లేళ్ళతో మాంసం తినిపించిన విశ్వనాథ

తళతళా మెరుస్తూ… అలల్లా చంచలించే కళ్ళతో… అడవిలో తిరుగుతూ ఉండే లేళ్ళని చూస్తే ఆహ్లాదమూ అభిమానమూ కలుగుతాయి. అందుకేనేమో చికిలి కన్నుల చక్కని చుక్కలను యాణాక్షులంటూ వర్ణిస్తారు.

లేడిని చూస్తే మనకు భయం కలగదు.. ఏ చిరుతనో, సి0హాన్నో, కనీసం ఎలుగుబంటినో చూసినప్పటిలా. దాన్ని దగ్గరకు తీసుకుని ముద్దాడాలనిపిస్తుంది. అది అందకుండా పరిగెత్తుకుంటూ పారిపోతుంటే పంతం కూడా వస్తుంది. కానీ… లేడి విష సర్పాలను తింటుందా?

నమ్మడం కష్టంగా ఉంది కదా. ఆ వాక్యం మొదటిసారి చదివినప్పుడు నేనూ అలాగే ఫీలయ్యాను. కానీ ఆ వాక్యం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. అంతేనా… పాముల్ని తిని నెమరు కూడా వేసుకుంటాయట.

“లేళ్ళు పాములను తిని రోమంథము చేయును”

ఎక్కడో ఓ వాక్యం చదివి… దాన్ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేస్తున్నానని చికాకు పడుతున్నారా? మామూలుగానైతే నేనూ ఆ వాక్యాన్ని వదిలేసే వాణ్ణి. కానీ ఆ మాట చెప్పినది ఎవడో లాకాయి లూకాయి పుల్లయ్య కాదు… కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. మరి వినక, నమ్మక చస్తామా!

ఆధునిక మహేతిహాసం “వేయిపడగలు”లో ఒకానొక సందర్భంలో చెప్పిన వాక్యమది. ఆ సందర్భం ఇప్పుడు గుర్తు లేకపోయినా ఆ వాక్యం యథాతథంగా గుర్తుండిపోయింది.

ఈ విషయం గురించి నాకు కనిపించిన బయాలజీ లెక్చరర్లనీ టీచర్లనీ స్టూడెంట్లనీ ఎంతోమందిని అడిగాను. “లేళ్ళా… పాములను తినడమా… నీకేమయినా పిచ్చా” అన్నట్టు చూశారు.

ఒకానొక సందర్భంలో విస్వనాథ పావని శాస్త్రి గారిని కలిసినప్పుడూ ఈ సందేహం అడిగాను. ఆయనకూ ఈ విషయం తెలీదట.

పోనీ రచయిత చెప్పినది తప్పేమో అనుకుందామంటే అక్కడున్నది ఎవరు! చిన్నప్పటి నుంచీ చెట్లమ్మటా పుట్టలమ్మటా తిరిగిన వాడూ… స్వీయానుభవాలతోనే పంటలూ పొలాల గురించి వందల పుటల వర్ణనలు చేసిన వాడూనూ…!

అయ్యలారా.. అమ్మలారా… ఇదీ నా ధర్మ సందేహం. తీర్చగలరా…?

Advertisements

10 Comments (+add yours?)

 1. కొత్తావకాయ
  Mar 04, 2012 @ 23:58:47

  చిత్రంగా ఉందే! నేను గమనించనే లేదు (వేయిపడగలు చదివినప్పుడు). ఎవరైనా చెప్తారేమో చూద్దాం.

  Reply

  • Phaneendra
   Mar 06, 2012 @ 00:15:14

   కొత్తావకాయ గారూ…

   వేయిపడగల్లో ఇది తప్ప ఇంకేం కనబడలేదా అననందుకు సంతోషం. సుమారు రెండు పదుల యేళ్ళ నుంచీ ఈ సందేహం నన్ను తొలిచేస్తోంది. చూద్దాం.. జీవశాస్త్రజ్ఞులెవరైనా స్పందిస్తారేమో.

   Reply

 2. Zilebi
  Mar 05, 2012 @ 00:19:21

  విశ్వనాధ గారేవరండీ ? ఫారెస్టు ఆఫీసరా ?

  జిలేబి.

  Reply

  • Phaneendra
   Mar 06, 2012 @ 00:19:03

   జిలేబీ గారూ…
   విశ్వనాథ సత్యనారాయణ గారని… ఓ పెద్ద మహా ముదురు (అయ్ మీన్ సీనియర్) అయ్యెప్ఫెస్స్ ఆఫీసర్‌లెండి. ఒక పామూ వెయ్యి పడగలూ అంటూ పొలోమని వెయ్యి పేజీల పుస్తకం రాసి పారేశాడు చాన్నాళ్ళ క్రితం. 🙂

   Reply

 3. కామేశ్వరరావు
  Mar 06, 2012 @ 16:18:21

  ఈ వాక్యం వేయిపడగల్లో ఎక్కడుందో తెలిస్తే కాని ఏం చెప్పగలం? అంత కాలంనుండీ వేధిస్తుంటే ఒక్కమారు పుస్తకాన్ని తిరగేస్తే బాగుండేదికదా!

  Reply

  • Phaneendra
   Mar 06, 2012 @ 23:21:58

   మాస్టారూ…
   నా దగ్గర పుస్తకం ఇప్పుడు లేనందున సందర్భం చెప్పలేకపోతున్నాను, కాకపోతే… అది వర్ణనల్లో ఒక భాగంగా ఉటంకించినదే తప్ప కథా గమనంతో సంబంధం ఉన్నది కాదు, అంతవరకూ కచ్చితంగా చెప్పగలను.

   Reply

 4. ఉష
  Mar 10, 2012 @ 21:52:23

  నా దగ్గర సమాధానం లేదుగానీ, వేయిపడగలు తిరగేస్తాను. చదివిన గుర్తు లేదిప్పటికి. బహుశా “విశ్వనాథుని కౌటిల్యుడు” గారికి తెలిసే ఉండాలి. ఆయనకీ ఒక మాట చెప్పుంచాను.

  Reply

 5. GEO LAXMAN
  Oct 16, 2012 @ 09:44:38

  abhutha kalpana sristinchadam a maha rachayataku enta pani.anandinchandi!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: