నేను జర్నలిస్టు నెట్లయిత?

ఇదేమీ కంచ ఐలయ్య గారి సైద్ధాంతిక చర్చ లాంటిది కాదండోయ్.

కలలు కనడం కూడా సరిగా రాని నాలాంటి కింకర్తవ్యతా విమూఢుడున్నూ జర్నలిస్ట్ అయిపోగలిగాడే అనే ఒకానొక విచికిత్స.

మా నాన్న గారు అంటూ ఉంటారు… కర్త, కర్మ, క్రియ సరిగా లేకపొటే వీడికి ఒక వాక్యం ఐనా సరిగా అర్ధం అవుతుందో లేదో అని.

ఎందుకు, ఏమిటి, ఎలా.. అన్న ప్రశ్నలకు సరి అయిన జవాబులు లేకుండానే చేసేయగల వృత్తి ప్రస్తుతం జర్నలిజం ఒకటే అనుకుంటా. 🙂

ఒకానొక ఇసుక రేణువు సమాచారాన్ని బదిలీ చేసేస్తోంది అని చదువుతుంటే… అది సాధ్యం అవుతున్నది ఎలా, ఎందుకు అన్న ప్రశ్నలకు నేటికీ జవాబు దొరకలేదు….. విజ్ఞాన శాస్త్రాలకు కాదు, నాకే.

అందుకే… సైన్సులకీ టెక్నాలజీ చదువులకీ దూరంగా ఉండిపోయా.

గతాన్నీ, వర్తమానాన్నీ చూపించే సామాజిక శాస్త్రాల్లోనూ… ఈ ప్రశ్నలకు ప్రాధాన్యత లేకపోడం చూస్తే అసలేం జరుగుతోంది? నాకు తెలియాలి? అని ప్రశ్నించుకున్నా… దాని ప్రతిధ్వని నా గుండెలోనే సరిగ్గా వినపడలేదు.

టెంక కొంచెం ముదిరాక… అంత యాబ్-స్ట్రాక్ట్ ప్రశ్నలకి తాత్విక స్థాయిలో మాత్రమే దొరుకుతాయి అని అర్ధం అయింది.

బద్ధకానికి కేరాఫ్ ఎడ్రస్ లాంటి మనకీ, ఫిలాసఫీకీ సరిపడడం కష్టం అని గ్రహించేయడానికి ఎంతో కాలం పట్టలేదు. 🙂

నిరంతరం నిద్రపోతూ కలలు కంటూ మధ్యమధ్యలో లేస్తూ ఉండే మన లాంటి వాడికి సరిపోయేది ఏంటా… అని వెతుకులాడా.

అప్పుడే… జిడ్డు కృష్ణమూర్తి సిద్ధాంతాన్ని మౌలిక స్థాయిలో పరిచయం చేసే ఒక క్యాసెట్లో చెప్పిన మాటలని మనకి వర్తింపచేసుకుంటే పోలా అన్న దుర్మార్గమైన ఆలోచన వచ్చింది.

జరుగుతున్న ఘటనలను ఓ తటస్థ తలం నుంచి నిరామయమైన మనసుతో చూడగలిగితే ఏ గొడవలూ ఉండవు… లాంటిదేదో చెప్పాడాయన.

నాకు అర్ధం అయింది మాత్రం ఒక్కటే…. గోడ మీద పిల్లి లా ఉండగలిగితే చాలు అని.

దానికి జర్నలిజానికి మించిన వృత్తి ఏముంటుంది! అందునా టీవీ జర్నలిజం… 🙂

ఇంకేం… రంగంలోకి దిగిపోయా.

అట్లా నేను జర్నలిస్టు నయినా.

Advertisements

5 Comments (+add yours?)

 1. సుజాత
  Dec 29, 2011 @ 08:16:00

  Excellent!
  ఇంతకంటే ఏమీ చెప్పలేను.

  Reply

 2. joyd
  Dec 29, 2011 @ 12:12:17

  super fact seppinaavu guruvaa..hats off to ur honesty…

  Reply

 3. Phaneendra
  Dec 31, 2011 @ 01:42:10

  Sujata, Joyd… Thank You.

  Reply

 4. nene
  Dec 31, 2011 @ 16:03:50

  vruddanari pativrata annattu tisesine journalist lu vedantam chebutunnaru .mi sangati teliyadu kani yekkuvaga ala jarugutondi

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: