ఆ తూలికపై ఏ రంగులు కలిసెనో…

జయచిత్రని పట్టుకుని రవివర్మకే అందనీ ఒకే ఒకా అందానివో అంటూ పాడుతూంటే నిజమే కదా అనుకునే వాణ్ణి. అసలా ఆలోచనే చాలా ఇబ్బందికరంగా ఉండేది.

చిత్రలేఖనం ఒక యాబ్‌స్ట్రాక్ట్ కళ అయితే అయుండొచ్చు కానీ నాలాంటి వెర్రివాడికి అంత తాత్వికత అర్ధం కాదు. క్యూబిజాలూ, రెక్టాంగిలిజాలూ అసలే ఎక్కవు. ఓ సౌందర్యం ఐనా ఓ భీభత్సం ఐనా స్ట్రైట్‌గా ఉంటేనే కొంచెం అర్ధం చేసుకోగలను, ఆనందించగలను లేదా ఆలోచించగలను.

రాజమండ్రీలో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అనేది ఒకటుందనీ… అందులో ప్రదర్శితమయ్యే లేఖనాల సృష్టికర్త చిత్ర కళా ప్రపంచంలో తనదైన ముద్ర కలిగిన అరుదైన మహానుభావుడనీ ఎందరికి తెలుసో నాకు తెలీదు కానీ… డిగ్రీ చదివే రోజుల్లో మా మిత్రులతో కలిసి అక్కడికి తరచుగా వెళ్ళి ఆ కళాఖండాలను ఓ అమాయకత్వపు తన్మయత్వంతో చూసిన జ్ఞాపకాలు మనసు పొరల్లో ఇంకా మిగిలే ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి వాటిని చూడగలిగేదెప్పుడో.

దేవీ దేవతలకు ఓ రూపం, ఓ మూర్తి ఇచ్చిన ఘనుడు రవివర్మ అంటారు. నిజమే… కానీ…. నాకు అద్భుతం అనిపించేంత ఇష్టమైన రవివర్మ కళాఖండం అది కాదు. భారతీయ సంగీత కళాకారిణుల బృందాన్ని అంతటినీ ఒకే క్యాన్వాస్‌పైకి ఎక్కించిన చిత్రలేఖనం ఉందే… అలాంటిది ప్రపంచంలో మరి ఎక్కడైనా ఉందా… అంటే… ఒక పదిమంది కళాకారిణులు ఒక చోట కలిసి ఉన్న చిత్రలేఖనం అని కాదు… ఆ పదిమంది లోనూ పదిరకాల ఛాయలు, వేర్వేరు కట్టుబొట్లు, వారివారి ఆచార వ్యవహారాలు, తీరుతెన్నులు.. నాకైతే అసలా చిత్రాన్ని చూస్తున్న కొద్దీ ఎన్నెన్ని ఊహలు ముసురుకుంటాయో…!

ఒక రాజ వంశీయుడు తీరిగ్గా తిని కూచుని గీసే అలాంటి చిత్రాల్లో గొప్పేముంది అంటారేమో కొందరు.. అలాంటి వారికి దండం. ప్రియుడికి హంసతో రాయబారం నడిపే దమయంతిని సృజించిన చేతులే కీచకుడి భయానికి అల్లల్లాడిన ద్రౌపదినీ చిత్రించిన తీరును చూసి తీరాల్సిందే.

అసలా రంగుల కలయిక ఏంటండీ బాబూ… ఆయన మనిషేనా అనిపిస్తుంది నాకయితే… పల్లె పడుచు, బిచ్చం వేస్తున్న చిన్నారి… పూలమాల అల్లుకుంటున్న కేరళ కుట్టి…. అమ్మమ్మమ్మమ్మా…

దేశపు దక్షిణపు కొసనున్న ఓ రాజ సంస్థానంలో ఓ రాజవంశీకుడు తన మనో నేత్రంతో చూసి కుంచెపై రూపించిన లక్ష్మి, సరస్వతి, బాలకృష్ణుడు… ఆసేతు శీత పర్యంతం ఆరాధ్య రూపాలైపోయాయంటే… ఆ కళాకారుడి జన్మ ధన్యం. అవి గాంచిన కన్నులే కన్నులు.

(ఇవాళ రాజా రవివర్మ జయంతి సందర్భంగా….!)
(ఆ మహానుభావుడి చిత్రాలు అంతరజాలంలో సేకరించినవి, కాపీరైట్ సదరు సైట్ వారిదే)

Advertisements

18 Comments (+add yours?)

 1. padma4245.blogspot.com
  Apr 29, 2012 @ 14:32:43

  ఏమీ తెలీదు అంటూనే అన్నీ చెప్పారుగా 😉

  Reply

  • Phaneendra
   Apr 29, 2012 @ 15:21:01

   పద్మ గారూ…
   నిజంగా నాకు చిత్రలేఖనం గురించి ఏం తెలియదండీ బాబూ… గెర్నికా చూసినా, బాధ అనిపించింది తప్ప ఆ కళాకారుడి వాస్తవిక భావనను ఏ మాత్రం అర్ధం చేసుకున్నానో అసలు నాకే తెలీదు.
   స్పందనకు ధన్యవాదాలు.

   Reply

 2. kastephale
  Apr 29, 2012 @ 15:44:47

  interesting

  Reply

 3. Vanaja Tatineni
  Apr 30, 2012 @ 11:21:22

  ఫణి గారు.. రవి వర్మ గారి పరిచయం.. మీరు సూక్ష్మ మైన విషయాలని గమనించిన తీరు.. చాలా బావుంది. చిన్నప్పుడు మా ఇంట్లో దమయంతి చిత్రం ఉండేది. ఆ చిత్రం లో ఆమె కట్టిన చీర కూడా దమయంతి పచ్చ అని చెప్పేవారు. మీ శ్రద్ధాసక్తులకి అభివందనం.
  ఇంకో విషయం జయచిత్ర గారిని వర్ణించడం ఆవిడ చేసుకున్న అదృష్టం సుమండీ! ముఖం బాగానే ఉంటుంది లెండి. :)))

  Reply

 4. ఉష
  Apr 30, 2012 @ 19:38:30

  రవివర్మ పట్ల అభిమానం, ఇంకా ఇంకా తెలిసే కొద్దీ ఎదుగుతుంది. గంగావతరణ చిత్ర రీతికి కూడా రవివర్మే ఆద్యుడని ‘వేణువు’ బ్లాగరి వేణు గారు పంచిన చిత్రం ఇక్కడ చూడండి – http://venuvu.blogspot.com/2011/05/blog-post.html నా కలక్షన్ లో అప్పటికి లేని చిత్రమది. నిజానికి ఏ కళాకారుడైనా చిరంజీవే, ఆతని సృష్టిలోనే ఆత్మ లీనమై, కళాఖండాలుగా విస్తరిస్తుంది. మీరు వ్యక్తపరిచిన అభిమానరీతికి అభినందనలు.

  Reply

  • Phaneendra
   Apr 30, 2012 @ 20:40:02

   ఉష గారూ…
   మంచి లింక్ ఇచ్చి కొత్త విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే… మీరు నా బాధని రెట్టింపు చేశారు. 😦 సీతా కళ్యాణం చూడాలన్న కల ఇంకా కలగానే ఉండిపోయింది. పైగా వేణూ గారి కథనం చదువుతుంటే ఆ బాధ మరింత తీవ్రమయింది.
   గంగావతరణాన్ని నికొలాస్ రోరిక్ మహా అందంగా చిత్రించాడట చూశారా.. (నేనూ చూడలేదనుకోండి)

   Reply

 5. oddula ravisekhar
  Apr 30, 2012 @ 21:51:59

  రవివర్మకే అందని ఒకే ఒక అందానివో!కవి ఎలా అన్నాడో కాని, చాలా సం:నుండి చూస్తున్నాను.అద్భుతమైన కళాఖండాలు.కాని వివరించేవారు తగల్లేదు.మీ వర్ణన సేకరణ ,చాలా బాగుంది.

  Reply

 6. శ్రీ
  Apr 30, 2012 @ 23:06:41

  చాలా బాగా రాసారండి.

  Reply

 7. రసజ్ఞ
  May 01, 2012 @ 22:24:54

  రవివర్మ గారి గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది నా దృష్టిలో. ఆయన చిత్రాలపై మీ ఆలోచనా, విశ్లేషణా రెండూ బాగున్నాయి. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి ఇంచుమించు వారానికి రెండు సార్లన్నా తప్పకుండా వెళ్ళే దానిని నా డిగ్రీలో. మధుర స్మృతులతో పాటూ చిత్రాలకి ఊపిరి పోసిన మహానుభావుడినీ గుర్తు చేసిన మీకు ధన్యవాదాలు!

  Reply

 8. anrd
  May 07, 2012 @ 19:41:22

  చక్కటి పోస్ట్ . బాగా వ్రాసారండి.

  Reply

 9. కొత్తపాళీ
  May 29, 2012 @ 22:01:35

  “జయచిత్రని పట్టుకుని రవివర్మకే అందనీ ఒకే ఒకా అందానివో అంటూ పాడుతూంటే నిజమే కదా అనుకునే వాణ్ణి. అసలా ఆలోచనే చాలా ఇబ్బందికరంగా ఉండేది.” – హ హ హ!! true true

  “రాజమండ్రీలో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అనేది ఒకటుందనీ ..” – అప్పుడే షికాగోలో ఆర్ట్ ఇన్స్టిట్యూట్ చూసి బైర్లు కమ్మిన కళ్ళతో చెన్నైలో దిగి రాజమహేంద్రి వెళ్ళాను. కరంటు బిల్లు కట్టేందుకు డబ్బుల్లేక లైట్లు ఆర్పుకుని కూర్చున్న దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని చూసి కళ్ళనీళ్ళ పర్యంతమయింది. ఇప్పుడెలా ఉందో ఏవిటో.

  Reply

 10. Phaneendra
  May 30, 2012 @ 11:50:07

  ఇప్పుడెలా ఉందో ఏవిటో….. అడక్కండి మాస్టారూ… నేను వెళ్ళి కొన్నేళ్ళయింది. వెళ్ళే ధైర్యం సరిపోడం లేదు, ఈసారి ఎలాగైనా చూసి రావాలి.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: