పౌష్యలక్ష్మీ… నిజంగా కరుణించావా!

సంక్రాంతి ప్రధానంగా రైతుల పండుగ. పంట చేతికి వచ్చి, చేతి నిండా సిరులు పొంగుతుంటే ఆ ఆనందంలో చేసుకునే పండుగ. అలాంటిది ఈసారి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏం బాగోలేదు. అసలు గత కొంత కాలంగా రైతుకు ఏదీ కలిసి రావడం లేదు. విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, వాటికే అధిక ధరలూ, వాటి కోసం భారీ అప్పులూ, అసలా అప్పులు పుట్టడానికీ తప్పని తిప్పలూ, చచ్చీ చెడీ పంట పండించినా మార్కెట్లో గిట్టుబాటు కాని ధరలు. ఆ కొంచెం ధరా ఇవ్వకుండా నానా నాటకాలూ ఆడే దళారులూ… మనందరికీ కళ్ళకి కట్టినట్టు కనిపించే నిజం… మనం ఇంట్లో వాడకానికి కొందామంటే బియ్యం ధర 30 రూపాయలు తగ్గదు… రైతుకు మాత్రం అందులో కనీసం సగమైనా రాదు.. ఏదైనా అంటే రవాణా ఖర్చులూ, దళారుల కమిషన్లూ, నా బొందా, నా పిండాకూడూ, నా శ్రాద్ధం…!

పేరుకి ఇప్పటికీ వ్యవసాయ ప్రధాన దేశం… పల్లెలే ఎక్కువ ఉన్న దేశం. సరే… పారిశ్రామిక అభివృద్ధి అక్కర్లేదని ఎవరూ అనరు. కానీ ఇప్పటికీ మన బడ్జెట్లో వ్యవసాయ ఆదాయానిదే మెట్టు వాటా. ఐనా పట్టించుకునే నాథుడుండడు. ఆ శరద్ పవార్ మాట మాట్లాడితే తనను మించిన రైతు అభ్యుదయ వాది లేడన్నట్టూ మాట్లాడతాడు. విదర్భ ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. విధానపరమైన నిజాయితీ లేని చోట రైతు సంక్షేమం ఎండమావే.

అవును… నిన్నా ఇవాళా ఏ చానెల్ చూసినా పండుగ సంబరాలే. కానీ అవి ఎందరి పరిస్థితులకు దర్పణం? సరే… పండగ పూట కూడా, అందునా వారాంతంలోనూ కష్టాలూ… కన్నీళ్ళూ చూపించాలా… అన్నది సహేతుకమే. కానీ… అసలు సంక్రాంతి మౌలికంగానే రైతుల పండుగ కదా. వారిలో ఎక్కువ మంది ఏడవలేక నవ్వుతున్నారు. సంప్రదాయం చూరు వదల్లేక దాన్నే పట్టుకు వేలాడుతున్నారు. పౌష్యలక్ష్మి కరుణించకపోయినా కొలుస్తూనే ఉన్నారు. ఎంతైనా మనిషి ఆశాజీవి కదా!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: