is time for reversing the process. Music can certainly do that. At least lives of great people can inspire in that direction.
  Best regards

  Reply

  • Phaneendra
   Jun 03, 2012 @ 11:44:46

   మూర్తిగారూ…
   మహానుభావుల జీవితాల స్ఫూర్తితో నిర్మాణాత్మకంగా జీవించాలన్న మీ మాట అందరికీ శిరోధార్యం.

   Reply

 3. ఉష
  Jun 01, 2012 @ 22:52:43

  >> సంగీతాభిరుచిని కలిగించగల సాహిత్యం తెలుగులో పెద్దగా ఉన్నట్టు లేదు. నాకు తారసపడిన అలాంటి పుస్తకాలు రెండే రెండు<<

  ఫణీంద్ర గారు, ఆ పుస్తకాల పేర్లు ఇవ్వగలరా? ఇతరత్రా రచనలు, ఈమాట లో చాలా వ్యాసాలు చదివాను ఇంకాస్త విస్తృతి పెంచుకోవాలన్న ఆసక్తి ఉంది. (ఎందుకంటే నాకు పనసకొట్టు కొట్టతం రాదు గానీ, కొట్టేప్పుడు పక్కన ఉండడం, వండినపుడు రుచి చూడ్డం ఇష్టం 🙂 12 ఏళ్ల మా పాప కర్ణాటక సంగీతం గత 3.5సం గా నేర్చుకుంటుంది. నా చిన్నప్పుడు వదిలిన సంగీతాభిరుచిని తిరిగి తనతో వెనక్కి తెచ్చాను. పిల్లది వయోలిన్ బాగా వాయిస్తుంది. వాద్య గాత్ర సమ్మిళిత పరిజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకం కొరకు నా అన్వేషణ.).

  Reply

  • Phaneendra
   Jun 03, 2012 @ 11:47:18

   ఉషగారూ…
   తర్వాతి తరాలకు అభిరుచి, అభినివేశమూ కల్పిస్తున్నంత మీ కృషి అభినందనీయం. సరదాగా ఓ చిన్న మాట. పురుషాధిక్యమో మరేమో కానీ పనస పొట్టు కొట్టడం మగాళ్ళ హక్కు. ఆ తర్వాతే ఆడాళ్ళు రంగంలోకి దిగేది. 🙂

   Reply

   • ఉష
    Jun 03, 2012 @ 19:51:26

    😉 అవునవును – కొట్టించటం లేదా కొట్టి మరీ కొట్టించటం మా హక్కు! (అప్పట్లో) మా ఊరి మావిళ్ళింగం గారి దగ్గర తెలగపిండి ఎంత రుచో, ఆయన చేతి పనసపొట్టు అంత నేవళం. పసుపు అద్దే వరకు ఆయన పని, ఆపై ముద్ద దిగేవరకు అమ్మమ్మదీను. నేను ఆధిక్యత, వాదుల, పోరుల మనిషిని కానండోయ్, సమస్థాయి కొరకు ప్రశ్నించే వ్యక్తిని.

 4. Phaneendra
  Jun 04, 2012 @ 11:52:50

  ఉష గారూ… 🙂 సమత్వం… వినడానికే ఎంత మధురంగా ఉందో…!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: