సైన్సుకి సెన్సుందా?

డాన్ బ్రౌన్ రచనల్లో డావిన్సీ కోడ్ కంటే నాకు ఏంజెల్స్ అండ్ డెమన్సే బాగా నచ్చుతుంది. మోడెస్ ఆపరాండి రెంటిలోనూ ఒకటే అయినా… సైన్సుకీ మతానికీ మధ్య వాదన… ( కొత్త అంశాలేమీ లేకపోయినా… ) సరదాగా ఉంటుంది.

సైన్సు తర్కానికి లోబడి… దానికి మాత్రమే లోబడి… ఉంటుంది, కరెక్టే. కానీ.. ఫలితాల మీద దానికి ఆసక్తి ఉండదు. ఆ నిర్వికారత శాస్త్రీయంగా సరయినదే అయినా… దాని ఫలితం సమాజం మీద తీవ్రంగా, నిశితంగా ఉంటుందన్న మాట నిజమే కదా.

తొలి దశ ప్రస్థానంలో సైన్సు కనుగొన్న విషయాలు ప్రపంచం అంతటికీ ఆసక్తి కలిగించినవే. కానీ క్రమంగా సైన్సు పెరుగుదల ఒక ప్రతిష్టంభన దశకు చేరుకుంది. అక్కణ్ణుంచీ టెక్నాలజీ అందుకుంది. సైన్సు ఆవిష్కరణలకు పొడిగింపుగా టెక్నాలజీ నడుస్తోంది.

ఫిజిక్సు, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, కంప్యూటర్స్, బయోటెక్నాలజీ…, ఏ సైన్సయినా కానీయండి, దాని గతి ఇప్పుడు ఏ దశలో ఉంది? అని చూస్తే… కొత్తగా కనుగొన్న అంశాల కంటే… పాత అంశాల కొనసాగింపు మాత్రమే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కొన్ని నిర్దుష్ట సూత్రాల అప్లికేషన్సు మాత్రమే సాగుతున్నాయి.

ఐతే వాటి ప్రభావం సమాజం మీద ఎలా ఉంటోంది? ఐన్‌స్టీన్ గొప్పవాడే కావచ్చు… కానీ సాపేక్ష సిద్ధాంతం ఎంతమందికి పనికివచ్చిందో తరవాత సంగతి… కనీసం అర్ధం అయినది ఎంతమందికి?

పదార్ధ నిర్మాణం ఆసక్తికరమే కావచ్చు… కానీ దానితో ప్రత్యేక ప్రయోజనం ఏమిటి? పరమాణువులు కలిసి జీవ, నిర్జీవ పదార్ధాలుగా ఏర్పడడం ఉద్విగ్నకరమే కావచ్చు.. కానీ ఆ జ్ఙానం దేనికి దారి తీస్తోంది?

నిజమే… భౌతికపరమైన ప్రాపంచిక సుఖాలన్నిటికీ కారణం సైన్సు ఆవిష్కరణలే. కానీ… అవి సమాజానికి ఎందుకు పనికొస్తున్నాయి?

పొద్దున్న లేస్తే కరెంటుతో లేని పని మన జీవితంలో లేదు. దాన్ని కనుక్కోవడం సైన్సు గొప్పదనమే. తెల్లారి లేస్తే టీవీ చూడనివాడెవడు? ఇప్పుడు అయితే.. ఇంటర్‌నెట్ వాడని వాడెవడు? సెల్ ఫోన్ వాడని వాడెవడు? నిజమే.. నిజమే…! కానీ అవి మనిషికి చేసే ఉపయోగం ఎక్కువా, అపకారం ఎక్కువా?

అత్యంత సంక్లిష్టమైన సైన్సులను వాటి వాస్తవిక స్ఫూర్తితో ఆకళింపు చేసుకుంటున్న వారూ… వినియోగిస్తున్న వారూ ఎంతమంది ఉన్నారు?

కరెంటుతో ఇంటి పనులు చేసే పరికరాలు వాడుకోవచ్చు… వినోదాన్నిచ్చే(?) సినిమాలూ, టీవీలూ చూడొచ్చు.. ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి ఎలాంటి రోగాలు వచ్చినా చికిత్స పొందవచ్చు. ఇంటర్‌నెట్‌లో ప్రపంచాన్నంతటినీ చుట్టేయవచ్చు.

వాడుకో… వినియోగించుకో. అంతే కానీ ప్రకృతి ఇచ్చిన శక్తిని వినియోగించడాన్ని, దాని నియమాలకు లోబడి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించడం ఎవరికి తెలుస్తోంది?

సైన్సు అతి పెద్ద బలహీనత… దానికి హృదయం లేకపోడమే…! అందుకే అంటున్నది… సైన్సుకి సెన్సు లేదని.

Advertisements

8 Comments (+add yours?)

 1. రాలుగాయి
  Jan 21, 2012 @ 06:45:10

  సాపేక్ష సిద్ధాంతం అర్థం ఎందుకు అర్థం చేసుకోవాలి? చేసుకున్నా, చేసుకోలేకపోయినా పెదా తేడాలేని సిద్ధాంతాలతో మనకు పనేంటి? సైన్స్ అంటేనే సెన్స్‌లెస్ అని తీర్మానించిన మీ సెన్సుకు నా నమస్సుమాంజలులు. వేసుకోండి మూడు వీరతాళ్ళు, పెట్టుకోండి ఖాళీ బోర్నవిటా డబ్బా కిరీటం.

  Reply

 2. Phaneendra
  Jan 22, 2012 @ 18:43:43

  రాలుగాయి గారూ…

  మీ వ్యంగ్యం పూర్తిగా అర్ధం కాలేదు. మరికొంచెం వివరంగా తిట్టి ఉంటే బాగుండేది.

  నిజానికి ఎప్పటి నుంచో రాయాలనుకుంటున్న ఈ అంశం మీద… రాస్తున్న సమయంలో నాలోనే కొంత స్పష్టత రాలేదు. మరింత స్పష్టంగా, మరింత సోదాహరణంగా రాయాల్సి ఉంది.

  ఐతే చిన్న దురాశ ఏం పడ్డానంటే… నలుగురయినా వచ్చి రాళ్ళు వేయకపోతారా… అప్పుడు నా లోపలి ఆలోచన కొంతయినా బయటకు రాకపోతుందా అని.

  ధన్యవాదాలు.

  Reply

 3. bondalapati
  Feb 06, 2012 @ 20:10:53

  Phaneendra garu,
  మీరు సైన్స్ యొక్క సమగ్రతను ప్రశ్నిస్తున్నారేమోననిపిస్తుంది. సైన్స్ పలానా ది ఎలా పని చేస్తుందో చెప్తుంది, ఇంజినీరింగ్, టెక్నాలజీ దనిని అప్లై చేసి పరికరాలను తయారు చేయటానికి ఉపయోగ పడతాయి. కానీ సైన్స్ ని దేనికి ఉపయోగించాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ని ఎలా అరికట్టాలి, లేక ఒక పరికరాన్ని సమాజం లో ప్రవేశపెట్టే ముందు దానివలన ఉండే లాభాలు నష్టాలను అధిగమిస్తున్నాయా? లేక దాని వలన సమతౌల్యం దెబ్బ తిని ముందు కంటే పరిస్థితి దిగజారుతుందా? ఇవన్నీ సైన్స్ చేతిలో లేవు. ఇవన్నీ పట్టించుకోకుండా కూడా సైంటిస్టులు ఆవిష్కరణలు చేయగలుగుతారు. వీటిని సమాజమే పట్టించుకోవాలి. Pls see my this post: http://wp.me/pGX4s-dB

  Reply

 4. Phaneendra
  Feb 07, 2012 @ 09:51:21

  బొందలపాటి గారూ…

  నేను సైన్సు సమగ్రతను ప్రశ్నించడం లేదండీ. దాని నిర్వికారత గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సైన్సు దానంతట అది ఎవరికీ అపకారం చేయలేదు కరెక్టే. కానీ దాన్ని, దాని గురించి తెలిసిన వారూ, తెలీని వారూ అందరూ వాడుకునే అవకాశం, దాని వల్ల కలిగే చెడును నియంత్రించే స్థాయిని అధిగమించేలా చేస్తోంది. అప్పుడు కలిగే విపరిణామాలకు సైన్సుకు ఏ మాత్రం బాధ్యత ఉండదు. దాన్ని తప్పు పట్టలేం కూడా.

  నా బాధల్లా ఏంటంటే… ప్రమాదం కలిగించగల సైంటిఫిక్ అప్లికేషన్స్‌ని ప్రజలకు దూరంగా ఉంచవలసిన బాధ్యత లేదా? అని. సైంటిస్ట్ తన ప్రయోగ ఫలితాలని అందరితో పంచుకోడానికి ఉవ్విళ్ళూరడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ సమాజం పై అతనికీ బాధ్యత ఉంటుంది కదా.

  మచ్చుకి… కంప్యూటర్లనే తీసుకోండి. వాటి అవసరం ప్రతీ ఒక్క మనిషికీ ఉందా? మాన్యువల్‌గా చేయలేని పనులు దాన్ని వాడుకోవచ్చు. అంతరిక్ష పరిశోధనల్లోనో, రోబోటిక్స్‌లోనో లేదా మరే ఇతర సంక్లిష్ట అవసరాలకో వాడుకుంటే సరి. కానీ వ్యాపారాలు చేసుకోడానికీ… అకౌంట్లు చూడడానికీ కూడా… కంప్యూటర్లే, ఇవాళ కనీస స్థాయి కంప్యూటర్ జ్ఞానం ఉంటేనే అక్షరాస్యుడంటున్నారు. ఉత్పాదక రంగాలు తప్ప సేవా రంగాలన్నింటిలోనూ ఈ కలకలు లేకుండా ఏ పనీ జరగడం లేదు. నిజంగా అంత అవసరం ఉందా?

  అలా అని నేనేమీ ఆధునికతను వ్యతిరెఏకించడం లేదు. కానీ సగటు మనిషి తన విచక్షణను పూర్తిగా విస్మరించేలా చేస్తున్నది సైన్సు అవడం నాకు ఎంతో బాధ కలిగించే అంశం.

  Reply

 5. తెలుగు భావాలు
  Feb 26, 2012 @ 14:28:05

  నిజమే! అద్భుతమైన చిత్రం. ఈ చిత్ర సన్నివేశం నా టపా ఒకదానికి ఆధారంగా వాడుకున్నాను కూడా!

  నా ఉద్దేశ్యంలో Science ఒక ఆయుధం వంటిది. ఎవరి చేతిలో ఉన్నదీ, దాన్ని ఎలా వాడతారు అనే అంశాలు కూడా పరిగణనలో తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఎలాగయితే దైవీ క్రియలు వేదాల్లో ఉన్నాయో, వెతుకున్నే వాళ్ళకి ఆభిచారాలు అందులోనే దొరికాయి. e=MC2 అనే సిద్ధాంతంలో ఒకరికి అణ్వాయుధం కనబడవచ్చు, ఒక యోగికి శివశక్తుల అనుభందమూ కనబడవచ్చు.

  Reply

  • Phaneendra
   Feb 26, 2012 @ 17:22:03

   తెలుగు భావాలు గారూ…
   నాకు ఆ చిత్రాల కంటె నవలలే బాగా నచ్చాయి. ఏంజెల్స్ & డెమన్స్ నవల్లో శాస్త్రం వెర్సెస్ మతం చర్చ సినిమాలో కంటె విస్తృతంగా ఉంటుంది. వీలయితే చదవండి.

   సైన్సును వాడుకునే తెలివి మనిషికి సవ్యంగా లేదని నా భావన. అందుకే సైంటిస్టులు తమ పరిశోధనలను పరిమితం చేసుకుంటే బాగుంటుందేమో అని ఆశ.

   Reply

 6. rpratapa
  Jan 18, 2014 @ 01:03:50

  Science vs Sagacity !

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: