అరచేతిలో మూడు గాట్లు పెట్టి…

బొటనవేలి కణుపు దగ్గర ఒక గాటు పెట్టాలి, తర్వాత చూపుడువేలు, అక్కణ్ణుంచి మధ్య వేలు, ఉంగరం వేలు మీదుగా చిటికెన వేలి వరకూ మొదటి కణుపుల దగ్గర కోసెయ్యాలి. చిటికెన వేలి రెండో కణుపు నుంచి మళ్ళీ వెనక్కి బొటన వేలి వరకూ అలాగే కోసుకుంటూ పోవాలి.

అరచేతి పని పూర్తయ్యాక మణికట్టు కాకుండా నేరుగా జబ్బ దగ్గరకి వెళ్ళిపోవాలి. అరంగుళం లోతున గాటు పెట్టాలి. అలా ప్రతీ అరంగుళానికీ కోసుకుంటూ పోవాలి. అలా కుడి చేతి పని పూర్తయ్యాక ఎడమ అరచేయి, తర్వాత ఎడమ చేయి, ఆ తర్వాత రెండు కాళ్ళూ అరిపాదాలతో మొదలెట్టి కోసుకుంటూ పోవాలి.

తర్వాత ఛాతీ పని పట్టాలి. గుండె ప్రాంతాన్ని పెండింగ్ పెట్టి మొత్తం ఛాతీ అంతా అంగుళమంగుళం కోసిపారేయాలి. ఆ తర్వాత ఊపిరితిత్తులూ, మూత్రపిండాలూ పంచర్ చేసేయాలి.

చివరాఖర్న గుండెకీ అదే సత్కారం చేయాలి. ఆ కోసిన గాయాల్లో కారం కూరాలి.

ఏం? శాడిస్టులా కనిపిస్తున్నానా?

*** *** *** *** ***

“చూడు తల్లీ… మీ ఆడ బోడెక్కలు నానా కష్టాలూ పడిపోతున్నారంటూ గుండెలు బాదేసుకుంటున్నాం” నాతో చనువుగా ఉండే ఓ కాపీ ఎడిటర్ అమ్మాయికి చెప్పాను.

అవాళ ఏదో సందర్భం వచ్చి స్త్రీలూ – వివక్షా – హింసా అన్న అంశంపై ఒక ప్రత్యేక కార్యక్రమం చేశాం, కొంత రెటోరిక్ ఉన్నా ఓవరాల్‌గా చూసుకుంటే బానే వచ్చింది.

“ఏం సార్, ఎందుకు చెయ్యకూడదు. మేము పడే కష్టాల గురించి మీకెప్పుడూ చిన్న చూపే. అసలు ఆడాళ్ళు లేకపోతే మీ మనుగడే ఉండేది కాదు. అలాంటిది ఆడాళ్ళని నానా మాటలూ అనడానికీ చిత్రహింసలు పెట్టడానికీ మగాళ్ళకి ఎవరిచ్చారు హక్కు.” అంటూ మొదలెట్టిందా అమ్మాయి.

“నీ సంగతే తీసుకో… మీ ఆయన నిన్న మొన్నటి దాకా ఎంత ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు ఇద్దరికీ వంట చెయ్యలేక, బట్టలుతకలేక, ఇల్లు సర్దుకోలేక ఎన్నెన్ని అవస్థలు పడుతున్నాడు…”

ఏం కాదు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు పంచుకోడంలో తప్పేంటి” విరుచుకుపడిందామె. ఏం మాట్లాడలేక ఆమె భర్త ఇబ్బంది పడ్డాడు. (ఆ అబ్బాయీ మా చానెల్లోనే పని చేసే వాడు.)

నేనంత త్వరగా వదుల్తానా ఓ ఆడ లేడీసుని ఏడిపించే ఛాన్సుని. “అసలు నువ్వింకా ఉద్యోగం చెయ్యడం ఎందుకు. ఇంట్లో కూచుని అంట్లు తోముకుంటూ పిల్లల మూతులు కడుక్కుంటూ కూచోక.”

ఇంకంతే… నా మీద విరుచుకు పడింది. మీరంత అంటే మీరంత అని ఒకరినొకరు ఆడిపోసుకుంటున్నాం, అంతలో ఏదో కాల్ వచ్చింది. మా బులెటిన్ చూస్తున్న ప్రేక్షకుడొకరు చేశారు.

మీకెంత సేపూ ఆడవాళ్ళ కష్టాలే కనిపిస్తాయా.. మగాళ్ళ జీవితాలతో ఆడుకునే ఆడవాళ్ళు మీకు కనబడరా… అంటూ చెలరేగిపోయాడు,

అలా కాదు బాసూ… అదీ ఇదీ రెండూ ఉన్నా… స్త్రీలపైనే దాడులూ హింసా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కదా… ఇప్పటికీ పురుష దురహంకారమే రాజ్యమేలుతోంది కదా.. అందుకే చదువుకున్న వారిగా స్త్రీల పాట్లపై స్పందించడం మన ధర్మం… అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాను.

ఎంతకీ వినడే… లేదు, మీరు అర్జెంట్‌గా మగాళ్ళు ఎదుర్కొంటున్న భౌతిక, మానసిక హింసపై కథనాలు చేయాలి…. అంటూ ఎగిరేస్తున్నాడు,

“సరే… ఆడవాళ్ళు చేస్తున్న శారీరక, మానసిక దాడుల గురించి మగాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా ఫిర్యాదులిచ్చి మాట్లాడినప్పుడు తప్పకుండా చేద్దాం, ముందు మీరేమైనా స్పందిస్తారా” అని అడిగాను.

వెంటనే ఫోన్ కట్ అయింది.

“మీరిలా రెండు నాల్కల ధోరణితో మాట్లాడడం బాగోలేదు. బైటకి మహిళలను సమర్ధిస్తున్నట్టు నటిస్తూ, మా దగ్గర మమ్మల్నే తిడతారా. మేడంకి చెబుతా” అంది మా మహిళామణి.

నాకేమన్నా భయమనుకున్నావా, తన కంటే నేనే బాగా వంట చేస్తానుగా” అని అక్కణ్ణుంచి పారిపోయాను.

*** *** *** *** ***

బెంగళూరులో మూడు నెలల అఫ్రీన్‌ని కన్న తండ్రే కిరాతకంగా చంపేశాడు. కనీసం కళ్ళు తెరిచి నవ్వడమైనా పూర్తిగా రాని ఆ పసిగుడ్డును అత్యంత పాశవికంగా రాక్షసంగా హత్య చేసిన వాడికి ఎంత తీవ్రత కలిగిన శిక్ష సరిపోతుంది?

గుంటూరులో ఆడపిల్లను కన్న పాపానికి తల్లిని హత్య చేసి, ఆ కూతురిని నిర్బంధంలో ఉంచి పరోక్షంగా చంపేసిన నీచుడికి ఎలాంటి శిక్ష వేస్తే, అది సరిపోయిందని అనుకోవచ్చు?

*** *** *** *** ***

ఇప్పుడు చెప్పండి అసలైన శాడిస్టులెవరో?

Advertisements

6 Comments (+add yours?)

 1. spicejet
  Apr 15, 2012 @ 08:44:07

  pasi paapa Afreen, kanna thalli Reshma gurinchi vinnappudu nenu chala emotional ayyaanu.. naku pillalu leru.. aado biddo maga biddo evaro okarini devudu na vallo veste chaalu ani kanipinchina kanapadani devullanadariki mokutunaanu.. aa devudiki hrudayamledu.. unte inta kadupu kota ivvadu Reshma ki. aa thalli ni deggariki teesukuni odarchalani undi. Devuda Kallu teru.. nee allari pillalaki budhi cheppi sakramamaina margam chupu.

  Reply

 2. Phaneendra
  Apr 15, 2012 @ 10:36:54

  Dear Spice Jet…

  I share my voice in your prayer…! May the Heartless God uses his brain, at least.

  Reply

 3. శ్రీ
  Apr 17, 2012 @ 00:55:44

  అసలు ఇంత కిరాతకులు ఈ రోజుల్లో కూడా ఉంటారా అనిపిస్తుందండి.

  Reply

  • Phaneendra
   Apr 17, 2012 @ 09:31:19

   తాజా వార్త… మూడోసారీ ఆడపిల్లకే జన్మనిచ్చిందంటూ భార్యను హత్య చేశాడట అమృత్‌సర్‌లో ఓ ప్రబుద్ధుడు.

   Reply

 4. రసజ్ఞ
  Jul 12, 2012 @ 04:18:53

  జన్మనిచ్చేది తల్లే అయినా ఆ బిడ్డ ఆడో, మగో నిర్ణయించేది మాత్రం తండ్రే అని ఎప్పటికి తెలుస్తుందో ఈ ప్రబుద్ధులకి. తను చేసిన తప్పుకి వేరే వాళ్ళని బలి చేయటం ఏం పైశాచికమో!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: