చౌధ్‌వీ కా చాంద్ హో…

అందగించిన చందమామవో అరుణారుణ ఇనబింబానివో
మరి నీవెవరివో ఏమో… నీకు సాటి ఇల లేదేమో

ఆ బుజాల మీద దిగిన కరిమబ్బులు నీ కురులు
లేలేత మదిర నిండిన పానపాత్రలు నీ కనులు
నిండుప్రేమతో పండినవి నీ నీలి నేత్రాలు

కొలనులో అరవిరిసిన అరవిందమో నీ మోము
జీవన వీణ మంద్రపు తీవెలపై మీటిన పదమో
విరిసిన వసంతమో ఆ మోము ఏ కవి స్వప్నమో

ఎరుపెక్కిన పెదాలపై వెలిగె లేత నగవులు
నీ పదములంటిన నేలను వాలెనెన్నో తలలు
నీవె ప్రణయ పరాగమువొ, సౌందర్య సరాగమువో

(రఫీ గళాన పండిన షకీల్ బదయూనీ పదాల రవి సంగీతపు
పున్నమి చందమామ పాటను అమవస నిశి చేసిన నా పైత్య ప్రకోపం)

Advertisements

5 Comments (+add yours?)

 1. Vanaja Tatineni
  Apr 25, 2012 @ 20:47:41

  చాలా బాగుంది.

  Reply

 2. anikethpratik.blogspot.com
  Apr 26, 2012 @ 01:57:45

  Translated a good song.

  Reply

 3. Phaneendra
  Apr 26, 2012 @ 11:53:47

  వనజ గారూ… ప్రతీక్ గారూ…
  ధన్యవాదాలు

  Reply

 4. శ్రీ
  Apr 30, 2012 @ 23:08:25

  Translation అని మీరు చెప్పకపోతే తెలిసేదే కాదు. చక్కగా ఉంది!

  Reply

  • Phaneendra
   May 01, 2012 @ 14:08:06

   శ్రీ…
   మూల కవి సృజన సౌందర్యంతో పోలిస్తే ఇదెంత… ధన్యవాదాలు.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: