పాత కాలపు మోటు మానిసి

కొన్నాళ్ళ క్రితం బ్లాగ్లోకంలో పడి తిరుగుతున్నపుడు… విశ్వనాథను “వ్యక్తిగతంగా” విమర్శిస్తూ నరిశెట్టి ఇన్నయ్య రాసిన వ్యాసాన్ని “దీప్తిధార”లో చదివాను. అక్కడ జరిగిన చర్చా చూశాను.. ఆహా… అనుకున్నాను.

ఇటీవలే విశ్వనాథ నాటక, విమర్శ సంపుటులు కొని చదువుతున్నాను. వాటిలో “కల్పవృక్ష రహస్యములు” పేరిట స్వీయ రచనకు చేసిన వ్యాఖ్యానం చదవడం నిన్న రాత్రే మొదలు పెట్టాను. ఈ పొద్దున్న బ్లాగులు తెరవగానే “మానవవాదం”లో ఇన్నయ్య వ్యాసం పునర్ముద్రణ కనిపించింది.

ఈ సందర్భంలో… “పాత కాలపు మోటు మానిసి యని నన్ను యీసడించుకొందురని నాకు తెలియును” అని వేయి పడగల ధర్మారావు చేత పలికించిన విశ్వనాథ… కల్పవృక్ష రహస్యములకు తొలిపలుకులో చెప్పిన కొన్ని విషయాలను ప్రస్తావించడం ఆసక్తికరంగా ఉంటుందని అనిపించి….

*** *** ***

నేనచ్చముగా వాల్మీకినే యనుసరించితిని. కొన్ని చోట్ల నతిక్రమించి వ్రాసితిని. కొన్నింటిని లోపింప జేసితిని. నా రామాయణము నాది, ఏ పురాణమైనను, ఏ ఇతిహాసమైనను, ఏ కావ్యమైనను లోకము యొక్క కథను వదిలిపెట్టి యుండదు. పేరునకు రామాయణము. పాత్రల ననుసరించి, కథ ననుసరించి కవి యొక విశిష్ట బుద్ధి కలవాడు తన కల్పనలను తాను చేసుకొనును.

ఇది యిట్లుండగా ఒక్కొక్క కథ తీర్పు ఒక్కొక్క పద్యము చేయుటలోని నేర్పు ఒక భావము నందలి మార్పు రచనా శిల్పము అలంకారముల క్రొత్తదనము, తనకు తోచిన భావములను కొన్నింటిని గూఢముగ నిక్షేపించుట, కొన్ని పైకి భాసించునట్లు చేయుట, కొన్నింటిని వాచ్యము చేయుట, ఎచ్చటనేది ఆ కవికి ఔచిత్యమనిపించునో అతడట్లు చేయును.

పాఠకునకు సర్వము తెలియక పోవచ్చును.

… … …
… … …

“తస్మై స్వాదు పరాఙ్ముఖాయ నమః” అన్న మాట సంస్కృతములో ప్రచలితముగా నున్నది. కొందరికి లోతైన భావములు ఆలోచన చేతను వ్యక్తమయ్యెడి అక్కఱలేదు. వారి ప్రకృతిలో నదియుండదు. అచ్చట కావ్యమేమియు పనిచేయదు. కొందరికిని సాహిత్య జ్ఞానమే యుండదు. ఔచిత్య జ్ఞానమంతకంటే పూర్ణానుస్వారము. వారు యధేచ్చగా విమర్శ చేయుదురు. తేభ్యో నమః.

… … …
… … …

( ఈ రహస్యములున్న ) గ్రంథము వ్రాయుట యెందుకనగా ( ఈ పైన లక్షణములు కల వారు ) పండితులలోన నుందురు, పామరులలోన నుందురు. పామరులకు “నమోవాకం ప్రశాస్మహే”. పండితులకు ఈ గ్రంథము సహాయకారిగా నుండును. భావుకుల కధిక ప్రయోజనకారిగా నుండును. మరియు భావుకులలో కొందఱికిది వట్టి సూచన. వారే బహు విషయములను చెప్పగలరు. …. …. …. చదువుకోని వారి యందు కూడ భావుకులుందురు. పామరుడు, అనగా చదువుకోని వాడు భావుకత్వము లేని వాడు, నోరు మాటాడుచుండగా నొసలు వెక్కిరించుచుండువాడు. వాడు పామరులలో శిఖామణి. వాడెట్టి వాడనగా వాడొకటి తప్పనును. తప్పు కాదని పండితులు నిరూపింతురు. మంది బలము చేత వాడింకను తప్పే యనుచుండును. వానికి తాళము వేసెడివారు నుందురు. అహో! ఏమి చిత్రమైన దేశము !

పోనీ ! ఈ నా కల్పవృక్ష రహస్యములన్న గ్రంథము కొందఱికి నిస్సంశయముగా సహాయకారిగా నుండునని వ్రాయుచున్నాను. దీనిని కూడ విమర్శించు వారుండకపోరు. వారు లేకుండ ఈ దేశమే లేదు.

*** *** ***

“కేవలం భట్రాజుల పొగడ్తలూ… తన భావాలను తనే ప్రచారం చేసుకోడమూ వల్ల మాత్రమే గొప్పవాడు తప్ప మరే రకంగానూ ఏ ఒక్క సాహిత్య ప్రక్రియలోనూ కనీస స్థాయి సంపాదించలేకపోయిన విశ్వనాథ” ఈ నాటికీ ఎందుకు నిలిచి ఉన్నాడో కొంచెం అర్ధమయినట్టనిపించింది. మరి మీకేమనిపించింది?

Advertisements

2 Comments (+add yours?)

 1. కొత్తపాళీ
  Feb 11, 2012 @ 18:41:02

  Brilliant

  Reply

 2. Phaneendra
  Feb 15, 2012 @ 12:35:25

  కొత్త పాళీ గారూ…
  ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుడను. ధన్యవాదాలు.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: