భారతీయత అంటే హిందూ మతమే ఎందుకు కాకూడదు?

భారత దేశానికీ హిందూ మతానికీ సంబంధం లేదన్న మాట విన్నప్పుడల్లా చిర్రెత్తుకొస్తుంది.

“ఈ ప్రపంచంలో అన్ని నాగరకతల కంటె ముందు వెలసినదీ… విస్తృతమైన, సంస్కృతమైన భావధార కలిగి ఉన్నదీ భారతీయమైన సనాతన వైదిక ధర్మం”. ఆ వైదిక లేదా సనాతన లేదా ఆర్ష ధర్మాన్నే ప్రస్తుత కాలంలో హిందూ మతంగా వ్యవహరించడం జరుగుతోంది.

ఆంగ్లంలో “రెలిజియన్” అన్న మాటకు సమానార్ధకంగా మనం “మతం” అన్న మాట వాడుతున్నాం. మన దేశం లోకి ఇస్లాం, క్రిస్టియానిటీ రాక తర్వాతే హిందూ మతం అన్న పదబంధం పుట్టింది.

ఆర్ష ధర్మ అనుసరణలో వర్ణ వ్యవస్థ మాత్రమే ఉండేది. ఆ వ్యవస్థ తదనంతర కాలాల్లో క్రమంగా (వి)పరిణామం చెందుతూ ప్రస్తుత కుల వ్యవస్థగా రూపొందింది. (దాని లోని ఒప్పుతప్పులూ, లోటుపాట్లూ ప్రస్తుత చర్చనీయాంశం కాదు)

సింధుకు ఆవల ఉన్న దేశం సింధు దేశం… అక్కడి ప్రజలు అనుసరించే మతం సింధు మతం అన్నారు ఈ భారత దేశానికి ఆక్రమణ బుద్ధితో వచ్చిన విమతస్తులయిన విదేశీయులు. అవే క్రమంగా హిందూ దేశం, హిందూ మతం అయ్యాయి.

అందువల్ల సనాతనమయిన ఆర్ష సంప్రదాయిక ధర్మాన్ని మతంగా వ్యవహరించడం తప్పు.

నిజం. ముమ్మాటికీ నిజం, అక్షరమక్షరమూ సత్యమే.

కానీ… హిందూ మతం అన్నదే లేదు… హిందూ ధర్మం అన్నదే లేదు… అన్న సత్య వాక్కును దుర్వినియోగం చేస్తున్న తీరును ఆర్ష ధర్మావలంబులు అర్ధం చేసుకోడం లేదు.

శాంతి, ప్రేమలను పంచమన్న వాడి మాటలు నోటిలోనూ, నోటు మూటలను చేతిలోనూ ఉంచుకుని వచ్చిన వారూ…. తమ మతము తక్క మిగిలిన మతాల వారిని భౌతికంగా నిర్మూలించమన్న వాడి ఆదేశంతో కత్తులు పట్టుకు వచ్చిన వారూ… ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకున్న వారూ… ఆర్ష ధర్మావలంబుల ఈ మత రాహిత్యాన్నీ… అమాయకంగా దాన్ని ఒప్పుకుంటున్న ఈ గడ్డ మీది మూలవాసులనీ తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారు,

అసలు భారత దేశమన్న భావనే ఒక అబ్సర్డిటీ అంటున్నారు. ఈ భూభాగం వేలాది జాతుల, రాజ్యాల కూటమి తప్ప దీనికో ఏకత్రితమయిన రూపం లేదని ప్రచారం చేస్తున్నారు, సమైక్యత అన్నదే లేదంటున్నారు. గాంధారానికి ఆవలి నుంచి సి0హళానికి వెలుపలి వరకూ ప్రజలు అనుసరించిన ఒకే ధర్మానికి అసలు ఉనికే లేదంటున్నారు. ఒక మహానదికి పలు ఉపనదులూ పాయలలా… వైదికానికి ఉన్న శైవ, వైష్ణవ, చార్వాక, బౌద్ధ, జైన, ద్వైత, అద్వైతాది ధర్మాలను… భిన్నాలూ, వ్యతిరిక్తాలూ అంటూ ప్రచారం చేస్తున్నారు. తమ మతాల్లోకి ఆకర్షించడం కోసం, మత మార్పిడులు చేయడం కోసం ఈ తరహా ప్రచారం చేస్తున్నారు,

కేరళలోని అనంత పద్మనాభుడి గుడిలో మతపరమైన సందేహం వచ్చినప్పుడు నేపాల్ నుంచి పురోహితులను రప్పించారు. ఏం… దేశపు దక్షిణాన ఓ కొసన ఉన్న ఆలయ ధర్మానికీ.. హిమాలయాల్లో ఉన్న ఆలయ ధర్మానికీ ఎంత అవినాభావ సంబంధం లేకపోతే అలా చేస్తారు? ఆ జాతీ… ఈ జాతీ వేర్వేరా?

అదే రాముడు, అదే కృష్ణుడు, అదే శివుడు, అదే గణేశుడు, అదే బ్రహ్మ, అదే దుర్గ, అదే లక్ష్మి, అదే సరస్వతి… అవే వేదాలు, అవే సూక్తాలు, అవే ఉపనిషత్తులు, అవే పురాణాలు, అవే రామాయణ భారత భాగవతాలు, అదే గీత… ఆసేతు శీతాచలం ఒక్కటే ధర్మం అనడానికి ఈ సార్వజనీనత చాలదా? అవన్నిటినీ హిందూ మతంగా అభివర్ణించినప్పుడు… అదే భారతీయత అని చెప్పడానికి సిగ్గెందుకు? మొహమాటమెందుకు?

అసలు బాధ ఏంటంటే… ఈ ధర్మం బహు దేవతలను ఆరాధిస్తుంది… అదే సమయంలో ఏ దైవాన్నీ ఉపాసించడం తప్పనిసరి అని చెప్పదు, ఈ ధర్మం… జీవితాన్ని గడిపేందుకు కొన్ని మౌలిక సూత్రాలను అందించింది, నియమిత సంస్కారాలను అవలంబించాలని చెప్పింది. అంతే తప్ప ఏ రాముడినో కృష్ణుడినో, శివుడినో ఆరాధించమని చెప్పలేదు, అదీ చేస్తావూ… కానియ్. మంచిది. ఆస్తికతా, నాస్తికతా, వేదాంతమూ, కర్మా, జ్ఞానమూ, అజ్ఞానమూ… నీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. బలవంతమేమీ లేదు.

ఇంత విస్తృతి, వైవిధ్యం ఉన్న ధర్మాన్ని అనుసరిస్తూ జీవించే వాడే భారతీయుడు. ఆ ధర్మాన్ని… అభారతీయమైన కళ్ళతో చూసినవారు రెలిజియన్‌గా పిలుస్తున్నారు. దాన్ని మతం కాదూ అన్న నిజాన్ని, అదొక జీవన విధానం అన్న సత్యాన్నీ వికృత ప్రచారం కోసం వాడుకుంటున్నారు.

అసలు మతం అంటే ఏమిటి? అభిప్రాయాలు కలిగి ఉండడం, ఒకే రకమైన అభిప్రాయాలు ఉంటే సహమతి అంటున్నాం, దానికి భిన్నంగా ఆలొచించే వాడిని రెటమతం వాడంటున్నాం. (ఇదేమీ అపహాస్యం చేసే పదం కాదు…) ఆసేతు శీతాచలమూ మౌలికంగా ఒకే అభిప్రాయాలున్నప్పుడు ఈ భారతీయతను హిందూ మతం అనడంలో తప్పేంటి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలను భూతద్దంలో చూపే వారికి లాల్ సలాం.

Advertisements

6 Comments (+add yours?)

 1. Zilebi
  Mar 06, 2012 @ 06:32:16

  excellent thought provoking article.

  ఈ సో కాల్డ్ హిందూ మతం ఒక వ్యక్తీ చేత ‘సాంప్రదీకరించబడ్డ’ లేక స్థాపించ బడ్డ ‘మతం’ కాక పోవడం, దీని వైశిష్ట్యం. ప్రతి మిల్లీనియా లోనూ సరికొత్త పంథా లో దీనికి భాష్యం చెప్ప గలిగిన సత్తా ఉన్న మహనీయులు ఈ సనతాన ధర్మ హిందూ మతంలో రావడం దీని గొప్ప దనం. పాత చింత కాయ పచ్చడి కాకుండా ఎప్పుడు ఫ్రెష్ అయిన కొత్తావకాయ లా అన్న మాట.

  జిలేబి.

  Reply

 2. kastephale
  Mar 06, 2012 @ 07:36:36

  very interesting article.హిందూ అన్నది మతంకాదు, జీవన విధానం. పశ్చిమ దేశాల వారికి తెలిసినది మతం మాత్రమే. మనది కూడా మతం చేసేశారు.

  Reply

 3. తెలుగు భావాలు
  Mar 06, 2012 @ 15:11:54

  यूनान-ओ-मिस्र-ओ-रूमा, सब मिट गये जहाँ से ।
  अब तक मग़र है बाकी, नामोनिशाँ हमारा ॥

  सारे जहाँसे अच्छा हिन्दोस्ताँ हमारा हमारा ।
  सारे जहाँसे अच्छा हिन्दोस्ताँ हमारा ॥

  ఇతర పురాతన ధర్మాలైన యూనాన్ (యవనులు / గ్రీకు సంస్కృతి), మిశ్ర్ (ఈజిప్టు సంస్కృతి), రూమా (రోమను సంస్కృతి) ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. సనాతన ధర్మం జీవనాడిగా గల ఈ భారత దేశం ఇంకా అలాగే ఉంది. ఇంచుమించుగా ఇక్బాల్ చెప్పిన దాని తర్జుమ…

  Reply

 4. DSR Murthy
  Mar 06, 2012 @ 21:22:22

  మన దేశంలో “దర్మం”, మతం కన్నా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. సమాజ, వ్యక్తీ జీవితం లో అనుసరించాల్సిన నియమాలు, కట్టుబాట్ల సముదాయాన్నే “ధర్మం” అంటాము. ధర్మమనేది కేవలం ఒక దేశానికి, ఒక కాలానికి లేదా ఒక ప్రాంత ప్రజలకు సంభందించినది కాదు. అదే ధర్మం ఒక సమూహముతో, లేదా ఒక వ్యవస్థతో కలిసుంటే అప్పుడది మతమవుతుంది. సత్యం, అహింస, బుద్ది సంపన్నతి, జ్ఞానం, నిదానము, క్షమ, దయ, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహం, పవిత్రత అనే 10 రకాల విశేష గుణాలు “ధర్మం” కు ఉన్నాయని “మను స్మృతి” లో చెప్పబడింది.

  Reply

 5. Chippagiri Gnaneswar
  Sep 17, 2013 @ 10:28:04

  హిందూ మతము ఒక విశిష్ట మతము.ఏ వ్యక్తి,వ్యక్తుల చేతనో ఏర్పడలేదు.నమ్మకము,ధర్మము,సంస్కారములతో హిందూమతము ఏర్పడింది.ఆచార్య డా చిప్పగిరి

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: