16యేళ్ళ బాలాకుమారుడు మా నాన్నగారు

కాలం ఉన్మత్తోద్విగ్నంగా ప్రవహించే మహా నది అన్నాడో పెద్దాయన. (జీవీయెస్ గారేనా?) దొంగ బెబ్బులి కాలం అని నేనో సందర్భంలో రాసుకున్నా. పరమాణు స్థాయి నుంచి కల్పాలూ మహాకల్పాల వరకూ కాల గణన చేసింది భారతీయ ఋషి పరంపర. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకూ లెక్క మనదయితే అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకూ అన్నది పడమటి లెక్క. ఇప్పుడు ప్రపంచమంతా గ్రెగోరియన్ క్యాలండర్ ఆధారంగా నడుస్తోంది. దానిలో ఓ సమస్య ఏంటంటే రోజుకు కచ్చితంగా 24 గంటలే ఉండవు. అక్కడి నుంచీ అదనపు రోజులు వచ్చి పడతాయి. ప్రతీ 4యేళ్ళకొకసారి వచ్చే లీప్ యియర్ కథ అదే కదా. మరి తెల్లోడి పద్ధతిలో యేటా పుట్టినరోజు చేసుకునేటప్పుడు ఫిబ్రవరి 29న పుట్టిన వారికి సమస్యే మరి. ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే మా నాన్నగారి పుట్టినరోజు ఇవాళే. 29-02-1948నాడు పుట్టారాయన, ఐతే ఆయనకు ఆ పట్టింపు లేదు. తిథుల ప్రకారం చేసుకుంటారు. ఆ వేళైనా… పూజ చేసుకోడం, గుడికి వెళ్ళడం తప్ప కొత్త బట్టలూ… కొత్త కొనుగోళ్ళూ… కొత్త సినిమాలూ అన్న ఆరాటాలేమీ లేవాయనకు. అదేమీ 60యేళ్ళు దాటినందున కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఆయన పుట్టినరోజు జరుపుకున్న తీరదే. మాకు తెలవడానికి ముందు కూడా… తొమ్మండుగురు అన్నాదమ్ముల కుటుంబాల బాధ్యతల్లో భుజంపట్టిన ఆయనకు తనకైన వేడుకల మీద ఆసక్తి ఏనాడూ లేదని మా అన్నలూ అక్కలూ చెప్పే మాట, స్వతహాగా ఉపాధ్యాయుడైన ఆయన తన ఆచరణే పాఠంగా మాకు నేర్పిన విలువలను అవలంబించడానికే నానా కష్టాలూ పడుతున్న నేను.. ఆయనకు చేయగలిగిందేముంది… పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తప్ప.

Advertisements

3 Comments (+add yours?)

 1. kastephale
  Mar 01, 2012 @ 05:42:15

  Pl convey this to your father. “happy birth day and many happy returns of the day.”

  Reply

 2. సుభ/subha
  Mar 01, 2012 @ 10:33:59

  ఆలశ్యంగా మీ నాన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలండీ..

  Reply

 3. Phaneendra
  Mar 01, 2012 @ 12:08:24

  శర్మ గారూ, శుభ గారూ
  ధన్యవాదాలు.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: