రామకోణంగి

ఆ బిజినెస్‌మ్యాన్‌కి తెలీదేమో కానీ రాముడు చాలా కొంటె వాడట. ఆయన పేరు మీదనే “రామకోణంగి” అన్న పదమూ ఉందట. కాకపోతే ఆ కొంటె వేషాలేవో సీతమ్మకు మాత్రమే పరిమితం. అందుకే రామయ్య సరసాల స్వారస్యాలు అంత బహిరంగం అయినట్టు లేవు.

కైకమ్మ పెరుగు బువ్వ పెట్టినప్పుడు చందమామ కావాలీ అని ఏడిపించుకు తిన్న వాడు మన రామచంద్రుడే కదా.

కళ్యాణ వేళ తలంబ్రాలు పలు వన్నెలు మారుతుంటే మైథిలి విస్మయచకిత కాగా స్వామివారు సుస్మిత వదనుడయాట్ట. అదే విషయాన్ని బాపూరమణీయంగా వర్ణించారు ఆరుద్ర.

యెఱ్ఱటి దోసిట తెల్లటి ముత్యాలు సీతమ్మ తలంబ్రాలకై తీసింది
తీసిన ముత్యాలు దోసిట రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి
కెంపులనుకున్నవి రామయ్య మైచాయ సోకి నీలమ్ములైనాయి
యిన్ని రంగులు చూసి యింతి తెల్లబోయింది, ఇనకులుడు చిరునవ్వు నవ్వాడు

ఆ నవ్వుల వెనుక లీలామానుషమేమో ఆయమ్మే చెప్పాలి.

ఇక పర్ణశాలలో సీతమ్మతో అటవీ సౌందర్యాన్ని అనుభూతిస్తున్నప్పుడు ఆయన ఆడిన మేలములెంతటివో మునిపుంగవుడు అలతియలతి పదాలతొ చెప్పినా లక్ష్మణుడి ముసిముసి నగవులు చూసి తెలుసుకోవలసిందే.

ఆ రామకోణంగి ఎంత తుంటరివాడు కాకపోతే… తన పుట్టినరోజు నాడు కారపు మిరియాలూ… తీపి బెల్లమూ కలిపి తినిపిస్తాడు….

ఇంతకీ రామకోణంగి అన్న పదపు వాడుక మీరెవరైనా విన్నారా? వింటే చెప్పండి ప్లీజ్.

మరి ఆ పదం నీకెక్కడిదిరా అంటారా… మళ్ళీ ఇక్కడా ఆయనే… ఇంకెవడు… విశ్వనాథ సత్యనారాయణుడే…! 🙂

Advertisements

9 Comments (+add yours?)

 1. Sowmya
  Apr 04, 2012 @ 09:53:39

  పదం భలే ఉందండీ! ఎవరన్నా వివరణ చెబుతారేమో అని నేనూ చూస్తున్నాను ఈ క్షణం నుంచీ ఇక! 😉

  Reply

  • Phaneendra
   Apr 05, 2012 @ 00:29:50

   సౌమ్య గారూ…
   ఈ విశ్వనాథతో ఇదే వచ్చిన చిక్కు. పాషాణ పాకాన్నయినా కొంత అరిగించుకోవచ్చు కానీ జాను తెనుగుతో చంపేస్తారు. ఈ మధ్యన ఆయన సాహిత్య విమర్శా సంకలనం, నాటకాల సంకలనం అనుకోకుండా దొరికితే కొన్నా. వాటిలోనే ఎక్కడో తగిలాడీ రామకోణంగి. ఈలోగా నాన్నగారు ఊరి నుంచి వస్తూంటే వేయిపడగలు తెమ్మన్నా. అందులోనూ ఓ సందేహం. దానిమీద ఓ పోస్ట్ పెట్టా. చూసే ఉంటారుగా. ప్రస్తుతం నన్నయ ప్రసన్న కథా కలితార్థ యుక్తి, సాహిత్య సురభి, వేయిపడగలూ కలిపి కొడుతున్నా. చూడాలి ఇంకెన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయో.

   Reply

 2. కొత్తావకాయ
  Apr 05, 2012 @ 04:34:58

  ఎక్కడినుంచి పుడతాయండీ ఇంతందమైన పదాలు. మీకీ సందేహాలూ.. 🙂
  రామచక్కని, అధికచక్కని.. ఇలాగే రామకోణంగి ఏమో! (కోణంగి అనే పదం – కొంటె, తుంటరి.. అనే అర్ధంలో వాడుకలో ఉన్నా నిఘంటువు కొంచెం కటువైన అర్ధమే చెపుతుంది మరి.)

  Reply

  • Phaneendra
   Apr 07, 2012 @ 03:00:53

   కొత్తావకాయ గారూ…

   మీ వెన్న దొంగకి తగిలి ఉండాలి ఈ కోణంగి… కానీ రాముడికి ఎలా అతుక్కుందో అని ఆశ్చర్యం.
   సం – దేహాలకు ఎప్పుడూ సందేహాలే. అలాంటి వాటిలో నాదీ ఒక దేహం. అయినా మీకు తెలీనిదేముందండీ… జవాబులు చెప్పాలంటే పరిజ్ఞానం ఉండాలి కానీ, ప్రశ్నలకు ఎందుకూ…!

   నైఘంటికార్థం పరిశీలించడానికి శబ్దరత్నాకరమో, సూర్యరాయాంధ్రమో అందుబాటులో లేవు. నాన్నగారు మళ్ళీ రాజమండ్రి వెళ్ళాక చూసి చెప్పేంత వరకూ…:(

   రాసిన వాడు విశ్వనాథ. ఏ పల్లెటూరి నుంచి ఎత్తుకొచ్చాడో లేక తానే సొంతంగా కనిపెట్టాడో తెలీదు. ఆయనవి ఓ రెండుమూడు పుస్తకాలు సమాంతరంగా చదువుతున్నా, కాబట్టి నిర్దుష్టంగా చెప్పలేను ఎక్కడిదో.

   Reply

 3. కొత్తపాళీ
  Jun 02, 2012 @ 00:16:26

  phaneendra గారు, నిఘంటువులు ఇప్పుడూ మీకు జాలంలో ఒకే గూట్లో అందుబాటులో ఉన్నాయి.
  http://www.andhrabharati.com/dictionary/index.php

  Reply

 4. kalageeta
  Jun 16, 2012 @ 00:04:06

  Phanidra garu! Online lo labhyamayye anni nighamtuvulu ikkada chudoccu miru-
  http://21stcenturytelugu.blogspot.com/2011/10/blog-post_5743.html

  Reply

 5. veerendra
  Aug 28, 2012 @ 02:24:32

  kotha konangi 🙂

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: